Maruthi Emotional Comments On Sirivennela Last Song From Pakka Commercial Movie - Sakshi
Sakshi News home page

Director Maruthi: సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్​

Published Mon, Jan 31 2022 5:10 PM | Last Updated on Mon, Jan 31 2022 7:54 PM

Maruthi Emotional On Pakka Commercial Title Song Lyricist Sirivennela - Sakshi

Maruthi Emotional On Pakka Commercial Title Song Lyricist Sirivennela: మాచో స్టార్​ గోపిచంద్​ సినిమాలపై జోరు పెంచాడు. సీటిమార్​ సినిమా తర్వాత వెంటనే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్​ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్​, గీతా ఆర్ట్స్​ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సింగిల్​ అయిన 'పక్కా కమర్షియల్​' టైటిల్​ సాంగ్​ ను ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్​ టీజర్​ను​ రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ టీజర్​లో గోపిచంద్​ చాలా స్టైలిష్​గా కనిపిస్తున్నాడు. 'పక్కా.. పక్కా.. పక్కా కమర్షియలే' అంటూ సాగుతున్న ఈ టీజర్​కు మంచి స్పందన వస్తుంది. 

అయితే ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల చివరిసారిగా రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండనుందట. దీంతో డెరెక్టర్​ మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. జన్మించిన మరణించినా ఖర్చే ఖర్చు అంటూ సాగే అందమైన పాట రాశారని మారుతి పేర్కొన్నారు. మరణం గురించి ముందే తెలిసినట్లు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు మారుతి. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యంతోపాటు ఈ సాంగ్​లో మరెన్నో అద్భుతాలు ఉన్నాయని మారుతి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement