Pakka Commercial Movie Day 1 Box Office Collection, Details Inside - Sakshi
Sakshi News home page

Pakka Commercial Box Office Collection: ‘పక్కా కమర్షియల్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..

Published Sat, Jul 2 2022 12:53 PM | Last Updated on Sun, Jul 3 2022 10:06 AM

Pakka Commercial Movie First Day Box Office Collection - Sakshi

మ్యాచో హీరో గోపీచంద్‌, అందాల బ్యూటీ రాశీఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. విలక్షణ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచాల మధ్య ఈ శుక్రవారం(జులై 1) విడుదలైన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. టైటిల్ కు తగ్గట్టుగానే అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. గోపిచంద్‌ యాక్షన్‌, రాశీఖన్నా గ్లామర్‌, మారుతి స్టైల్‌ కామెడీకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

(చదవండి: ‘పక్కా కమర్షియల్‌’మూవీ రివ్యూ)

ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు మొత్తంగా ఈ చిత్రం రూ.6.3 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు మేకర్స్‌ ప్రకటించారు. గోపీచంద్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా పక్కా కమర్షియల్ కావడం గమనార్హం. ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోడంతో వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement