మారుతిపై వెంకీ ప్రశంసలు | venkatesh on director Maruthi | Sakshi
Sakshi News home page

మారుతిపై వెంకీ ప్రశంసలు

Published Wed, Aug 10 2016 9:20 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

మారుతిపై వెంకీ ప్రశంసలు

మారుతిపై వెంకీ ప్రశంసలు

గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న హీరో వెంకటేష్, బాబు బంగారం సినిమాతో ఆడియన్స్ ముందు వస్తోన్నాడు. ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో వెంకటేష్.. దర్శకుడు మారుతిని ఆకాశానికెత్తేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో రాధ అనే సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు.

అయినా మారుతి నిరుత్సాహపడకుండా మరో కథతో వెంకీని ఒప్పించాడు. అదే బాబు బంగారం. చాలా కాలం తరువాత వెంకీ మరోసారి ఫుల్ ఎనర్జీతో, తన మార్క్ కామెడీ టైమింగ్తో అలరించనున్నాడు. తనను ఇలా ప్రజెంట్ చేయటం మారుతి ప్రతిభే అన్న వెంకీ.. ఈ యువ దర్శకుణ్ని సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణతో పోల్చాడు. మారుతి కూడా కోడి రామకృష్ణ లానే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంగారు పడడని.. తన పని తాను కూల్గా చేసుకుపోతాడని తెలిపాడు.

వెంకటేష్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్. గిబ్రాన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వెంకటేష్ లుక్స్, నయన్ వెంకీల కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement