Gopichand: Pakka Commercial Movie Digital Rights Acquires Aha OTT Deets Inside - Sakshi
Sakshi News home page

Pakka Commercial Movie: 'పక్కా కమర్షియల్‌'గా ఆ ఓటీటీకి డిజిటల్‌ రైట్స్‌..

Published Sat, Apr 9 2022 9:11 PM | Last Updated on Thu, Jul 28 2022 1:58 PM

Gopichand Pakka Commercial Movie Digital Rights Acquires Aha OTT - Sakshi

Gopichand Pakka Commercial Movie Digital Rights Acquires Aha OTT: హీరో గోపీచంద్‌, బొద్దుగుమ్మ రాశీ ఖన్నా ముచ్చటగా మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం 'పక్కా కమర్షియల్‌'. డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌లో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

చదవండి: సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్​

తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే పోస్ట్‌ థియేట్రికల్‌ హక్కులను మంచి మొత్తానికి ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కొన్ని వారాల తర్వాత డిజిటల్‌ రైట్స్‌ను 'పక్కా కమర్షియల్‌'గా సొంతం చేసుకున్న ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. జేక్స్‌ బిజోయ్‌ మ్యూజిక్‌ అందించిన ఈ చిత్రానికి దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరిసారిగా పాటలు రాశారు. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్‌, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 



చదవండి: జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. ఫిబ్రవరి 2 సిరివెన్నెల చివరి పాట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement