
బాలీవుడ్ మోస్ట్ బిజియెస్ట్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. ఇప్పటికే ఆయన నటించిన సూర్యవంశీతో పాటు మరో మూడు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా అక్షయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అక్షయ్ కుమార్, పరేశ్ రావల్, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై గాడ్’. ఈ సినిమాని తెలుగులో‘గోపాల గోపాల’గా రీమేక్ చేశారు. ఇందులో విక్టరీ వెంకటేశ్, పవన్ కల్యాణ్ హీరోలుగా నటించారు.
ఇప్పుడు ‘ఓ మై గాడ్’కి సీక్వెల్ రాబోతుంది. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో ‘ఓ మై గాడ్-2’తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో అక్షయ్ మరోసారి దేవుడి పాత్రలో నటించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన 15 రోజుల కేటాయించారు. అమిత్ రాయ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment