Bollywood Star Akshay Kumar acting as Lord Shiva in OMG 2 New Poster - Sakshi
Sakshi News home page

OMG 2: శివుడిగా అక్షయ్‌ కుమార్‌.. లుక్‌ అదిరిందిగా!

Published Sat, Oct 23 2021 3:14 PM | Last Updated on Sat, Oct 23 2021 4:07 PM

Bollywood Star Akshay Kumar Channels Lord Shiva in OMG 2 New Poster - Sakshi

టాలీవుడ్‌ స్టార్స్‌ పవన్‌ కల్యాణ్‌, వెంకటేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గోపాల గోపాల’ రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. 2012లో విడుదలైన దాని హిందీ మాతృక ‘ఓ మై గాడ్‌’ మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో లీడ్‌ రోల్స్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, పరేశ్‌ రావెల్‌ నటించారు. ఇప్పుడు ఈ సినిమాకి సిక్వెల్‌ రానుంది.

మొదటి ‘ఓఎమ్‌జీ’లో కృష్ణుడిగా కనిపించాడు అక్షయ్‌. కాగా ఈ సారి రాబోతున్న ‘ఓఎమ్‌జీ 2’లో శివుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశాడు ఈ నటుడు. ఇంతకుముందు ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడు మరో సోషల్‌ ఇష్యూతో రానున్నట్లు ఈ స్టార్‌ తెలిపాడు. దీనికి అందరి ఆశీర్వాదాలు, ఆదరణ కావాలని కోరాడు. ‘ఈ జర్నీలో అందరినీ ఆ ఆదియోగి ఆశీర్వదిస్తాడు. హర హర మహదేవ్‌’ అంటూ రాసుకొచ్చాడు.

చదవండి: మనం కలిస్తే చోలే భాటురే తిందాం.. కేబీసీ కంటెస్టెంట్‌కి తాప్సీ ఆఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement