
మారుతి, శ్రావణి, అశ్వినీ, ప్రియ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘యమ్ 6’. జైరామ్ వర్మ దర్శకత్వంలో విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ పతాకంపై విశ్వనాథ్ తన్నీరు, సురేష్. ఎస్ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జైరామ్ వర్మ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలూ ఉంటాయి. అంతర్లీనంగా చిన్న సందేశమిచ్చే ప్రయత్నం చేశాం. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి.
ఇటీవల షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. మా హీరో మారుతికి ఇది తొలి సినిమా అయినా అనుభవం ఉన్న హీరోలా నటించాడు’’ అన్నారు విశ్వనాథ్ తన్నీరు. ‘‘నేను నటనలో శిక్షణ తీసుకోలేదు. దర్శకుడు చెప్పినట్లు చేశా’’ అన్నారు మారుతి. గోవింద, హరిత, వంశీ, ఇంద్రతేజ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజి, కెమెరా: మహ్మద్ రియాజ్, సమర్పణ: పార్వతి.
Comments
Please login to add a commentAdd a comment