అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్కైఫోర్స్’. దర్శకద్వయం సందీప్ కెవ్లానీ, అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించారు. సారా అలీఖాన్, వీర్‌పహడియా కీలకపాత్రలుపోషించారు. దినేష్ విజన్, జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలోపాల్గొన్న అక్షయ్ కుమార్ విలేకరులు అడిగన ప్రశ్నలకు బదులిస్తూ–‘‘నేను నటించిన ‘భూల్ భులయ్యా’ సినిమా 2007లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
అయితే ఆ మూవీకి సీక్వెల్స్‌గా వచ్చిన ‘భూల్ భులయ్యా 2’(2022), ‘భూల్ భులయ్యా 3’(2024) సినిమాల్లో నేను నటించకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు.. ఆ చిత్రాల నుంచి నేను తప్పుకోనూ లేదు.. వాళ్లే నన్ను తప్పించారు’’ అని పేర్కొన్నారు. అక్షయ్ చెప్పిన ఈ మాటలు బాలీవుడ్‌లో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment