Pakka Commercial Promotions: Rashi Khanna Interesting Comments On Her Romantic Scenes - Sakshi
Sakshi News home page

Rashi Khanna: నాకు అలాంటి సీన్స్‌లో నటించడమే ఈజీ

Published Wed, Jun 29 2022 1:08 PM | Last Updated on Wed, Jun 29 2022 3:33 PM

Rashi Khanna Interesting Comments on Romantic Scenes In Pakka Commercial Promotions - Sakshi

తనకు రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడమే ఈజీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది స్టార్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా. తాజాగా ఆమె నటించిన చిత్రం పక్కా కమర్షియల్‌. మారుతి దర్శకత్వంలో గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 1న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషనల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రాశీ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు ఎలాంటి సన్నివేశాల్లో చేయడం మీకు ఇష్టమని, తొలిసారి ఈ సినిమాలో కామెడీ చేశారు కదా ఎలా అనిపించిందని అడిగిన ప్రశ్నకు రాశీ నిర్మొహమాటం రొమాంటిక్‌ సీన్స్‌ అంటే ఇష్టమని చెప్పింది. 

చదవండి: సమంతకు మరో స్పెషల్‌ సాంగ్‌ ఆఫర్‌? ఈసారి తెలుగులో కాదు!

ఈ మేరకు ఆమె ‘నాకు తెలిసి కామెడీ చేయడం చాలా కష్టం. కానీ రొమాన్స్‌ అలా కాదు. కామెడీతో పోలిస్తే హీరోలతో రొమాన్స్‌ సీన్స్‌ చేయడం సులభం. ఇప్పటి వరకు సినిమాల్లో నేను రొమాంటిక్‌ సన్నివేశాల్లోనే చేశాను. ఆ సీన్స్‌లో నటించి బోర్‌ కొట్టింది. ప్రస్తుతం కామెడీని ఎంజాయ్‌ చేస్తున్నా. పక్కా కమర్షియల్‌లో నా కామెడీ బాగుటుంది. బాగా నవ్వుకోవచ్చు’ అని చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమాలో రాశీ ఖన్నా తొలిసారి నల్లకోటు ధరించింది. ఇందులో ఆమె లేడీ లాయర్‌గా తన కామెడీతో అందరిని నవ్వించనుంది. 

చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్న విలక్షణ నటుడు!, కారణం ఇదేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement