
మ్యాచో హీరో గోపీచంద్‌తో విలక్షణ దర్శకుడు మారుతి చేస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్‌లో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నేడు మూవీ విడుదల తేదీని ప్రకటించిన ప్రకటించిన చిత్రం బృందం, తాజాగా ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసింది. పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఓ ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇదికావడం విశేషం. సిరివెన్నెల గారు చివరిగా రాసిన జీవిత సారాంశం ఈ పాటలో కనిపిస్తుంది.
పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్..
దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్..
ఎయిర్ ఫ్రీయా.. నో..
నీరు ఫ్రీయా.. నో..
ఫైర్ ఫ్రీయా.. నో..
నువ్ నుంచున్న జాగా ఫ్రీయా..
అన్నీ పక్కా పక్కా పక్కా కమర్షియల్..
జన్మించినా మరణించినా అవదా ఖర్చు..
జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు..
ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్‌లో ఉంటాయని మారుతి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment