
గోపీచంద్ హీరోగా నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్. రాశీఖన్నా కథానాయిక. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. బుధవారం ఈ సినిమా నుంచి ట్రైలర్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ముప్పై సెకన్ల వీడియో క్లిప్‌లో హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, హీరో గోపీచంద్, సత్యరాజ్ కోర్టు గదిలో లాయర్ గెటప్‌లో కనిపించారు.
'మీరు కేసు ఒప్పుకునేముందు ఫీజులతో రమ్మంటారు. పనయ్యాక వాడిని వంగబెట్టి తడిమి....' అంటూ సగం డైలాగ్‌తోనే ఆపేశారు. ఫుల్ డైలాగ్స్‌తో నిండిన ట్రైలర్ వీక్షించాలంటే జూన్ 12 వరకు ఆగాల్సిందే! అంటే హీరో గోపీచంద్ బర్త్‌డే రోజే ట్రైలర్ రిలీజవుతుందన్నమాట. అలాగే నిర్మాతలు అదేరోజు కర్నూలులో భారీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని సైతం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాల మాదిరిగా కాకుండా పక్కా కమర్షియల్ టిక్కెట్లను సాధారణ ధరలకే విక్రయిస్తామని నిర్మాత బన్నీ వాసు ఇదివరకే హామీ ఇచ్చారు.
చదవండి: సూర్య ఎంట్రీ సీన్.. స్క్రీన్ తగలబెట్టిన ఫ్యాన్స్!
తమ రిలేషన్‌ను అఫిషీయల్ చేసిన లవ్‌బర్డ్స్
Comments
Please login to add a commentAdd a comment