Pakka Commercial Movie
-
ఆహాలో పక్కా కమర్షియల్, ఎప్పటినుంచంటే?
మ్యాచో హీరో గోపీచంద్, హీరోయిన్ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీని బన్నీ వాసు నిర్మించారు. జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాగానే వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఆగస్టు 5 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. మరింకే... థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఆహాలో మూవీ రిలీజ్ కాగానే ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయండి.. Brace yourself for pakka entertainment🔥with macho star @YoursGopichand and beautiful @RaashiiKhanna_ ❤️#PakkaCommercialOnAHA premieres August 5.#Sathyaraj #RaoRamesh @harshachemudu @varusarath5 @Chitrashukla73@DirectorMaruthi @SKNonline pic.twitter.com/s4PQG0cBvU — ahavideoin (@ahavideoIN) July 30, 2022 చదవండి: గ్యారేజీలో అనిల్ కాపురం.. హీరోయిన్‌తో సునీల్ దత్ లవ్‌స్టోరీ.. హఠాత్తుగా వీగన్‌గా మారిపోయా.. కొత్తలో చాలా కష్టంగా ఉండేది: నుస్రత్ -
వరుస ఫ్లాప్స్.. ప్రభాస్ ‘రాజా డీలక్స్’ అనుమానాలు!
పక్కా కమర్షియల్ మూవీ ప్రమోషన్స్ లో మారుతి నెక్ట్స్ తాను చేయబోతున్న సినిమాల లిస్ట్ ప్రకటించాడు.అందులో ఒకటి ప్రభాస్ తో ఉంటుందని తెలిపాడు.ప్రభాస్ ఫ్యాన్ గా వింటేజ్ యంగ్ రెబల్ స్టార్ ను తెరపై చూపిస్తానని అభిమానులకు మాట కూడా ఇచ్చాడు. పక్కా కమర్షియల్ రిలీజైన 20 రోజులకు ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడతానన్నాడు.అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డౌట్స్ రైజ్ అయ్యాయి. గతేడాది మారుతి తెరకెక్కించిన ‘మంచి రోజులు వచ్చాయి’బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.ఇక ఇటీవల గోపిచంద్‌తో తీసిన ‘పక్కా కమర్షియల్’చిత్రం కూడా కాసుల వర్షం కురిపించలేకపోయింది. దీంతో మారుతికి ప్రభాస్ సినిమా మిస్ అయిందనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా తీయడం అంత ఈజీకాదు. ఆయనకున్న స్టార్‌డమ్‌ని దృష్టిపెట్టుకొని పకడ్బంధీగా కథను తీర్చిదిద్దాలి. దాన్ని యంగ్ డైరెక్టర్ మారుతి హ్యాండిల్ చేయగలడా అనుమానాలు ఇండస్ట్రీ వర్గాలు నుంచి వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రభాస్ ఇలాంటి యంగ్ డైరెక్టర్స్‌కి అవకాశాలు ఇచ్చి వరుస అపజయాలను మూటగట్టుకున్నాడు. బాహుబలి తర్వాత సుజిత్‌తో తీసిన సాహో, రాధాకృష్ణ తెరకెక్కించిన ‘రాధేశ్యామ్’ చిత్రాలు బక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఈ దశలో మారుతికి కొత్త సినిమాను చేసే ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే స్టోరీతో కనుక ఇంప్రెస్ చేస్తే, మారుతితో సినిమా చేస్తానని ప్రభాస్ మాట ఇస్తే కనుకగా రాజా డీలక్స్ ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ లో పట్టాలెక్కడం ఖాయం. -
'పక్కా కమర్షియల్'గా హిట్టు.. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ మార్కు !
Gopichand Pakka Commercial 1St Week Collections: మ్యాచో హీరో గోపీచంద్, విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన 'పక్కా కమర్షియల్' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఉన్నాడు. రాశీ ఖన్నా క్యారెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసాడు మారుతి. ఈ సినిమా కోసం పబ్లిసిటీతో కలుపుకొని దాదాపు రూ. 35 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు నిర్మాతలు. అందులో 32 కోట్లు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ (డిజిటల్, శాటిలైట్, హిందీ రీమేక్, డబ్బింగ్ అన్ని) రూపంలోనే వచ్చాయి. ఇక సినిమాను చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు నిర్మాతలు. అందుకే ఇంత త్వరగా బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది 'పక్కా కమర్షియల్' సినిమా. ఇంత ప్లానింగ్ ఉంటుంది కాబట్టే మారుతి మోస్ట్ బ్యాంకబుల్ డైరెక్టర్ అయ్యాడు. మొదటి రోజు రూ. 6.3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. ఆ తర్వాత రెండు రోజులు బాగానే క్యాష్ చేసుకుంది. ఓవరాల్‌గా 'పక్కా కమర్షియల్' మూడు రోజుల్లోనే సేఫ్ అయిపోయింది. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. #PakkaCommercial collects over 𝟏𝟓.𝟐 𝐂𝐑 Worldwide in 3 Days! 🔥💥 This Week, catch the ACTION - FUN Family Entertainer at cinemas near you! 🤩 🎟️: https://t.co/BcOUguIiyK @YoursGopichand @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas @SKNonline @UV_Creations @adityamusic pic.twitter.com/vQpCrMOUQd — GA2 Pictures (@GA2Official) July 4, 2022 -
కమర్షియల్ హిట్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు: మారుతి
‘పక్కా కమర్షియల్’ చిత్రం మేము అనుకున్నట్లే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది. నా సినిమాకు వచ్చే అడియన్స్ ఏం ఆశిస్తారో అవన్ని ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు. వారందరికి నా ధన్యవాదాలు’అన్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ పతకాలపై బన్నీ వాస్ నిరించారు. జులై 1న ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. (చదవండి: అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా) ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబరాలను జరుపుకుంది. అనంతరం మారుతి మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్‌ని స్టైలీష్‌గా చూపించారని, రాశీఖన్నా ట్రాక్ బాగుందని చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ ఇంకా బెటర్ కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను’ అని అన్నారు. చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆడియన్స్ మంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇస్తే బాగుంటుందని ఈ సినిమా తీశాం. మేము అనుకున్నట్లే అది ఈ రోజు అందరికీ రీచ్ అయ్యింది. తొలి రోజే రూ.6 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మా సినిమా క్లియర్ కమర్సియల్ హిట్ కింద పరిగణించవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాను. మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పనిచేసిన గోపి చంద్, రాశి ఖన్నా లకు మరియు మిగిలిన నటీ నటులందరికీ ధన్యవాదాలు ’అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు నటుడు సప్తగిరి. ‘ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికీఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం మేము టికెట్స్ రేట్ తగ్గించాం. ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు. కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ’అన్నారు సహ నిర్మాత ఎస్కేఎన్. ఈ చిత్రంలో రావు రమేశ్, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా
రాశీ ఖన్నా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘పక్కా కమర్షియల్’లో ఆమె చేసిన క్యారెక్టర్‌కి ప్రశంసలు దక్కడం ఓ కారణం అయితే.. చేతి నిండా సినిమాలు ఉండటం మరో కారణం. ‘బిజీగా ఉండటమే కదా కావాల్సింది’ అంటున్నారు ఈ బ్యూటీ. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కా కమర్షియల్’ ఈ నెల 1 విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమాలో తన పాత్రకు లభిస్తున్న ప్రశంసలు, ఇతర విశేషాల గురించి రాశీ ఖన్నా ఈ విధంగా చెప్పారు. ‘పక్కా కమర్షియల్’లో నమస్కారం చేసేటప్పుడు సెలబ్రిటీలు ఇంతకన్నా బెండ్ కాకూడదని అంటారు.. ఓ సెలబ్రిటీగా రియల్ లైఫ్‌లో మీరు.. ? రాశీ ఖన్నా: అసలు నన్ను నేను సెలబ్రిటీలా ఎప్పుడూ అనుకోలేదు. సెలబ్రిటీ, కామన్ పీపుల్ అనే తేడా నాకు ఉండదు. పైగా ఎప్పట్నుంచో నా ఆలోచనలు స్పిరిచ్యువల్‌గా ఉంటాయి కాబట్టి ‘స్టేటస్’కి ప్రాధాన్యం ఇవ్వను. మనం కెరీర్లో ఎంతైనా సాధించవచ్చు. కానీ అది నెత్తికెక్కించుకుంటే కష్టం. ఒక స్థాయికి చేరుకున్నాక స్టేటస్ మెయింటైన్ చేయాలని అనేవాళ్లు మన చుట్టూ ఉండటం కామన్ కదా.. ? అలాంటివి చెప్పడానికి చాలామంది ఉంటారు. అయితే నాకంటూ ఒక మైండ్ ఉంది. అది చెప్పిన ప్రకారమే ఫాలో అవుతాను. ఒకవేళ నా మైండ్‌కి ఎక్కించాలని ఎవరైనా ట్రై చేస్తే వాళ్లను దూరం పెడతాను. ‘పక్కా కమర్షియల్’లో టీవీ ఆర్టిస్ట్‌గా కామెడీ పండించారు.. సీరియల్స్ చూస్తారా? చిన్నప్పుడు చూసేదాన్ని. యాక్చువల్‌గా కథ చెప్పినప్పుడు అల్లు అరవింద్‌గారు, మారుతిగారితో ఈ క్యారెక్టర్ని నేను చేయగలనా? అనిపిస్తోంది అన్నాను. ఎందుకంటే నాది ఫుల్ ప్లెడ్జ్డ్ కామెడీ క్యారెక్టర్. కామెడీ చేయడం కష్టం. కానీ ఒక ఆర్టిస్ట్‌గా చేయాలని ఫిక్సయ్యాను. సినిమా చూసి, అల్లు అరవింద్‌గారు ‘యాక్టింగ్ చాలా బాగుంది’ అన్నారు. ఆడియన్స్‌కి కూడా నా నటన నచ్చినందుకు హ్యాపీగా ఉంది. -
‘పక్కా కమర్షియల్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. విలక్షణ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచాల మధ్య ఈ శుక్రవారం(జులై 1) విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. గోపిచంద్ యాక్షన్, రాశీఖన్నా గ్లామర్, మారుతి స్టైల్ కామెడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. (చదవండి: ‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ) ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు మొత్తంగా ఈ చిత్రం రూ.6.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా పక్కా కమర్షియల్ కావడం గమనార్హం. ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #PakkaCommercial Mints 𝟔.𝟑 𝐂𝐑 𝐆𝐑𝐎𝐒𝐒 Worldwide on 𝐃𝐀𝐘 𝟏, Best opening day at Box-Office for 𝐌𝐀𝐂𝐇𝐎 𝐒𝐓𝐀𝐑 @YoursGopichand 🔥💥 Don't Miss the ACTION - FUN Entertainer on big screens!🤩 🎟️: https://t.co/BcOUgurfwK @DirectorMaruthi @RaashiiKhanna_ #BunnyVas pic.twitter.com/hFG2iRWf5F — GA2 Pictures (@GA2Official) July 2, 2022 -
‘పక్కా కమర్షియల్’మూవీ (ఫొటోలు)
-
‘పక్కా కమర్షియల్’మూవీ రివ్యూ
టైటిల్ :పక్కా కమర్షియల్ నటీనటులు : గోపిచంద్, రాశీ ఖన్నా, రావు రమేష్, సత్యరాజ్, తదితరులు నిర్మాణ సంస్థలు : జీఏ2పిక్చర్స్, యూవీక్రియేషన్స్ నిర్మాత: బన్నీ వాసు రచన,దర్శకత్వం: మారుతి సంగీతం : జేక్స్ బిజాయ్ సినిమాటోగ్రఫీ: కరమ్ చావ్లా ఎడిటర్: ఎన్ పి ఉద్భవ్ విడుదల తేది: జులై 1, 2022 వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కించిన సినిమా 'పక్కా కమర్షియల్'. మ్యాచో హీరో గోపీచంద్, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై సినీ ప్రియులకు ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో ఈ శుక్రవారం(జులై 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం ఎలా ఉంది ? కమర్షియల్ హిట్ కొట్టేసిందా లేదా రివ్యూలో చూద్దాం. కథేంటంటే... సూర్య నారాయణ (సత్య రాజ్) ఓ సిన్సియర్ న్యాయమూర్తి. వ్యాపారవేత్త వివేక్ (రావు రమేశ్) చేతిలో మోససోయిన యువతికి న్యాయం చేయలేకపోయానని బాధపడుతూ న్యాయవాద వృత్తికి రాజీనామా చేసి కిరాణ దుకాణం పెట్టుకొని జీవనం సాగిస్తాడు. అతని కొడుకు లక్కీ(గోపిచంద్) కూడా లాయర్ అవుతాడు. కానీ తండ్రిలా నిజాయతీగా కాకుండా మార్కెట్లో అవలీలగా న్యాయాన్ని అమ్మెస్తుంటాడు. తప్పు ఒప్పు చూడకుండా పక్కా కమర్షియల్‌గా వ్యవహరిస్తూ డబ్బులు సంపాదిస్తాడు. ఓ కేసు విషయంలో వివేక్ తరఫున వాదించి.. అతనికి దగ్గరవుతాడు. అయితే వివేక్ వల్ల బాధింపబడిన యువకుడి కోసం, అతని భార్య కోసం మళ్లీ నల్లకోర్టు వేసి కోర్టుమెట్లు ఎక్కుతాడు సూర్య నారాయణ. వివేక్ తరఫున కొడుకు లక్కి రంగంలోకి దిగుతాడు. ఈ న్యాయ పోరాటంలో ఎవరు గెలిచారు? సొంత తండ్రిని కాదని వివేక్ తరఫున లక్కీ ఎందుకు వాదిస్తాడు ? లక్కీ మరీ అంత కమర్షియల్‌గా ఎందుకు మారాడు ? చివరకు సూర్యనారాయణ కోరుకున్నట్లుగా వివేక్కి శిక్ష పడిందా లేదా? తండ్రికొడుకుల న్యాయపోరాటంలో సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’ ఎలాంటి పాత్ర పోషించింది? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. మారుతి సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్‌గా ఉంటాయి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు బలమైక కథను ముందుకు తీసుకెళ్తాడు. పక్కా కమర్షియల్‌లో కథను పక్కకు పెట్టి కామెడీతో లాక్కోచ్చాడు. హీరోయిజం మీదనే ఎక్కువ దృష్టిపెట్డాడు. టైటిల్‌కి దగ్గట్టుగా పక్కా కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఓ ఎమోషనల్ సీన్‌తో సినిమా మొదలవుతుంది. లాయర్ లక్కీగా గోపిచంద్ ఎంట్రీతోనే టైటిల్ దగ్గట్టుగా పక్కా కమర్షియల్‌గా సినిమా సాగుతుంది. సీరియల్ నటి ‘లాయర్ ఝాన్సీ’ ఎంట్రీతో కామెడీ డబుల్ అవుతుంది. ఆమె క్యారెక్టరైజేషన్స్ విషయంలో మారుతి మరోసారి తన మార్క్ చూపించాడు. సీరియల్లో తన క్యారెక్టర్ని చంపారంటూ ‘లాయర్ ఝాన్సీ’ కోర్టు ఆశ్రయించే సీన్ నవ్వులు పూయిస్తుంది. రొటీన్ కామెడీ సీన్స్‌తో ఫస్టాఫ్ అంతా సోసోగా సాగుతుంది. ఇక సెకండాఫ్ నుంచి అసలు కథ మొదలవుతుంది. వివేక్కి దగ్గరైన లక్కీ చివరకు అతన్ని ఎలా జైలు పాలు చేశాడనేది వినోదాత్మకంగా చూపించాడు. సెకండాఫ్‌లో చాలా ఫ్రెష్ కామెడీతో నవ్వించాడు మారుతి. సినిమాల్లో వచ్చే ఫైట్ సీన్స్‌పై వేసిన సెటైర్, రావు రమేశ్, అజయ్ ఘోష్‌ల మధ్య వచ్చే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ ప్రేక్షకుడి ఊహకి అందేట్లుగా ఉంటుంది. కథని, లాజిక్స్‌ని పక్కకు పెట్టి చూస్తే.. ‘పక్కా కమర్షియల్’ పక్కా నవ్విస్తుంది. ఎవరెలా చేశారంటే.. డబ్బు కోసం అన్యాయాన్ని కూడా న్యాయంగా మార్చే పక్కా కమర్షియల్ లాయర్ లక్కీ పాత్రలో గోపిచంద్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత తనదైన కామెడీతో నవ్వించాడు.ఫైట్ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. ఒక సీరియల్ హీరోయిన్ ‘లాయర్ ఝాన్సీ’గా రాశీఖన్నా ఇరగదీసింది. స్క్రీన్‌పై చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. సీరియల్ భాషలో ఆమె చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఇక హీరో తండ్రి సూర్యనారాయణ పాత్రలో సత్యరాజ్ జీవించేశాడు. ఇలాంటి పాత్రలు చేయడం ఆయనకు కొత్తేమి కాదు. మారుతి గత సినిమాల మాదిరే ఇందులో కూడా రావు రమేశ్ పాత్రకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. విలన్ వివేక్‌గా తనదైన నటనతో మెప్పించాడు. సప్తగిరి, వైవా హర్ష, ప్రవీణ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జేక్స్ బిజాయ్ సంగీతం బాగుంది. 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్‌తో పాటు 'అందాల రాశి..'పాట కూడా ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా ఫ్రెష్‌గా ఉంది. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
అలాంటి పాత్రలు దొరికితే మళ్లీ విలన్‌గా చేస్తా: గోపిచంద్
మాచో స్టార్ గోపిచంద్-రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా గోపిచంద్, డైరెక్టర్ మారుతి ఓ టీవీ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలపై గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా ఈ సందర్భంగా షో హోస్ట్.. పక్కా కమర్షియల్ అనే పదాన్ని ఎక్కువగా నెగెటివ్ సెన్స్ వాడతాం.. మరి అసలు ఎలా ఉండనుందనే ప్రశ్నకు గోపిచంద్ ఇలా స్పందించాడు. ‘ఈ మూవీ చాలా వినోదభరితంగా ఉంటుంది. రణం, లౌక్యం చిత్రాల తర్వాత నేను ఫుల్ లెన్త్ కామెడీ చేసింది ఈ సినిమాలోనే. పక్కా కమర్షిల్లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేసే అన్ని అంశాలు ఉంటాయి’ అని సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మీరు మళ్లీ విలన్‌గా చేస్తారా? అని అడగ్గా.. తప్పకుండ చేస్తానని చెప్పాడు గోపిచంద్. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న నాజర్!, కారణం ఇదేనా? అయితే తాను ఇప్పటి వరకు చేసిన విలన్ రోల్స్ అన్ని కూడా హీరోలకు ధీటుగా ఉన్నవేనని, మళ్లీ అలాంటి వైవిధ్యమైన పాత్రలు ఉంటేనే చేస్తానని తెలిపాడు. అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమాలో మీరు అసలైన గోపిచంద్‌ని చూస్తారంటూ ఆసక్తకర కామెంట్స్ చేశాడు. గోపిచంద్ సెట్లో చాలా ప్రశాంతంగా ఉటాడని, సీన్లలోనే నటించేటప్పుడు ఆయనలోని నటుడిని చూసి ఆశ్చర్యం వేసేదన్నాడు. ఇక బయట ఉండే క్యాజువల్ గోపిచంద్‌ని మీరు ఈ సినిమాలో చూస్తారని మారుతి చెప్పుకొచ్చాడు. -
శ్రీవారిని దర్శించుకున్న స్టార్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆమె వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెను ఆశీర్వదించి ప్రసాదాలను అందజేశారు. చదవండి: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా కాగా తాను తాజాగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్ సినిమా విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రాశీ ఖన్నా పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. -
నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ: రాశీ ఖన్నా
తనకు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమే ఈజీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా. తాజాగా ఆమె నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రాశీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు ఎలాంటి సన్నివేశాల్లో చేయడం మీకు ఇష్టమని, తొలిసారి ఈ సినిమాలో కామెడీ చేశారు కదా ఎలా అనిపించిందని అడిగిన ప్రశ్నకు రాశీ నిర్మొహమాటం రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టమని చెప్పింది. చదవండి: సమంతకు మరో స్పెషల్ సాంగ్ ఆఫర్? ఈసారి తెలుగులో కాదు! ఈ మేరకు ఆమె ‘నాకు తెలిసి కామెడీ చేయడం చాలా కష్టం. కానీ రొమాన్స్ అలా కాదు. కామెడీతో పోలిస్తే హీరోలతో రొమాన్స్ సీన్స్ చేయడం సులభం. ఇప్పటి వరకు సినిమాల్లో నేను రొమాంటిక్ సన్నివేశాల్లోనే చేశాను. ఆ సీన్స్‌లో నటించి బోర్ కొట్టింది. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్ చేస్తున్నా. పక్కా కమర్షియల్‌లో నా కామెడీ బాగుటుంది. బాగా నవ్వుకోవచ్చు’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాలో రాశీ ఖన్నా తొలిసారి నల్లకోటు ధరించింది. ఇందులో ఆమె లేడీ లాయర్‌గా తన కామెడీతో అందరిని నవ్వించనుంది. చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న విలక్షణ నటుడు!, కారణం ఇదేనా? -
పక్కా కమర్షియల్.. బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతు దొరికిపోయిన కమెడియన్!
గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ మూవీ టికెట్స్‌ను బ్లాక్‌లో అమ్ముతూ దొరికిపోయాడు కమెడియన్ సప్తగిరి. సప్తగిరి ఈ చిత్రంలో తన కమెడియన్గతో నవ్వించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సప్తగిరి బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం సప్తగిరి మారుతి చివాట్లు పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఇదంత నిజం కాదండోయ్. చదవండి: ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని వెనక్కి నెట్టిన కన్నడ చిత్రాలు జూలై 1న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ రేట్స్‌పై ప్రేక్షకుల్లో సందేహం నెలకొంది. పక్కా కమరయల్ టికెట్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయనా అని ప్రతి ఒక్కరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ రేట్స్‌పై క్లారిటీ ఇచ్చేందుకు చిత్ర బృందం ఇలా కొత్తగా ప్లాన్ చేసింది. గీతా ఆర్ట్స్ వారు తమ యూట్యూబ్ చానల్లో షేర్ చేసినీ ఈ వీడియోలో సప్తగిరి బ్లాక్ టికెట్స్ అమ్ముతూ డైరెక్టర్ మారుతికి దొరికపోయాడు. ఏంటి.. టికెట్స్ బ్లాక్‌లో అమ్ముతున్నావా? అని మారుతి అడగ్గా... అవును సర్.. సినిమాల్లోకి రాకముందే చిరంజీవి సినిమాలకు ఇదే పని చేసేవాడిని అని బదులిస్తాడు. అయితే ఒక టికెట్‌ను ఎంతకు అమ్ముతున్నావని అడగ్గా.. 150 రూపాయలకు అంటాడు. దీనికి కౌంటర్లో కూడా ఇదే రేట్‌కు ఇస్తున్నారు కదా! అంటాడు మారుతి. అది విని షాక్ అయిన సప్తగిరి అంటే పాత రేట్స్‌కే సినిమాను ప్రదర్శిస్తున్నారా? అని ప్రశ్నిస్తాడు. చదవండి: మాధవన్‌ను చూసి ఒక్కసారిగా షాకైన సూర్య, వీడియో వైరల్ దీంతో మారుతి అవునయ్యా.. ఈ సినిమాను నాన్ కమర్షియల్ రెట్స్‌కే అందుబాటులో ఉంచుతున్నట్లు నిర్మాత బన్నీ వాసు మూవీ ప్రమోషన్లో చెబుతున్నాడు కదా! అది వినలేదా? అని చెప్పగా. అవునా సర్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు సప్తగిరి. ఇక మూవీ టికెట్ రేట్స్‌పై వివరణ ఇస్తూ మరుతి.. ‘మా పక్కా కమర్షియల్ సినిమా మిమ్మిల్ని మళ్లీ పాత థియేటర్ల వైభవం రోజులకు తీసుకెళ్లడానికి సందడిగా హ్యాపీగా నవ్వుతూ మూవీని ఎంజాయ్ చేసేందుకు పాత రెట్స్‌కే() ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాను థియేటర్లోనే చూడండి. గ్రూపులు వచ్చి మా సినిమాను ఎంజాయ్ చేయండి. పాత టికెట్స్ రెట్స్‌కే మా సినిమాను థియేటర్లో ప్రదర్శించబోతున్నాం’ అంటూ డైరెక్టర్ మారుతి చెప్పుకొచ్చాడు. చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్ రాలేదు: పూజా హెగ్డే -
ఆ బాధ్యత డైరెక్టర్‌దే.. లేకపోతే నిర్మాతలు, ప్రేక్షకులు నష్టపోతారు
‘‘నిర్మాతను, థియేటర్ వ్యవస్థను కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. ప్రస్తుతం డైరెక్టర్ ఎంత బాధ్యతగా ఉన్నాడంటే నిర్మాతను ఒప్పించాలి, థియేటర్‌ను కాపాడుకోవాలి, ఆడియన్స్‌ను సినిమాకు రప్పించాలి. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ అయితే అక్కడి ఆడియన్స్ కూడా కళ్లను పక్కకు తిప్పుకోకుండా చూపించగలగాలి.. అప్పుడే ఒక డైరెక్టర్ సక్సెస్ అయినట్టు’’ అన్నారు డైరెక్టర్ మారుతి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు మారుతి చెప్పిన విశేషాలు. ► ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ బాగా రాసుకోవాలి. అవసరమైతే రెండు నెలలు ఎక్కువ కష్టపడి అయినా స్క్రిప్ట్‌ను మన టేబుల్ మీదే ఎడిట్ చేసు కుంటే వృథా తగ్గిపోయి నిర్మాతకు చాలా డబ్బులు మిగులుతాయి. దీనికి తోడు మంచి మంచి సబ్జెక్టులు వస్తాయి. ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్‌తో పాటు షూటింగ్ రోజులు తగ్గించాలి.. మంచి కథలను సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్‌కు నచ్చేలా తీయాలి. మనకు ఇష్టమొచ్చినట్లుగా తీస్తే చూడరు. ► ఒక వ్యక్తి డైరెక్టర్ కావాలంటే ప్రతిభ కంటే ముందు తను ఒక ప్రేక్షకుడు అయ్యుంటే బెస్ట్ సినిమా తీస్తాడు. నాకు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఉండటం వల్ల కమర్షియల్ యాంగిల్లో సినిమాలు చేస్తున్నాను. ఆడియన్స్‌కు ఏం కావాలో ఇచ్చి, వారి దగ్గర డబ్బులు తీసుకొని నిర్మాతలకు ఇవ్వా ల్సిన మీడియేషన్ బాధ్యత డైరెక్టర్‌దే.. ఈ మీడియేషన్ కరెక్ట్‌గా చేయకపోతే ఇటు నిర్మాతలు, అటు ప్రేక్షకులు నష్టపోతారు. ► ‘పక్కా కమర్షియల్’ మంచి కథతో అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులు సంతోషంగా కాలర్ ఎగరేసుకుని చూసే సినిమా ఇది. దివంగత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ఈ సినిమా టైటిల్ పాటకు మంచి స్పందన వచ్చింది. ► జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్‌పై నా దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దానికి కారణం మంచి కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు సెట్ అవ్వడం. మనకు చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నా రు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్ రాస్తే మిగతా భాషల నటీనటులను తెచ్చుకోవాల్సిన పని ఉండదు. ► సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు పెద్ద సినిమాలకు ఎక్కువగా థియేటర్స్‌కు రావడం లేదు.. అందుకే మేము తక్కువ రేట్‌కే మా ‘పక్కా కమర్షియల్’ని చూపించనున్నాం. ఓటీటీలో చూసేయొచ్చు అనుకుంటారేమో.. ఇప్పుడప్పుడే ఓటీటీకి రాదు (నవ్వుతూ). -
ఆయన నాకెప్పటికీ హీరోలా కనిపిస్తారు
‘‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, అందర్నీ అలరిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఫుల్ మీల్స్‌లాంటి సినిమా.. ఎంజాయ్ చేయండి. మళ్లీ థియేటర్లు కళకళలాడాలి’’ అన్నారు చిరంజీవి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెర కెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ అద్భుతమైన దర్శకుడు. కళాశాలలో నా సీనియర్ అయిన ఆయన నాలోని భయాన్ని పోగొట్టి ప్రోత్సహించారు.. అందుకే నాకెప్పుడూ ఒక హీరోలాగా కనిపిస్తుంటారాయన. ఆయన లేకున్నా ఇండస్ట్రీపై తన ప్రేమను గోపీచంద్ ద్వారా కురుపిస్తున్నారాయన. గోపీచంద్ సినిమాల్లో నాకు ‘సాహసం’ బాగా నచ్చింది. ‘ఒక్కడున్నాడు, చాణక్య’ వంటి వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా ఎదిగాడు. మారుతి సినిమాల్లో ‘ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ సినిమాలు నాకు బాగా నచ్చాయి. అన్ని హంగులున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా తన గత సినిమాలను మించి ఆడాలని కోరుకుంటున్నాను. మారుతి దర్శకత్వంలో నేను హీరోగా యూవీ క్రియేషన్స్‌లో వంశీ, విక్కీలతో సినిమా ఉంటుంది’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ నాన్నగారు టి. కృష్ణ తీసిన ‘ప్రతిఘటన’ చూసి చిరంజీవిగారితో మా బ్యానర్లో ఓ సినిమా చేయమని అడిగాను.. దురదృష్టవశాత్తు ఆయన మనతో లేరు. ఆ తర్వాత ఇన్నేళ్లకు గోపీచంద్‌తో మా బ్యానర్లో ఓ మంచి సినిమా చేయడం హ్యాపీ. ప్రేక్షకులను నవ్వించే శక్తి ఈవీవీ సత్యనారాయణగారికి ఉండేది.. ఇప్పుడు మారుతికి ఉంది’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చి మహావృక్షంలా నిలబడ్డారంటే ఆయన పట్టుదల వల్లే. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఇప్పటికీ ఇండస్ట్రీకి వస్తుండటం గ్రేట్. మారుతికి మంచి ప్రతిభ ఉంది. ‘పక్కా కమర్షియల్’ సినిమా తర్వాత తను మరింత మంచి స్థాయికి ఎదుగుతాడు’’ అన్నారు. ఈ వేడుకలో చిత్ర సహనిర్మాత ఎస్కేఎన్, యూవీ క్రియేషన్స్ వంశీ, విక్కీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
విజయవాడలో ‘పక్కా కమర్షియల్’ ప్రమోషన్ (ఫొటోలు)
-
పక్కా కమర్షియల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా మెగాస్టార్!
గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నట్లు వినికిడి. ఇకపోతే ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్ ఉన్న సినిమా చేశానని ఇటీవల గోపీచంద్ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘పక్కా కమర్షియల్’ కథలో హ్యూమర్‌కు మంచి స్కోప్ ఉందని, మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నానని పేర్కొన్నాడు. అటు రాశీ ఖన్నా సైతం ఈ సినిమా తనకెంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో చేసిన ఏంజెల్ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుందని తెలిపింది. చదవండి: ఓటీటీలో చేయను, ఎప్పటికీ నేను బిగ్ స్క్రీన్ హీరోనే! ఇంజనీర్‌ను పెళ్లాడిన బుల్లితెర బ్యూటీ -
నా ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తం: గోపీచంద్
గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా జూలై 1న విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్స్‌తో బిజీ అయ్యాడు గోపీచంద్. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఇండస్ట్రీకి రావడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరు. ఆయన నన్ను హీరోగా పెట్టి తొలి వలపు సినిమా చేశారు. అది ఫస్ట్ మూవీ కావడంతో నేనెలా చేస్తానో అని చాలామందికి అనుమానపడ్డారు. చివరకు ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు. ఆరునెలల వరకు ఏ సినిమా రాలేదు. ఆ తర్వాత పరిస్థితుల వల్ల విలన్‌గా చేశాను. నేను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయి. ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అని మనసులో అనుకున్నాను. చిన్నప్పుడు నా అన్న ప్రేమ్‌చంద్ బ్లేడు తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు? అంటూ బ్లేడు తీసుకుని నా ముక్కు కోసేశాడు. అప్పుడు నేను పెరుగన్నం తింటున్నా.. రక్తం కారి నా పళ్లెంలో నిండిపోయింది. ఇక నా చిన్నతనంలో అంటే దాదాపు నేను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది' అని ఎమోషనలయ్యాడు గోపీచంద్. ఆ తర్వాత మారుతి తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. 'ఒకసారి ల్యాబ్‌కు వెళ్లినప్పుడు.. సినిమా ఫస్ట్ కాపీ చూసి తక్కువ నిడివిలో తీయాలి, ఇలా తీయకూడదు అని సూచించాను. దానికాయన నువ్వు డైరెక్టర్ అయి సినిమా తీయు, తెలుస్తుంది. అప్పుడు ఎలా తీయాలో మాకు చెప్పండి, నేర్చుకుంటాం అంటూ నానామాటలు అన్నారు' అని గుర్తు చేసుకున్నాడు. చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె సైరన్, షూటింగ్స్ బంద్! -
చాలా మందికి అప్పు ఇచ్చా.. తిరిగి ఇవ్వలేదు : గోపీచంద్
హిట్,ప్లాప్‌లతో సంబంధం లేకుండా వైవిద్యమైన కథనలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు హీరో గోపీచంద్. ‘తొలివలపు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమై..తర్వాత విలన్‌గా పలు సినిమాల్లో నటించి, మళ్లీ హీరోగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచోస్టార్ ‘పక్కా కమర్షియల్’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. రాశీఖన్నా హీరోయిన్. విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గోపీచంద్ తాజాగా ఓ ఇంటర్వ్యూ తన రెమ్యూనరేషన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. జయం చిత్రానికి గాను తాను తీసుకున్న రెమ్యునరేషన్ కేవలం రూ.11 వేలు మాత్రమేనని చెప్పాడు. డైరెక్టర్ తేజకు 11 లక్కీ నంబరు అని.. అందుకే తనకు రూ.11 వేలు ఇచ్చారని అన్నాడు. ఆ డబ్బులు తీసుకుని.. దీని పక్కన ఇంకో సున్నా ఉండోచ్చు కదా అని అనుకున్నానని సరదాగా చెప్పాడు. ఇక ఇప్పటివరకు నటించిన చిత్రాలలో దేనికి ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకున్నావని అడగ్గా.. ‘పక్క కమర్షియల్’ చిత్రానికే అత్యధిక పారితోషికం అందుకున్నానని బదులిచ్చాడు. ఎవరికైనా అప్పు ఇచ్చారా అని అడిగితే.. చాలా మందికి ఇచ్చానని, కొంతమంది తిరిగి ఇస్తే.. మరికొంత మంది ఇవ్వలేదని చెప్పాడు. వారి పరిస్థితి చూసి తాను కూడా డబ్బులు అడగలేదన్నారు. ఇలాంటి విషయాలలో తాను అంత కమర్షియల్ కాదని గోపీచంద్ తెలిపాడు. -
జయం సినిమాలో నా పారితోషికం ఎంతంటే?: గోపీచంద్
విలన్‌గా కెరీర్ మొదలు పెట్టి హీరోగా రాణిస్తున్నాడు గోపీచంద్. మధ్యలో సినిమా ఎంపికలో కొన్ని తప్పులు చేసి తడబడ్డ గోపీచంద్ సీటీమార్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు జయం సినిమా గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. 'నా సంపాదన జయంతోనే మొదలైంది. తేజగారి లక్కీ నంబర్ రూ.11 వేలు. అందుకని నాకు పారితోషికం కూడా అంతే ఇచ్చారు. దీని పక్కన ఓ సున్నా కూడా ఉండొచ్చు కదా అనిపించింది. అది నా మొదటి రెమ్యునరేషన్. ఆ డబ్బు తీసుకెళ్లి ఇంట్లో ఇచ్చాను. ఇక నా జీవితంలో చాలామందికి అప్పిచ్చాను. కానీ కొందరు తిరిగివ్వలేరు. సరే, వాళ్ల పరిస్థితి బాగోలేదేమోలే అని వదిలేస్తానే తప్ప కమర్షియల్‌గా వ్యవహరించి వాళ్ల దగ్గర నుంచి నా డబ్బులు రాబట్టుకోలేదు' అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు. చదవండి: పెళ్లి చేసుకున్నాం, మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్ ఏం లేదు లేడీ ఓరియంటెడ్ మూవీస్, ఒక్కరితో కాదు ఇద్దరు, ముగ్గురితో! -
‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ లాంచ్
-
ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు, కమెడియన్: రాశీ ఖన్నా
‘‘నేను హీరోగా చేసిన ‘రణం’, ‘లౌక్యం’ చిత్రాల్లో మంచి కామెడీ ఉంది.. వీటికి ఓ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయితే అదే ‘పక్కా కమర్షియల్’ చిత్రం. ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఆదివారం హీరో గోపీచంద్ బర్త్ డే (జూన్ 12). ఈ సందర్భంగా ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘నా పుట్టినరోజున మిమ్మల్ని (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) కలిసినందుకు సంతోషంగా ఉంది. మారుతి వంటి మంచి మనిషిని నాకు పరిచయం చేసిన యూవీ క్రియేషన్స్ వంశీకి చాలా థ్యాంక్స్. ‘పక్కా కమర్షియల్’ కథ బాగా వచ్చింది. ట్రైలర్లో చూసింది కొంచెమే. సినిమాలో ఫుల్ మీల్స్ ఉంది. మారుతి అలాంటి సీన్స్‌ను రాశారు’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు కథ ఒప్పుకున్న తర్వాత ఆయన్ను బాగా చూపించాలనే విషయంపై ఏకాగ్రత పెట్టాను. అందుకు తగ్గట్లుగానే గోపీచంద్‌గారు ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారు, వంశీ, వాసులకు ధన్యవాదాలు’’ అన్నారు. రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ టైమ్ నేను ఓ కామెడీ రోల్ చేశాను. ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు. కమెడియన్ అయ్యాను (నవ్వుతూ)’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌గారు, నా కెరీర్లో ఈ చిత్రం స్పెషల్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. సినిమాను ‘పక్కా కమర్షియల్’గానే తీసినా థియేటర్లో ప్రేక్షకులకు చూపించేందుకు నాన్ కమర్షియల్‌గా టికెట్ ధరలను అందుబాటులో ఉంచుతున్నాం’’ అన్నారు. ‘‘ఎమోషన్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను మేళవించి ఈ సినిమాను మారుతిగారు తెరకెక్కించారు’’ అన్నారు సహనిర్మాత ఎస్కేఎన్. నటులు ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య పాల్గొన్నారు. చదవండి: హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా? విక్రమ్‌లో సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు? -
పక్కా కమర్షియల్ ట్రైలర్: నేను హీరోను కాదు, విలన్..
'ప్రతిరోజు పండగే' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా కథానాయికగా నటించింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు మారుతి. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి ఏమో, చనిపోతామేమో.. అని వీడియో, కొద్ది గంటలకే మృతి -
పక్కా కమర్షియల్: సగం డైలాగ్‌తోనే వీడియో ముగించారు!
గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. రాశీఖన్నా కథానాయిక. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. బుధవారం ఈ సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ముప్పై సెకన్ల వీడియో క్లిప్‌లో హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, హీరో గోపీచంద్, సత్యరాజ్ కోర్టు గదిలో లాయర్ గెటప్‌లో కనిపించారు. 'మీరు కేసు ఒప్పుకునేముందు ఫీజులతో రమ్మంటారు. పనయ్యాక వాడిని వంగబెట్టి తడిమి....' అంటూ సగం డైలాగ్‌తోనే ఆపేశారు. ఫుల్ డైలాగ్స్‌తో నిండిన ట్రైలర్ వీక్షించాలంటే జూన్ 12 వరకు ఆగాల్సిందే! అంటే హీరో గోపీచంద్ బర్త్‌డే రోజే ట్రైలర్ రిలీజవుతుందన్నమాట. అలాగే నిర్మాతలు అదేరోజు కర్నూలులో భారీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని సైతం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల మాదిరిగా కాకుండా పక్కా కమర్షియల్ టిక్కెట్లను సాధారణ ధరలకే విక్రయిస్తామని నిర్మాత బన్నీ వాసు ఇదివరకే హామీ ఇచ్చారు. చదవండి: సూర్య ఎంట్రీ సీన్.. స్క్రీన్ తగలబెట్టిన ఫ్యాన్స్! తమ రిలేషన్‌ను అఫిషీయల్ చేసిన లవ్‌బర్డ్స్ -
ఎరుపెక్కిన రాశీఖన్నా అందాలు
-
అలా చేస్తే చేటు తప్పదు
‘‘ఈ మధ్య నిర్మాతలు త్వరగానే సినిమాలను ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఇలా చేస్తే చేటు తప్పదేమో. మా ‘పక్కా కమర్షియల్’ చిత్రం మాత్రం ఆలస్యంగానే ఓటీటీకి వస్తుంది’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. గోపీచంద్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘టి. కృష్ణ (హీరో గోపీచంద్ తండ్రి) గొప్ప దర్శకులు. ఆయనతో మా బ్యానర్లో ఓ సినిమా తీయాలనుకున్నాను. కుదర్లేదు. ఇప్పుడు వారి అబ్బాయి గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమా తీసినందుకు సంతోషంగా ఉంది. గోపీచంద్‌లో ఉన్న కామెడీని దర్శకుడు మారుతి బాగా బయటకు తీశారు. ఈ సినిమాను బాగా ఖర్చు పెట్టి తీశాం’’ అన్నారు. ‘‘రణం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ అంత ఫన్ ఉన్న సినిమా చేశాను. ‘పక్కా కమర్షియల్’ కథలో హ్యూమర్‌కు మంచి స్కోప్ ఉంది. మారుతి రాసిన కథకు న్యాయం చేశాననే అనుకుంటున్నాను’’ అన్నారు గోపీచంద్. ‘‘నా నుంచి ప్రేక్షకులు ఆశించే కామెడీకి ఇతర అంశాలు జోడించి తీసిన చిత్రం ‘పక్కా కమర్షియల్’’ అన్నారు మారుతి. ‘‘ఎంటర్ టైన్మెంట్కు మంచి యాక్షన్ కుదిరిన చిత్రం ఇది’’ అన్నారు బన్నీ వాసు. ‘‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ‘ప్రతిరోజూ పండగ’ చిత్రంలో నేను చేసిన ఏంజెల్ ఆర్నా పాత్రకు రెండు రెట్ల వినోదం ఈ సినిమాలో ఉంటుంది’’ అన్నారు రాశీ ఖన్నా. సహనిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. -
‘పక్కా కమర్షియల్’ టికెట్ రేట్స్‌పై బన్నీవాసు క్లారిటీ
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టికెట్ల ధరలపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. అందరికి అందుబాటులో ఉండేలా ‘పక్కా కమర్షియల్’ టికెట్ ధరలు ఉంటాయని చెప్పారు. (చదవండి: స్టేజ్‌పై మహేశ్‌బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ..‘టికెట్ రేట్స్ అందరికి అందుబాటులో ఉండాలని కోరుకునే వారిలో అల్లు అరవింద్, నేను ముందు వరుసలో ఉంటాం. పక్కా కమర్షియల్ మూవీలో టికెట్ల రేట్లను తగ్గించాం. ఈ సినిమాకి నైజాంలో 160(జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150+ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్‌లో రూ.100+ జీఎస్టీ’గా టికెట్ రేట్లు ఉంటాయి’ అని బన్నీ వాసు స్పష్టం చేశారు. టికెట్ కోసం డబ్బులు పెట్టిన వారంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని ఆయన చెప్పుకొచ్చారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా అంత త్వరగా ఓటీటీలోకి రాదని, ఎఫ్3కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది’ అని అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. -
స్టేజ్‌పై మహేశ్‌బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో చిత్రపరిశ్రమ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకటి రెండు పెద్ద సినిమాలు మినహా.. ఇతర చిత్రాలేవి పెట్టిన బడ్జెట్‌ని తిరిగి రాబట్టుకోలేకపోతున్నాయి. బాలీవుడ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఒకప్పుడు 100 కోట్ల వసూళ్లను ఈజీగా రాబట్టిన బాలీవుడ్ హీరోలు.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడుతున్నారు. ఇక టాలీవుడ్లో సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు సిద్దంగా ఉన్నప్పటికీ.. టికెట్ల రేట్లు థియేటర్లకి దూరం చేస్తున్నాయి. అలాగే కరోనా ఎఫెక్ట్‌తో ఓటీటీల ప్రాధాన్యత పెరగడం కూడా థియేటర్స్‌కి ప్రేక్షకులు దూరం కావడానికి ఒక్క కారణమని చెప్పొచ్చు. (చదవండి: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ ఇదేనా ?) సూపర్ హిట్ చిత్రాలను సైతం నాలుగు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేస్తుండడంతో.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు థియేర్స్‌కి వెళ్లడమే మానేశారు. కొద్ది రోజులు ఆగితే ఓటీటీలో సినిమా చూడొచ్చులే అనే భావన వారిలో ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులకు థియేటర్స్ రప్పించడం కోసం నిర్మాతలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ మధ్యే ఎఫ్3 చిత్రానికి టికెట్లను రేట్లను పెంచకుండా.. ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించే ప్రయత్నం చేశాడు దిల్ రాజు. ఆయన బాటలోనే పలువురు నిర్మాతలు నడిచేందుకు సిద్దమవుతున్నారు. ఇదిలా ఉంటే... తాజా పరిస్థితులపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించడం కోసం సినిమా హీరోలు ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం పక్కా కమర్షియల్. తాజాగా ఈచిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ..‘సినిమా ఫంక్షన్స్‌కు వెళ్లడం గోపిచంద్‌కు పెద్దగా ఇష్టం ఉండదు. కాస్త సిగ్గు కూడా ఎక్కువే. ఈ మీడియా సమావేశానికి గోపిచంద్‌ని కచ్చింతంగా రప్పించండి అని నేను చెప్పాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగాలేదు. సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు కూడా రావాలి. ఈ మధ్య కాలంలో ఓ పెద్ద హీరో స్టేజ్ మీద డ్యాన్స్ చేసి తన సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. అలా చేసువాల్సిన పరిస్థతి ఏర్పడింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత హీరోలపైన కూడా ఉంది. ఈ మధ్య ఓటీటీలో చాలా కంటెంట్ దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను ధియేటర్స్‌కు రావాలంటే.. హీరో, హీరోయిన్లు ప్రచారంలో పాల్గొనాలి. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా హీరో, హీరోయిన్లు వచ్చి తమ సినిమాను ప్రచారం చేసుకోవాలి. మమల్ని(నిర్మాతలను) చూసి ప్రేక్షకులను థియేటర్స్‌కు రారు. హీరో హీరోయిన్లను చూసే వస్తారు’అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా సక్సెస్ మీట్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. కర్నూలులో జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్ తొలిసారిగా స్టేజ్‌పై స్టెప్పులేసి ఫ్యాన్స్ అలరించాడు. అల్లు అరవింద్ పరోక్షంగానే మహేశ్‌బాబును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
అందాల రాశీ.. మేకప్ వేసి.. సాంగ్ విన్నారా?
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. రాశీ ఖన్నా కథానాయిక. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించారు. జూలై 1న సినిమా రిలీజ్ చేస్తున్న తరుణంలో ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టించి చిత్రయూనిట్. అందులో భాగంగా అందాల రాశీ.. అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. 'అందాల రాశీ మేకప్ వేసి.. నాకోసం ఒచ్చావే.. స్వర్గంలో కేసే నామీదేసి భూమ్మీద మూసావే..' అంటూ మొదలైంది. జేక్స్ బెజోయ్ అందించిన ఈ మెలోడీ మ్యూజిక్కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా సాయిచరణ్ భాస్కరుణి, రమ్య బెహరా అద్భుతంగా పాడారు. చదవండి 👇 కోటి రూపాయలు ఇస్తామన్నా పాడనని చెప్పేసిన కేకే ఆమె కోసం కొట్టేవాడు.. అందుకే ఆత్మహత్యాయత్నం: టీవీ నటి -
‘పక్కా కమర్షియల్’ నుంచి ‘అందాల రాశీ..’వచ్చేస్తుంది
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా జూన్ 1న ఈ చిత్రం నుంచి ‘అందాల రాశీ..’ అనే పాటను విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. గోపీచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు’అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. -
'పక్కా కమర్షియల్'గా ఆ ఓటీటీకి డిజిటల్ రైట్స్..
Gopichand Pakka Commercial Movie Digital Rights Acquires Aha OTT: హీరో గోపీచంద్, బొద్దుగుమ్మ రాశీ ఖన్నా ముచ్చటగా మూడోసారి జంటగా నటిస్తున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌లో నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్ తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ విడుదలకు ముందే పోస్ట్ థియేట్రికల్ హక్కులను మంచి మొత్తానికి ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కొన్ని వారాల తర్వాత డిజిటల్ రైట్స్‌ను 'పక్కా కమర్షియల్'గా సొంతం చేసుకున్న ఆహా ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి చివరిసారిగా పాటలు రాశారు. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. ఫిబ్రవరి 2 సిరివెన్నెల చివరి పాట -
గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ రిలీజ్ డేట్ వచ్చేసింది
మ్యాచో హీరో గోపీచంద్‌తో దర్శకుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ మూవీ టైటిల్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈమూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. చదవండి: మెగా కోడలు ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు జులై 1, 2022న పక్కా ఎంటర్టైన్మెంట్తో వస్తున్నామంటూ మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. మారుతి డైరెక్షన్లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీలో రాశీ ఖాన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీలో సత్యరాజ్, జగపతి బాబులు కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జేకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ Get ready for 100% Pakka Entertainment! 🤙 Macho star @YoursGopichand & @DirectorMaruthi 's #PakkaCommercial in theatres from 𝐉𝐔𝐋𝐘 𝟏𝐬𝐭, 2022.#PakkaCommercialOnJuly1st #AlluAravind @RaashiiKhanna_ #BunnyVas @JxBe #KarmChawla @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/Rxg217DIqc — BA Raju's Team (@baraju_SuperHit) March 30, 2022 -
సమ్మర్ రేసులో మరిన్ని భారీ చిత్రాలు.. ఏ సినిమాకు మీ ఓటు?
విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమకథకు డేట్ సెట్ అయింది. సన్నాఫ్ ఇండియా చేసిన పోరాటం చూసే డేట్ సెట్ అయింది. కరోనా కరుణిస్తే పక్కా కమర్షియల్ చూసే డేట్ సెట్ అయింది. ఇంతేనా... ఇంకా బుధవారం బోలెడన్ని డేట్స్ సెట్ అయ్యాయి. పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ్, హిందీ చిత్రాల రిలీజ్ డేట్ సెట్ అయింది. ఇక ప్రేక్షకులు ఏ రోజు సినిమా చూడాలో... డేట్ సెట్ చేసుకోవడమే ఆలస్యం. విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకావ్యంగా రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే జంటగా ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథాగా ఈ చిత్రం రూపొందింది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ నెలలోనే ‘సన్నాఫ్ ఇండియా’ తెరపైకి వచ్చే తేదీ షురూ అయింది. సమాజాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేసే పవర్ఫుల్ వ్యక్తిగా మోహన్‌బాబు టైటిల్ రోల్ చేసిన చిత్రం ఇది. ఈ సినిమాకు మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌తో కలసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మరోవైపు మూడు నెలల తర్వాత రానున్న డేట్‌ని ‘పక్కా కమర్షియల్’ టీమ్ ప్రకటించింది. కరోనా కరుణిస్తే... అనుకున్న తేదీకి పక్కాగా వస్తాం అంటూ ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. గోపీచంద్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌తో కలిసి జీఏ2 పిక్చర్స్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పలు మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాల రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. మార్చి 4న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా తెరకు రానుంది. ఈ తేదీని ప్రకటించి, టీజర్‌ని రిలీజ్ చేశారు. మూడు పదుల వయసున్న అర్జున్ కుమార్‌కి పెళ్లి ఎందుకు కాలేదు? చివరకి పెళ్లి కోసం అర్జున్ కుమార్ అండ్ ఫ్యామిలీ ఏం చేశారు? అనే విషయాలతో ఈ సినిమా సాగుతుంది. విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ చిత్రదర్శకుడు రవి కిరణ్ కోలా కథ–మాటలు–స్క్రీన్‌ప్లే అందించారు. ఇక ఫిబ్రవరి 18న విడుదలకు రెడీ అయిన సినిమా ‘సురభి 70 ఎంఎం’ (హిట్టు బొమ్మ ). గంగాధర వై.కె. అద్వైత దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్, సినిమా థియేటర్ని కాపాడుకోవాలి అనే కథతో గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. బాబీ ఫిలిమ్స్ సమర్పణలో కేకే చైతన్య నిర్మించిన ఈ చిత్రంలో అక్షత శ్రీనివాస్, వినోద్, అనిల్, చందు, మహేశ్, ఉషాంజలి, శ్లోక తదితరులు నటించారు. ఆచార్య ఏప్రిల్ 29, సర్కారు వారి పాట మే 12కు రిలీజ్ అవుతున్నాయి. హిందీలోనూ... బాలీవుడ్‌లోనూ రిలీజ్‌ల హడావిడి కనబడుతోంది. ఆలియా భట్ టైటిల్ రోల్ చేసిన ‘గంగూబాయి కతియావాడి’ ఈ నెల 25న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన ‘ఝుంద్’ మార్చి 4న, ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘అనేక్’ మే 13న, కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన ‘భూల్ భులెయ్యా 2’ మే 20న రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇంకా రిలీజ్ లిస్ట్‌లో పలు చిత్రాలు ఉన్నాయి. కోలీవుడ్‌లోనూ... తమిళ పరిశ్రమ కూడా సినిమా విడుదల తేదీలను ఖరారు చేసుకుంటోంది. రిలీజ్ కానున్న చిత్రాల్లో అజిత్ కుమార్ ‘వలిమై’, సూర్య ‘ఎదర్కుమ్ తునిందవన్’ ఉన్నాయి. అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ‘వలిమై’ ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ అనువాదరూపంలో అదే తేదీన ఈ చిత్రం తెరకు రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తెలుగు హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయడం విశేషం. ఇక ఈ కరోనా కాలంలో సూర్య హీరోగా నటించిన రెండు చిత్రాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలయ్యాయి. అది సూర్య ఫ్యాన్స్‌ని కాస్త నిరాశపరిచింది. అయితే సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఎదర్కుమ్ తునిందవన్’ చిత్రం థియేటర్స్‌లో రానుండటం వారికి ఆనందాన్నిచ్చే విషయం. మార్చి 10న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అనువదించి, అదే తేదీన విడుదల చేయనున్నారు. డబుల్ డేట్! ఒక పని చేయడానికి ఓ ప్లాన్ అనుకుంటాం. అది ప్లాన్ ‘ఎ’. ఆ ప్లాన్ ప్రకారం జరగకపోతే అనే ఆలోచనతో ప్లాన్ ‘బి’ కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు తెలుగులో ‘ప్లాన్ బి’ ట్రెండ్ నడుస్తోంది. సినిమా రిలీజ్‌కి ‘డబుల్ డేట్’ ప్రకటించి, ఆ తర్వాత ఓ డేట్‌కి ఫిక్స్ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఈ ట్రెండ్ మొదలైందని చెప్పొచ్చు. ఓ పది రోజుల క్రితం ‘‘మా ‘ఆర్ఆర్ఆర్’ని ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తాం’’ అని ఈ చిత్రబృందం ప్రకటించింది. చివరికి మార్చి 25న విడుదల చేయనున్నట్లు సోమవారం ఓ తేదీని ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఆర్ఆర్ఆర్’ తరహాలోనే ‘భీమ్లా నాయక్’ రెండు విడుదల తేదీలను ప్రకటించింది. పవన్ కల్యాణ్–రానా హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘మా చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తాం.. లేకపోతే ఏప్రిల్ 1న చిత్రం థియేటర్స్‌కు వస్తుంది’’ అని సోమవారం ప్రకటించారు. మంగళవారం రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’, వరుణ్ తేజ్ ‘గని’.. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ‘డబుల్ డేట్’ ప్రకటన వచ్చింది. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘‘మార్చి 25న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మార్చి 25 కుదరకపోతే ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించారు. ‘‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్స్‌లో ఫిబ్రవరి 25 కూడా ఉంది. ఆ చిత్రం ఫిబ్రవరి 25కి రాకపోతే అదే రోజున ‘గని’ విడుదలవుతుంది.. ‘భీమ్లా నాయక్’ 25నే రిలీజ్ అయితే ‘గని’ మార్చి 4న రిలీజవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
పక్కా కమర్షియల్ నుంచి ఫస్ట్ సింగిల్, ఆకట్టుకుంటున్న లిరిక్స్..
మ్యాచో హీరో గోపీచంద్‌తో విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు మూవీ విడుదల తేదీని ప్రకటించిన ప్రకటించిన చిత్రం బృందం, తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఓ ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇదికావడం విశేషం. సిరివెన్నెల గారు చివరిగా రాసిన జీవిత సారాంశం ఈ పాటలో కనిపిస్తుంది. పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్.. దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్.. ఎయిర్ ఫ్రీయా.. నో.. నీరు ఫ్రీయా.. నో.. ఫైర్ ఫ్రీయా.. నో.. నువ్ నుంచున్న జాగా ఫ్రీయా.. అన్నీ పక్కా పక్కా పక్కా కమర్షియల్.. జన్మించినా మరణించినా అవదా ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు.. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్‌లో ఉంటాయని మారుతి చెప్పారు. -
సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్
Maruthi Emotional On Pakka Commercial Title Song Lyricist Sirivennela: మాచో స్టార్ గోపిచంద్ సినిమాలపై జోరు పెంచాడు. సీటిమార్ సినిమా తర్వాత వెంటనే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ అయిన 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ ను ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ టీజర్లో గోపిచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. 'పక్కా.. పక్కా.. పక్కా కమర్షియలే' అంటూ సాగుతున్న ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తుంది. అయితే ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల చివరిసారిగా రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండనుందట. దీంతో డెరెక్టర్ మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. జన్మించిన మరణించినా ఖర్చే ఖర్చు అంటూ సాగే అందమైన పాట రాశారని మారుతి పేర్కొన్నారు. మరణం గురించి ముందే తెలిసినట్లు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు మారుతి. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యంతోపాటు ఈ సాంగ్‌లో మరెన్నో అద్భుతాలు ఉన్నాయని మారుతి తెలిపారు. -
జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. ఫిబ్రవరి 2 సిరివెన్నెల చివరి పాట
‘పక్కా కమర్షియల్’ సినిమా కోసం జననం... మరణం గురించి దివంగత ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన పాట ఫిబ్రవరి 2న విడుదల కానుంది. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2పై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ఇది. ‘‘సిరివెన్నెలగారు రాసిన చివరి పాట ఇది. ఈ స్ఫూర్తిదాయకమైన పాట భావోద్వేగంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘‘మరణం గురించి ముందే తెలిసినట్లు సిరివెన్నెలగారు కొన్ని పదాలను ఈ పాటలో సమకూర్చారు’’ అన్నారు మారుతి. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: కరమ్ చావ్లా, సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు. -
Pakka Commercial: ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజమ్..ఎప్పుడో వదిలేశా!
‘ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజమ్, మీరు ఇప్పుడు చేస్తున్నారు.. నేను ఎప్పుడో చూసి, చేసి వదిలేశాను’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్‌తో ‘పక్కా కమర్షియల్’ టీజర్ విడుదలైంది. గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్–యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. మా సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎస్కేఎన్, లైన్ ప్రొడ్యూసర్: బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్యగమిడి, సంగీతం: జేక్స్ బిజాయ్, కెమెరా: కమర్ చావ్ల. -
ఆ హీరోలకు పీఆర్వోగా చేశా, తర్వాత నిర్మాతగా మారాను
‘‘సినిమా అనేది మన రోజువారీ జీవితంలో ఓ భాగం. కోవిడ్ వ్యాక్సినేషన్ పెరిగింది. ప్రేక్షకుల్లో కాస్త భయం తగ్గింది. థియేటర్స్ రీ ఓపెన్ అయితే ప్రేక్షకులు మునుపటిలా వస్తారనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత ఎస్కేఎన్. ‘ఈ రోజుల్లో, టాక్సీవాలా’ నిర్మాత ఎస్కేఎన్ బర్త్ డే నేడు (జూలై 7). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘జర్నలిస్టుగా, ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్‌చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలకు పీఆర్వోగా చేశాను. మారుతి దర్శకుడిగా పరిచయమైన ‘ఈ రోజుల్లో..’తో నిర్మాతగా నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాను. విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ తీశాను. నేను, మారుతి, బన్నీ వాసు, యూవీ వంశీ.. సినిమాల్లోకి రాకముందు నుంచే మంచి మిత్రులం. ‘ఈ రోజుల్లో..’ తో నేను, మారుతి, ‘100 పర్సెంట్ లవ్’తో వాసు, ‘మిర్చి’తో వంశీ.. ఇలా మేం హిట్ సినిమాలతోనే ఇండస్ట్రీకి వచ్చాం. మాకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉండవు. పైగా అల్లు అరవింద్‌గారి సలహాలు, సూచనలతో ముందుకెళుతున్నాం. సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ రీ ప్లేస్ చేయలేదు. కరోనా వల్ల కొందరు నిర్మాతలు ఆర్థిక ఇబ్బందులతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు వెళ్లడం తప్పు కాదు. అయితే థియేటర్స్ వ్యవస్థ లేకపోతే స్టార్డమ్ తగ్గిపోతుంది. థియేటర్స్ మనుగడ బాగుంటే థియేటర్స్‌కు, ఇండస్ట్రీకి కూడా మేలు. ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’కి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాను. మారుతి అండ్ టీమ్ డైరెక్ట్ చేస్తున్న ఓ సినిమాను నేను, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాం. రచయిత, దర్శక–నిర్మాత సాయి రాజేశ్‌తో మూడు సినిమాలు చేయనున్నాను. దర్శకుడు సందీప్‌రాజ్‌తో రెండు సినిమాలు, రాహుల్ సంకృత్యాన్, వీఐ ఆనంద్, కరుణ్ కుమార్‌లతోనూ సినిమాలు ఉన్నాయి. మారుతి, నేను ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ ద్వారా వెబ్ కంటెంట్‌ను వ్యూయర్స్ ముందుకు తీసుకురానున్నాం’’ అన్నారు. చదవండి: ‘పక్కా కమర్షియల్’..పోస్టర్ రిలీజ్ -
‘పక్కా కమర్షియల్’..పోస్టర్ రిలీజ్
గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలోని స్టైలిష్ పోస్టర్‌ను గోపీచంద్ బర్త్‌డే (జూన్ 12) సందర్భంగా విడుదల చేశారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ నలభై శాతం పూర్తయింది. కొత్త షెడ్యూల్‌ను వచ్చే నెల మొదటివారంలో ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: జేకేఎస్ బిజాయ్, సహనిర్మాత: ఎస్కేఎన్. -
'వేశ్య'గా యాంకర్ అనసూయ!
టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందంతో పాటు అభినయం ఈ బ్యూటీ సొంతం. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెరను మెప్పిస్తున్న అనసూయ వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. అక్కడ విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర అనసూయ కెరీర్‌ని మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతో ఆమె క్రేజీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న ఓ సినిమాలో అనసూయ నటించనుంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని మూవీ టీం వెల్లడించింది. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రాశి ఖన్నా, ఈషా రెబ్బా కథానాయుకలుగా నటించున్నట్లు సమాచారం. చదవండి : (అవసరమని వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..!) (వైరల్ అవుతున్న దీపికా పదుకొనె డ్యాన్స్ వీడియో) -
గోపీచంద్- మారుతి సినిమా టైటిల్ ఇదే
మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫిబ్రవరి 14) ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే అక్టోబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. Bless us my next with Macho star @YoursGopichand garu#PakkaCommercial It is..👌#AlluAravind #BunnyVas @JxBe #KarmChawla #Raveendar @SKNonline @UV_Creations @GA2Official pic.twitter.com/SsAM9brNJ3 — Director Maruthi (@DirectorMaruthi) February 14, 2021