అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’. వీర్ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్ కౌర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ మూవీని దర్శక ద్వయం సందీప్ కెవ్లానీ– అభిషేక్ అనిల్ కపూర్ తెరకెక్కించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్ వార్ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ‘స్కై ఫోర్స్’ సినిమాను తీశారని బాలీవుడ్ సమాచారం.
ఈ చిత్రంలో కమాండర్ కేవో అహుజా పాత్రలో అక్షయ్ కుమార్, టి. విజయ పాత్రలో వీర్ పహారియా నటించారు. దినేష్ విజయ్, జ్యోతీ దేశ్ పాండే, అమర్ కౌశిక్, సాహిల్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఆదివారం ‘స్కై ఫోర్స్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘యుద్ధం మొదలైంది’, ‘..అండ్ ది మిషన్ ఈజ్ కాల్డ్ మిషన్ స్కై ఫోర్స్’, ‘కౌన్ జనాబ్... కౌన్ జనాబ్... తేరా బాప్... హిందూస్తాన్’, ‘విజయ రూల్స్‌ని బ్రేక్ చేశాడు...’, ‘సార్... అతడ్ని కనిపెట్టడంలో మనం పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’, ‘మీరందరూ అతను ఓ పిచ్చివాడిలా ప్రవర్తించాడు అన్నారు. కానీ అతనికి ఉన్న ఆ పిచ్చి దేశభక్తి’ అనే డైలాగ్స్ విడుదలైన ట్రైలర్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment