
తమిళంలోకి డబ్ అవుతున్న బాబు బంగారం
వెంకటేష్, నయనతారలు జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారం. యూత్ ఫుల్ సినిమాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన రావటంతో ఇప్పుడు ఈ సినిమాను తమిళ్లోనూ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
బాబు బంగారం సినిమాను తమిళ్లో సెల్వీ పేరుతో భద్రకాళి ఫిలింస్ అధినేత భద్రకాలి ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. తమిళ్లో మంచి సక్సెస్లు సాధించిన మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ సంగీతం అదించటంతో పాటు, నయనతార తమిళ నాట వరుస సక్సెస్లు సాధిస్తుండటం ఈ సినిమాకు కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.