గోపీచంద్‌- మారుతి సినిమా టైటిల్‌ ఇదే | Gopi Chand And Maruthi Combo Movie Title Out | Sakshi
Sakshi News home page

గోపీచంద్‌- మారుతి సినిమా టైటిల్‌ ఇదే

Published Sun, Feb 14 2021 7:32 PM | Last Updated on Sun, Feb 14 2021 7:43 PM

Gopi Chand And Maruthi Combo Movie Title Out - Sakshi

మ్యాచో హీరో గోపీచంద్‌, మారుతి కాంబినేషన్‌లో  ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా (ఫిబ్రవరి 14) ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించింది చిత్ర యూనిట్‌. 'పక్కా కమర్షియల్' అనే ఆసక్తికర టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుందని తెలిపారు.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చి 5నుంచి ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.  ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే వెల్లడిస్తామని చెప్పారు. మారుతి పదవ సినిమాగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాక ముందే అక్టోబ‌ర్ 1న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement