Gopichand Pakka Commercial Trailer Out Now - Sakshi
Sakshi News home page

Pakka Commercial Trailer: పక్కా కమర్షియల్‌ ట్రైలర్‌ చూశారా?

Jun 12 2022 4:12 PM | Updated on Jun 12 2022 4:54 PM

Gopichand Pakka Commercial Trailer Out Now - Sakshi

‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ పవర్ ఫుల్ డైలాగులు...

'ప్ర‌తిరోజు పండ‌గే' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్‌ హీరోగా రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యానర్‌పై బ‌న్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. 

‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

చదవండి: చిరు ఇంట్లో విక్రమ్‌ టీంకు గ్రాండ్‌ పార్టీ, సల్మాన్‌ ఖాన్‌ సందడి
ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement