‘‘నేను హీరోగా చేసిన ‘రణం’, ‘లౌక్యం’ చిత్రాల్లో మంచి కామెడీ ఉంది.. వీటికి ఓ మాస్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ అయితే అదే ‘పక్కా కమర్షియల్’ చిత్రం. ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు హీరో గోపీచంద్. మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2– యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. ఆదివారం హీరో గోపీచంద్ బర్త్ డే (జూన్ 12). ఈ సందర్భంగా ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ – ‘‘నా పుట్టినరోజున మిమ్మల్ని (ఫ్యాన్స్‌ని ఉద్దేశించి) కలిసినందుకు సంతోషంగా ఉంది. మారుతి వంటి మంచి మనిషిని నాకు పరిచయం చేసిన యూవీ క్రియేషన్స్ వంశీకి చాలా థ్యాంక్స్. ‘పక్కా కమర్షియల్’ కథ బాగా వచ్చింది. ట్రైలర్‌లో చూసింది కొంచెమే. సినిమాలో ఫుల్ మీల్స్ ఉంది. మారుతి అలాంటి సీన్స్‌ను రాశారు’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు కథ ఒప్పుకున్న తర్వాత ఆయన్ను బాగా చూపించాలనే విషయంపై ఏకాగ్రత పెట్టాను. అందుకు తగ్గట్లుగానే గోపీచంద్‌గారు ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన అభిమానులు కాలర్ ఎగరేసే సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్‌గారు, వంశీ, వాసులకు ధన్యవాదాలు’’ అన్నారు.
రాశీ ఖన్నా మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ టైమ్ నేను ఓ కామెడీ రోల్ చేశాను. ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు. కమెడియన్ అయ్యాను (నవ్వుతూ)’’ అన్నారు. బన్నీ వాసు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌గారు, నా కెరీర్‌లో ఈ చిత్రం స్పెషల్‌గా నిలుస్తుందనే నమ్మకం ఉంది. సినిమాను ‘పక్కా కమర్షియల్’గానే తీసినా థియేటర్లో ప్రేక్షకులకు చూపించేందుకు నాన్ కమర్షియల్‌గా టికెట్ ధరలను అందుబాటులో ఉంచుతున్నాం’’ అన్నారు. ‘‘ఎమోషన్, యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలను మేళవించి ఈ సినిమాను మారుతిగారు తెరకెక్కించారు’’ అన్నారు సహనిర్మాత ఎస్‌కేఎన్. నటులు ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి, సప్తగిరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సత్య పాల్గొన్నారు.
చదవండి: హీరోయిన్ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా?
విక్రమ్‌లో సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు?
Comments
Please login to add a commentAdd a comment