జూలై 9న 'బాబు బంగారం' ఆడియో | Venkatesh Babu Bangaram Audio Release on 9th July | Sakshi
Sakshi News home page

జూలై 9న 'బాబు బంగారం' ఆడియో

Published Tue, Jun 21 2016 1:12 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

జూలై 9న 'బాబు బంగారం' ఆడియో

జూలై 9న 'బాబు బంగారం' ఆడియో

సక్సెస్ ఫుల్ పెయిర్ వెంకటేష్, నయనతారలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారం. భలే భలే మొగాడివోయ్తో తానేంటో ప్రూవ్ చేసుకున్న మారుతి, ఈ సినిమాతో తొలిసారిగా ఓ స్టార్ హీరోని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఒక్క పాట మినహా ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా మీద అంచనాలను పెంచేస్తుండగా.. తాజాగా ఆడియో రిలీజ్ డేట్ను ప్రకటించారు. జూలై 9న ఈ సినిమా ఆడియోను అభిమానుల సమక్షంలో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ, పిడివి ప్రసాద్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement