‘ఓ మైగాడ్’లో నయన? | Nayan in Oh My God | Sakshi
Sakshi News home page

‘ఓ మైగాడ్’లో నయన?

Apr 8 2014 11:46 PM | Updated on Sep 2 2017 5:45 AM

‘ఓ మైగాడ్’లో నయన?

‘ఓ మైగాడ్’లో నయన?

కథానాయికలు డేట్స్ ఇవ్వడం, అనివార్య కారణాల వల్ల సినిమా ఆలస్యమైతే... సదరు నిర్మాతలు ఆ డేట్స్‌ని వేరే సినిమాకు ఉపయోగించుకోవడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది

కథానాయికలు డేట్స్ ఇవ్వడం, అనివార్య కారణాల వల్ల సినిమా ఆలస్యమైతే... సదరు నిర్మాతలు ఆ డేట్స్‌ని వేరే సినిమాకు ఉపయోగించుకోవడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఇటీవల నయనతార విషయంలో అదే జరిగిందట. వివరాల్లోకెళితే.. వెంకటేశ్-మారుతి కాంబినేషన్‌లో రూపొందాల్సిన ‘రాధ' చిత్రంలో నయనతార కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ... కొన్ని కారణాల వల్ల ‘రాధ' సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో నయన డేట్స్‌ని వృధా చేయలేని నిర్మాత డీవీవీ దానయ్య... వెంకటేశ్ హీరోగా రూపొందనున్న ‘ఓ మై గాడ్’ రీమేక్‌కి ఆ డేట్స్‌ని ఇచ్చేశారట. ఇది సినీవర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్త. కిషోర్‌కుమార్(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే.
 
 మాతృక పరంగా చూస్తే.. ఈ భారీ మల్టీస్టారర్‌కి కథానాయికతో పనిలేదు. అయితే... కథలో జనరంజకమైన కొన్ని మార్పులు చేసి వెంకటేశ్‌కి జోడీగా నయనతారను నటింపజేస్తున్నారట దర్శకుడు డాలీ. ఇందులో నయన పాత్రను భిన్నంగా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. నటిగా ఆమెను మరో స్థాయిలో కూర్చోబెట్టేలా ఈ పాత్ర ఉంటుందని వినికిడి. ‘రాధ' మిస్సయినా.. ‘ఓ మైగాడ్’తో అద్భుతమైన ఛాన్స్ కొట్టేసి నయనతార లక్కీ  హీరోయిన్ అనిపించుకున్నారన్నది ఫిలింనగర్ టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement