
పక్కా కమర్షియల్ మూవీ టీమ్
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వం వహించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్‌తో కలిసి ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూలై 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టికెట్ల ధరలపై నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. అందరికి అందుబాటులో ఉండేలా ‘పక్కా కమర్షియల్’ టికెట్ ధరలు ఉంటాయని చెప్పారు.
(చదవండి: స్టేజ్‌పై మహేశ్‌బాబు డ్యాన్స్.. అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు)
మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ..‘టికెట్ రేట్స్ అందరికి అందుబాటులో ఉండాలని కోరుకునే వారిలో అల్లు అరవింద్, నేను ముందు వరుసలో ఉంటాం. పక్కా కమర్షియల్ మూవీలో టికెట్ల రేట్లను తగ్గించాం. ఈ సినిమాకి నైజాంలో 160(జీఎస్టీ అదనం), ఆంధ్ర మల్టీప్లెక్స్‌లో రూ.150+ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్‌లో రూ.100+ జీఎస్టీ’గా టికెట్ రేట్లు ఉంటాయి’ అని బన్నీ వాసు స్పష్టం చేశారు. టికెట్ కోసం డబ్బులు పెట్టిన వారంతా హ్యాపీగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్తారని ఆయన చెప్పుకొచ్చారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా అంత త్వరగా ఓటీటీలోకి రాదని, ఎఫ్3కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది’ అని అల్లు అరవింద్ చెప్పారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించగా, సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment