‘పక్కా కమర్షియల్’ నుంచి ‘అందాల రాశీ..’వచ్చేస్తుంది | Pakka Commercial Movie New Song To Release On 1st June | Sakshi
Sakshi News home page

‘పక్కా కమర్షియల్’ నుంచి ‘అందాల రాశీ..’వచ్చేస్తుంది

Published Thu, May 26 2022 4:23 PM | Last Updated on Thu, May 26 2022 4:23 PM

Pakka Commercial Movie New Song To Release On 1st June - Sakshi

గోపీచంద్‌ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగా జూన్‌ 1న ఈ చిత్రం నుంచి ‘అందాల రాశీ..’ అనే పాటను విడుదల చేయనున్నారు.

ఈ మేరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో గోపీచంద్‌ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్‌ చేశారు. గోపీచంద్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు’అని చిత్రబృందం పేర్కొంది.  ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించగా, సత్యరాజ్‌ కీలక పాత్ర పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement