MAruthi
-
యూరప్ వెళ్లనున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..?
ప్రభాస్ యూరప్ వెళ్లనున్నాడు. రాజాసాబ్ సాంగ్ చిత్రీకరణలో భాగంగా ఆయన అక్కడకు వెల్లేందుకు సిద్ధం అవుతున్నాడు.మారుతి దర్శకత్వలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సలార్, కల్కి చిత్రాల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే రాజాసాబ్ షూటింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే, సాంగ్స్ చిత్రీకరణ పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆరు పాటలు ఉన్నట్లు సంగీత దర్శకుడు థమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిలో భాగంగా వచ్చే నెలలో యూరప్‌లో ఒక సాంగ్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ పాట కూడా ప్రభాస్, మాళవిక మోహనన్‌ల మధ్య ఉంటుందట. అదిరిపోయే లొకేషన్స్‌లో చాలా గ్లామరస్‌గా ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచే రాజాసాబ్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా తొలి సాంగ్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారట.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 10న పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
'రాజాసాబ్' కోసం సెన్సేషనల్ సాంగ్ రీమిక్స్
మారుతి - ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్. ప్రభాస్ తన కెరీర్లో చేస్తున్న తొలి రొమాంటిక్ హారర్ చిత్రమిదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజాసాబ్‌లో ఆరు పాటలు ఉంటాయని అందులో ఒకటి పాపులర్ రీమిక్స్ సాంగ్ ఉంటుందని తెలిపారు. దీంతో ఆ హిట్ సాంగ్ ఏదై ఉంటుందని నెట్టింట చర్చ జరుగుతుంది.భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించారు. రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదని ఆయన అన్నారు. ఈ చిత్రం స్కేల్‌ను కూడా ఎవరూ ఊహించలేరని ఆయన అన్నారు. అయితే, రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హిట్ సినిమా నుంచి ఒక పాటను రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన రైట్స్ కోసం కూడా ఆయన సుమారుగానే ఖర్చు చేసినట్లు టాక్. సంజయ్‌దత్ హీరోగా నటించిన 'ఇన్సాఫ్ అప్నే లాహూ సే' సినిమా నుంచి 'హవా హవా..' అనే సాంగ్‌ను డైరెక్టర్ మారుతి ఎంపిక చేసుకున్నారట. 1994లో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో బాలీవుడ్ ప్రేక్షకులను షేక్ చేసింది. ఇప్పుడు ‘రాజా సాబ్’ కోసం థమన్ ఆ పాటనే రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ రాజాసాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన ప్రభాస్ లుక్‌పై మంచి టాక్ వస్తుంది. 2025 సమ్మర్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
టీజర్లోనే ఇన్ని బూతులు ఉంటే.. ఇక సినిమా పరిస్థితి ఏంటో..?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బూతు డైలాగ్స్‌కు ఎలాంటి కొదవ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా టీజర్,ట్రైలర్లోనే కొన్ని డైలాగ్స్‌తో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'డ్రింకర్ సాయి' సినిమా టీజర్ కూడా అదే కోవకు చెందినట్లు కనిపిస్తుంది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్లు ‘డ్రింకర్ సాయి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్ కూడా ఉంచారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.యూత్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ డ్రింకర్ సాయి చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్‌తో పాటు ధర్మ , ఐశ్వర్య శర్మ లవ్ స్టోరీ హైలెట్‌గా కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్‌ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్య శర్మకు యూత్ ఫిదా అవుతున్నారు. షోషల్ మీడియాలో ఆమె డైలాగ్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రమ్, బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!
‘ది రాజాసాబ్’ అప్డేట్ వచ్చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘ది రాజాసాబ్’. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. నేడు(అక్టోబర్ 23) ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. అందులో ప్రభాస్ సింహాసనంపై కూర్చొని చేతిలో సిగార్ పటుకొని మహారాజులా కూర్చున్నాడు. మొత్తంగా ఈ సినిమాలో ప్రభాస్‌ని ఓ డిఫరెంట్ లుక్‌లో చూపించబోతున్నట్లు మోషన్ పోస్టర్‌తో చెప్పేశాడు డైరెక్టర్ మారుతి. (చదవండి: ఒకే ఒక మాటతో ట్రెండింగ్‌లోకి వచ్చేసిన ‘స్పిరిట్’)ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
ప్రభాస్ 'ది రాజాసాబ్'.. బర్త్ డే రోజే వచ్చేస్తున్నాడు!
రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తోన్న చిత్రం ది రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా అని తెగ ఆరా తీస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం ది రాజాసాబ్ టీమ్ అప్డేట్తో ముందుకొచ్చింది. మరో రెండు రోజుల్లో డార్లింగ్ బర్త్ డే కావడంతో డైరెక్టర్ మారుతి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.ఈనెల 23న డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు బ్లాస్టింగ్ ఖాయమని పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే అదే రోజున టీజర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు ది రాజాసాబ్ టీమ్ రాయల్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో రెబల్ స్టార్ న్యూ లుక్‌లో అదిరిపోయేలా కనిపించాడు.(ఇది చదవండి: ప్రభాస్ 'ది రాజాసాబ్' గ్లింప్స్.. అది రెబల్ స్టార్ క్రేజ్!)ఇప్పటికే ది రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే 20 మిలియన్స్‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా.. ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Swag turned up to the MAX 😎&Now….your Celebrations will go off in STYLE 😉 A ROYAL TREAT AWAITS on 23rd Oct 💥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/wEu31XSGFW— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024 -
‘రాజా సాబ్’ మేకింగ్ వీడియో చూశారా?
మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘రాజాసాబ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ఫై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నేడు డైరెక్టర్ మారుతి బర్త్‌డే(అక్టోబర్ 8). ఈ సందర్భంగా రాజాసాబ్ మూవీ మేకింగ్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: 'పుష్ప 2'.. ఫస్ట్ హాఫ్ అంతా రెడీ)ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగార్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో సందడి చేయబోతున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ప్రభాస్ 'రాజాసాబ్' గ్లింప్స్ వచ్చేసింది
ప్రభాస్- మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆపై సినిమా రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు. రాజాసాబ్ ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు రివీల్ చేశారు.తాజాగా విడుదలైన రాజాసాబ్ గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు అందరూ డార్లింగ్ ఈజ్ రిటర్న్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుంచి పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగు,హిందీ,తమిళ్,కన్నడ, మలయాళం భాషలలో 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్ విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. -
'రాజాసాబ్' వచ్చేస్తున్నాడని ప్రకటించిన మేకర్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు శుభవార్త చెప్పారు డైరక్టర్ మారుతి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న'రాజాసాబ్' గురించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు వారు టైమ్ సెట్ చేశారు. రేపు (జులై 29) సాయింత్రం 5.03 నిమిషాలకు రాజాసాబ్ వచ్చేస్తాడని ప్రకటించారు.రాజా సాబ్ మూవీ కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ సుమారు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. కామెడీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. తెలుగు, హిందీ,తమిళ్,కన్నడ,మలయాలం భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.తాజాగా విడుదలైన రాజాసాబ్ పోస్టర్ చాలా బాగుందంటూ కామెంట్లు వస్తున్నాయి. డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట ట్రెండ్ అవుతుంది. అయితే, ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్లు ఎవరనే విషయం అధికారికంగా వెలువడలేదు. మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఓ రూమర్ అయితే ఉంది. రేపు విడుదల కానున్న గ్లింప్స్‌తో పూర్తి వివరాలు వస్తాయిని అభిమానులు ఆశిస్తున్నారు. View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) -
ప్రభాస్ 'రాజాసాబ్'... ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటన
ప్రభాస్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ఈ పేరు మార్మోగిపోతోంది. ఎందుకంటే రీసెంట్గా 'కల్కి' మూవీతో వచ్చాడు. హిట్ టాక్ తెచ్చుకుని వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇప్పటికే రూ.700 కోట్ల మార్క్ దాటేసింది. సరికొత్త రికార్డులు కూడా నమోదవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రభాస్ తర్వాత మూవీ గురించి టీమ్ కీలక ప్రకటన చేసింది. ఓ విషయంలో మోసపోవద్దని హెచ్చరించింది.(ఇదీ చదవండి: రష్మిక 'కుబేర' వీడియో.. ఆ సూట్ కేసులో ఏముంది?)'బాహుబలి' తర్వాత డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. 'రాజాసాబ్'గా త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని హారర్ కామెడీ కథతో తీస్తున్నారని టాక్. ఇందులో నిజమెంతనేది పక్కనబెడితే ఇప్పుడు ఈ మూవీ పేరుచెప్పి కొందరు ఫేక్ ఆడిషన్స్ చేస్తున్నారట. ఇది నిర్మాతలకు తెలిసి అలెర్ట్ చేశారు.'రాజాసాబ్ మూవీ ఆడిషన్స్ గురించి కొన్ని వార్తలు సర్క్యూలేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అయితే అదంతా ఫేక్. ఒకవేళ నిజంగా ఉంటే మేమే ప్రకటిస్తాం' అని నిర్మాతలు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఇకపోతే 'రాజాసాబ్'లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బహుశా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్ వినిపిస్తుంది. (ఇదీ చదవండి: Mirzapur 3: ‘మీర్జాపూర్ 3’ వెబ్‌సిరీస్ రివ్యూ) View this post on Instagram A post shared by People Media Factory (@peoplemediafactory) -
‘భలే ఉన్నాడే!’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
ఆ దర్శకునికి ఫ్రీగా డేట్స్ ఇచ్చిన 200 Cr స్టార్ ప్రభాస్.. కారణం..!
-
అలాంటి వారి బాధే ఈ సినిమా: మారుతి
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి కీలక పాత్రల్లో నటిస్తున్న కోలీవుడ్ చిత్రం ‘ట్రూ లవర్’. ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత రోజుల్లో ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ టాలీవుడ్ హక్కులను బేబీ నిర్మాత ఎస్కేఎన్, డైరెక్టర్ మారుతి దక్కించుకున్నారు. వీరిద్దరు సంయుక్తంగా ట్రూ లవర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న డైరెక్టర్ మారుతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ఎందుకు చూడమని చెబుతానంటే. ఒక మగాడి బాధ ఎలా ఉంటుందో చూపించాడు. అమ్మాయి చాలా ఈజీగా తీసుకుంటారు. ఇక్కడ అమ్మాయిల తప్పుకాదు. తన ప్రియురాలిని ఎవరైనా ట్రాప్ చేస్తాడేమో అని ఆమె లవర్ భయపడుతూ ఉంటాడు. అతని బాధను తెరపై చూపించే ప్రయత్నమే ఈ సినిమా. సిన్సియర్‌గా లవ్ చేసే వారి బాధ వర్ణనాతీతం. అలాంటి వ్యక్తి తన ప్రేమ కోసం ఏం చేస్తాడనేదే కథ. ఈ కథను డైరెక్టర్ దాదాపు ఆరేళ్లు కష్టపడి రాశాడు. బేబీ సినిమా చూసేటప్పుడు ప్రతి సీన్ అలానే రాసుకున్నారు. ఇలాంటి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ఎవరు మిస్సవరనేది నా నమ్మకం.' అని అన్నారు. కాగా.. మారుతి ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
ప్రేమిస్తే తర్వాత అలాంటి అనుభూతి కలిగింది
‘‘ప్రేమిస్తే’ అనే డబ్బింగ్ మూవీతో నా కెరీర్ ఆరంభమైంది. ‘ప్రేమిస్తే’ చూసి బాగుందనిపించి రిలీజ్ చేసి, హిట్ సాధించాం. ఇన్నాళ్లకు ‘ట్రూ లవర్’ చిత్రం చూడగానే మళ్లీ అలాంటి అనుభూతి కలిగింది. ఈ సినిమాను ప్రేమలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు, ప్రేమలో పడాలనుకుంటున్న వాళ్లు.. ఇలా అందరూ చూడొచ్చు’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. మణికందన్, శ్రీ గౌరీప్రియ, కన్న రవి ప్రధాన పాత్రల్లో ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ట్రూ లవర్’. నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేశన్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో దర్శకుడు మారుతి విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ప్రభురామ్ వ్యాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేమికుల మధ్య ఉంటున్న మోడ్రన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ‘ట్రూ లవర్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘ఫిబ్రవరి 9న వస్తున్న పెద్ద సినిమాలతో మేము పోటీలో లేము. ‘ట్రూ లవర్’ చిన్న క్యూట్ సినిమా.. మా సినిమాని విడుదల చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్కేఎన్. ‘‘మా సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు మణికందన్. -
అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి
గత కొంతకాలంగా హిట్లు లేక సతమతమైన ప్రభాస్‌కు సలార్ రూపంలో సంజీవని దొరికినట్లైంది. ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.611 కోట్లకు పైగా రాబట్టింది. ఈ జోష్‌లో వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. దర్శకుడు మారుతితో ఓ సినిమా ఉంటుందని గతంలోనే ప్రభాస్ ప్రకటించాడు. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీకి ది రాజాసాబ్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు ప్రకటించారు. కథ ఇదేనా? ఇకపోతే సినిమా కథ ఇదేనంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆఖరికి ఐఎమ్‌డీబీ కూడా.. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడుతారు. కానీ నెగెటివ్ ఎనర్జీ వల్ల ఆ ప్రేమజంట తమ గమ్యాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.. ఇదే సినిమా కథ అని రాసుకొచ్చింది. ఇది చూసిన మారుతి ట్విటర్(ఎక్స్) మీడియాలో సెటైర్లు వేశాడు. అరెరె... ఈ విషయం నాకు తెలియక నేను వేరే స్క్రిప్ట్‌తో షూటింగ్ చేస్తున్నాను! ఇప్పుడు ఐఎమ్‌డీబీ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తదా? అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు. దాని జోలికి మాత్రం వెళ్లకండి ఇది చూసిన అభిమానులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అన్నా, దయచేసి ప్రభాస్ లుక్ ఎడిట్ చేసి ఇవ్వకండి, సహజంగా తీసినవే పోస్టర్లు వదలండి.. ఈ విధిరాతల జోలికి పోకండి.. హారర్ స్క్రిప్ట్ చాలు, మమ్మల్ని నిరాశపరచవని ఆశిస్తున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్.. కల్కి 2898ఏడీ అనే సైన్స్ ఫిక్షన్ మూవీలోనూ నటిస్తున్నాడు. దీనికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. Ararare I don't know this plot So shooting with different script Ippudu IMDB Samajam accept chestada mari 😁 pic.twitter.com/gCr2gNEybV — Director Maruthi (@DirectorMaruthi) January 17, 2024 -
ముఖ్య గమనిక మంచి థ్రిల్లర్ అనిపిస్తోంది
‘‘ముఖ్య గమనిక’ టీజర్ చూశాను. మంచి థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా అనిపిస్తోంది. కానిస్టేబుల్‌గా విరాన్ క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా టీమ్ మొత్తానికి బూస్టప్ ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. సీనియర్ సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శివిన్ప్రోడక్షన్స్ పతాకంపై రాజశేఖర్, సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య హీరోయిన్. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్ అంశాలతో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించాం. విరాన్ చక్కగా నటించారు’’ అన్నారు వేణు మురళీధర్. ‘‘మా బేనర్ నుంచి వస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్. -
ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన.. రెమ్యునరేషన్ వద్దని చెప్పిన డార్లింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. విడుదలైన వారంలోపే రూ. 500 కోట్ల క్లబ్లో సలార్ చేరిపోయంది. ప్రభాస్ గత సినిమాలు రాధేశ్యామ్,ఆదిపురుష్‌తో పాటు సలార్ అన్నీ కూడా విభిన్నమైన కథాంశాలతోనే తెరకెక్కాయి. ముఖ్యంగా సాహో, సలార్ సినిమాలతో ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో ఆయన నుంచి తర్వాత వచ్చే సినిమాలు ఎలా ఉండబోతున్నాయని అందరిలో ఆసక్తి నెలకొంది. మారుతితో ఒక సినిమాను ఇదివరకే ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సంక్రాంతి పండుగ రోజు మారుతి- ప్రభాస్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. ఇప్పటి వరకు మీరందరూ డైనోసార్ ప్రభాస్‌ను చూశారు.. ఇక త్వరలో మళ్లీ డార్లింగ్ ప్రభాస్‌ను చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఒక పోస్ట్‌ర్ విడుదల చేసి చిత్ర యూనిట్ తెలపింది. ప్రభాస్‌ను మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన్ను ఇష్టపడుతారు.. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్‌ను మళ్లీ వింటేజ్ లుక్‌లో చూడొచ్చని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. సినిమా జోనర్ ఏంటి మారుతి- ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి గతంలోనే ఎన్నో వార్తలు వచ్చాయి. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఒక బంగ్లా చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని టాక్ ఉంది. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌కు ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 150 కోట్ల లోపే ఈ సినిమాకు బడ్జెట్ అని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండానే చేస్తున్నారని టాక్.. కానీ సినిమా విడుదలయ్యాక బడ్జెట్ పోను మిగిలిన ఆదాయంలో వాటా తీసుకునేలా ప్రభాస్ డీల్ సెట్ చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు 'కల్కి 2898 ఏడి' సైన్స్ ఫిక్షన్ చిత్రం కూడా వేగంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. People Media Factory proudly unveils the Dinosaur transformed into an absolute DARLING 😍 First Look and Title will be unveiled on Pongal 🔥#Prabhas #PrabhasPongalFeast ❤️🔥 A @DirectorMaruthi film. @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla pic.twitter.com/vGErsqcv1z — People Media Factory (@peoplemediafcy) December 29, 2023 -
ఆ రోజు వెంకటేష్ అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది
-
Director Maruthi: "తనే నా ఆల్‌టైమ్ ఫేవరెట్ హీరో"
-
ఆ సినిమాకి నా పేరు పెట్టలేదు ఎందుకంటే..?
-
మూవీ ఇండస్ట్రీలోకి రాకముందు చాలా కష్టపడ్డాను
-
లవ్ లో ఉన్నప్పుడు మేము చాలా దొంగగా కలుసుకునేవాళ్ళం
-
ఆ హీరో తో నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదే..!
-
ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి
లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘నచ్చినవాడు’. కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం 'ఈ కాలమే' పాటను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ చిత్రానికి యువ రచయిత హర్షవర్ధన్ రెడ్డి లిరిక్స్ అందించగా, ప్రముఖ గాయకుడు జావేద్ అలీ అద్భుతంగా ఆలపించాడు. పాట విడుదల సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ "మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన 'ఈ కాలమే' పాటను ఇప్పుడు విన్నాను, పాట మంచి ఫీల్ గుడ్ పాటలాగా చాలా బాగుంది. ఈ చిత్రం ట్రైలర్ కూడా చూశాను, చాలా బాగుంది. హీరో, దర్శకుడు, నిర్మాత అయిన లక్ష్మణ్ చిన్న గారికి ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అని భావిస్తున్నాను’ అన్నారు. ‘ఈ పాట మా చిత్రానికి ప్రాణం లాంటిది. మిజో జోసెఫ్ చాలా అద్భుతమైన స్వరాలు అందించాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తాం’అని హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా అన్నారు. -
ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ప్రభాస్- అనుష్క టాలీవుడ్ సినీ హిస్టరీలో వారిది హిట్ పెయిర్ అనే చెప్పవచ్చు. మిర్చి,బిల్లా,బాహుబలి సీరిస్‌లతో మెప్పించిన ఈ జోడి తెలుగు ప్రేక్షలపై చెరగని ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా నుంచి హాలీవుడ్ రేంజ్‌కు చేరుకున్నాడు. అనుష్క మాత్రం జీరో సైజ్ సినిమా దెబ్బతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. తాజాగా అనుష్క.. నవీన్ పొలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తుంది. త్వరలో ఆ సినిమా కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో సినీ కెరీయర్‌కు ఫుల్స్టాప్ పెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే మరోక అదిరిపోయే వార్త ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది. (ఇదీ చదవండి: ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’మూవీ రివ్యూ) ప్రభాస్- అనుష్క కాంబోలో ఒక సినిమా రాబోతున్నుట్లు చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే మళ్లీ జోరందుకుంది. కానీ ఈసారి కొంచెం బలంగానే ఈ టాపిక్ వైరల్ అవుతుంది. ఎందుకంటే అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుందట. ఇదే విషయాన్ని తెలుసుకున్న డైరెక్టర్ మారుతి.. ప్రభాస్‌తో తను తెరకెక్కిస్తున్న సినిమాలో నటించాలని అనుష్కను కోరారట. అందులో ఆమెను హీరోయిన్గా కాకుండా సినిమాకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కోసం మారుతి అడిగారట. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కల్కి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే సినిమా మారుతీదే కావడం విశేషం. (ఇదీ చదవండి: ఇంట్లో వాళ్లను కాదని యంగ్ డైరెక్టర్‌తో డేర్ చేస్తున్న నిహారిక ) ఇదిలా ఉంటే.. అనుష్క- ప్రభాస్ కాంబోలో మరో పిరియాడికల్ సినిమా తీసేందుకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ కథను రెడీ చేశారట. ఇదే స్టోరీని బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలకు కూడా ఆయన కథను వినిపించారట. వారికి స్టోరీ నచ్చడంతో ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుకొచ్చినట్టుగా బలమైన ప్రచారం జరుగుతుంది. అటు ప్రభాస్ నుంచి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మళ్లీ ప్రభాస్- అనుష్క జంటను బిగ్ స్క్రీన్‌పై వారిద్దరి ఫ్యాన్స్ చూడవచ్చు. ఒక విధంగా ప్రభాస్,అనుష్క ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. -
మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్ అనే థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్లో వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాగానే మొదట్లో ప్రారంభించినా ప్రభాస్ రేంజ్ పెరగడంతో బడ్జెట్ కూడా రూ. 200 కోట్లకు చేరిందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సలార్, కల్కి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న డార్లింగ్.. మారుతి సినిమా షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ షూటింగ్ ప్రారంభం కానుంది కూడా. (ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్) ఇది ఇలా ఉంటే తాజాగా కల్కి టైటిల్ గ్లింప్స్‌ను వైజయంతి మేకర్స్ రిలీజ్ చేశారు. దానిని చూసిన వారంతా హాలీవుడ్ రేంజ్లో ఉందని ప్రశంసలు కూడా డార్లింగ్ అందుకున్నాడు. ఇప్పటికి కూడా అది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ.. డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్‌తో సినిమా చేస్తున్న దర్శకుడు మారుతి మాత్రం ఈ గ్లింప్స్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంతో వాళ్లు మారుతిపై ఇలా ఫైర్ అవుతున్నారు. (ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) 'బేబీ సినిమా గురించి బన్నీ మాట్లాడిన మాటలు ట్విటర్లో షేర్ చేశావ్ అందులో ఎలాంటి తప్పు లేదు.. కానీ నీకు సినిమా అవకాశం ఇచ్చిన ప్రభాస్ గురించి ఒక్క ట్వీట్ అయినా చేశావా.. ? కల్కి మూవీకి సంబంధించిన గ్లింప్స్‌పై ఒక్క ట్వీట్ అయినా చేశావా..? ఎటువంటి సంబంధం లేకపోయినా నీతో రూ.200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను మా ప్రభాస్ చేస్తున్నారు. అంకిత భావం, కృతజ్ఞత భావం లాంటివి నీకులేవు' అంటూ మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో షూటింగ్లో బిజీ కారణంగా ట్వీట్ పెట్టలేకపోవచ్చు కానీ.. ప్రభాస్‌పై మారుతికి ఎనలేని ప్రేమ, కృతజ్ఞత ఉందని అంటున్నారు. ఇకపోతే రాజా డీలక్స్ గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రభాస్,మారుతి షూటింటిగ్ స్పాట్ ఫోటోలు కొన్ని ఇప్పటికే బయటకు వచ్చాయి. Every word from our Icon Star and pillar of support @alluarjun garu about our film #BabyTheMovie Appreciation Meet moved our entire team to tears.❤️🔥 Thanks for this Iconic Appreciation sir, it's a big boost. We are overwhelmed with your unconditional love on #Baby… — Director Maruthi (@DirectorMaruthi) July 21, 2023