Maruthi Direction
-
ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?
ఇంతకీ ఆ టైటిల్‌ని ఫిక్స్ చేశారా? ఈ టైటిల్ అనుకుంటున్నారా అంటూ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రం టైటిల్‌ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ‘రాజా డీలక్స్’ అని ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘వింటేజ్ కింగ్’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారనే వార్త వెలుగులోకి వచ్చింది. మరి.. వార్తల్లో ఉన్నట్లు ‘రాజా డీలక్స్’ని ఫిక్స్ చేశారా? లేక ‘వింటేజ్ కింగ్’ అనుకుంటున్నారా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డబ్బింగ్ ఆరంభం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమాలోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ సెప్టెంబరు 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను ఆరంభించారు. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
ఆ బాధ్యత డైరెక్టర్‌దే.. లేకపోతే నిర్మాతలు, ప్రేక్షకులు నష్టపోతారు
‘‘నిర్మాతను, థియేటర్ వ్యవస్థను కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. ప్రస్తుతం డైరెక్టర్ ఎంత బాధ్యతగా ఉన్నాడంటే నిర్మాతను ఒప్పించాలి, థియేటర్‌ను కాపాడుకోవాలి, ఆడియన్స్‌ను సినిమాకు రప్పించాలి. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ అయితే అక్కడి ఆడియన్స్ కూడా కళ్లను పక్కకు తిప్పుకోకుండా చూపించగలగాలి.. అప్పుడే ఒక డైరెక్టర్ సక్సెస్ అయినట్టు’’ అన్నారు డైరెక్టర్ మారుతి. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు మారుతి చెప్పిన విశేషాలు. ► ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ బాగా రాసుకోవాలి. అవసరమైతే రెండు నెలలు ఎక్కువ కష్టపడి అయినా స్క్రిప్ట్‌ను మన టేబుల్ మీదే ఎడిట్ చేసు కుంటే వృథా తగ్గిపోయి నిర్మాతకు చాలా డబ్బులు మిగులుతాయి. దీనికి తోడు మంచి మంచి సబ్జెక్టులు వస్తాయి. ఇండస్ట్రీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్‌తో పాటు షూటింగ్ రోజులు తగ్గించాలి.. మంచి కథలను సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్‌కు నచ్చేలా తీయాలి. మనకు ఇష్టమొచ్చినట్లుగా తీస్తే చూడరు. ► ఒక వ్యక్తి డైరెక్టర్ కావాలంటే ప్రతిభ కంటే ముందు తను ఒక ప్రేక్షకుడు అయ్యుంటే బెస్ట్ సినిమా తీస్తాడు. నాకు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన అనుభవం ఉండటం వల్ల కమర్షియల్ యాంగిల్లో సినిమాలు చేస్తున్నాను. ఆడియన్స్‌కు ఏం కావాలో ఇచ్చి, వారి దగ్గర డబ్బులు తీసుకొని నిర్మాతలకు ఇవ్వా ల్సిన మీడియేషన్ బాధ్యత డైరెక్టర్‌దే.. ఈ మీడియేషన్ కరెక్ట్‌గా చేయకపోతే ఇటు నిర్మాతలు, అటు ప్రేక్షకులు నష్టపోతారు. ► ‘పక్కా కమర్షియల్’ మంచి కథతో అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులు సంతోషంగా కాలర్ ఎగరేసుకుని చూసే సినిమా ఇది. దివంగత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన ఈ సినిమా టైటిల్ పాటకు మంచి స్పందన వచ్చింది. ► జీఏ2 పిక్చర్స్– యూవీ క్రియేషన్స్‌పై నా దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దానికి కారణం మంచి కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు సెట్ అవ్వడం. మనకు చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నా రు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్ రాస్తే మిగతా భాషల నటీనటులను తెచ్చుకోవాల్సిన పని ఉండదు. ► సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రేక్షకులు పెద్ద సినిమాలకు ఎక్కువగా థియేటర్స్‌కు రావడం లేదు.. అందుకే మేము తక్కువ రేట్‌కే మా ‘పక్కా కమర్షియల్’ని చూపించనున్నాం. ఓటీటీలో చూసేయొచ్చు అనుకుంటారేమో.. ఇప్పుడప్పుడే ఓటీటీకి రాదు (నవ్వుతూ). -
మారుతి డైరెక్షన్లో ప్రభాస్ మూవీ, హాటాటాపిక్గా ‘డార్లింగ్’ రెమ్యునరేషన్
‘బాహుబలి’, ‘సాహె’ చిత్రాల తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. అప్పటి వరకు సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ప్రభాస్ నటించే ప్రతీ సినిమా దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్‌తో ఇటీవల ఫ్యాన్స్‌ను పలకరించాడు. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కామెడీ, హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. చదవండి: Dhanush-Aishwarya: విడాకుల తర్వాత ఐశ్యర్యపై ధనుష్ తొలి ట్వీట్, నెటిజన్ల అసహనం అయితే ఈ సినిమాకు ప్రుభాస్ తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 60 రోజుల కాల్షీట్లు మాత్రమే ఇచ్చాడట. దీనికి గాను ఏకంగా రూ. 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే ప్రభాస్ రోజుకు ఏకంగా రూ. 1.25 కోట్ల వరకు తీసుకోనున్నాడన్నమాట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ మూవీలో ‘డార్లింగ్’కు జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారటి టాక్. వీరిలో ఉప్పెన ఫేమ్ కృతీ శెట్టి ఒకరని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్, సలార్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ సినిమాలను పూర్తి చేసి మారుతి సినిమాను సెట్స్‌పైకి తీసుకువస్తాడని సమాచారం. చదవండి: Ram Gopal Varma: ‘రాధేశ్యామ్’ మూవీపై వర్మ షాకింగ్ కామెంట్స్ -
ప్రభాస్‌తో మారుతి చిత్రం.. 'రాజా డీలక్స్' కాదా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా ఆదిపురుష్, సలార్, స్పిరిట్ చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటు ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. కామెడీ, హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. అయితే ఈ చిత్రానికి ఇప్పటికే 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇక తాజా విషయం ఏంటంటే ఈ సినిమాకు మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ వినిపించినా ఆ టైటిల్ ప్రభాస్ కోసం కాదని మరో హీరో కోసమని సమాచారం. మారుతి మాస్ రాజా రవితేజతో కూడా ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఆ చిత్రం కోసం మారుతీ 'రాజా డీలక్స్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇక దీంతో ప్రభాస్ చిత్రానికి సరైన టైటిల్ ఖరారు చేసే పనిలో మారుతీతో పాటు అతని బృందం బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సరైన టైటిల్‌ను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజక్టుకు సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
సిరివెన్నెల చివరి అక్షరమాల.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్
Maruthi Emotional On Pakka Commercial Title Song Lyricist Sirivennela: మాచో స్టార్ గోపిచంద్ సినిమాలపై జోరు పెంచాడు. సీటిమార్ సినిమా తర్వాత వెంటనే మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి మొదటి సింగిల్ అయిన 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ ను ఫిబ్రవరి 2న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు నిర్మాతలు. ఈ టీజర్లో గోపిచంద్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. 'పక్కా.. పక్కా.. పక్కా కమర్షియలే' అంటూ సాగుతున్న ఈ టీజర్‌కు మంచి స్పందన వస్తుంది. అయితే ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక గీతం ఇది. సిరివెన్నెల చివరిసారిగా రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉండనుందట. దీంతో డెరెక్టర్ మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. జన్మించిన మరణించినా ఖర్చే ఖర్చు అంటూ సాగే అందమైన పాట రాశారని మారుతి పేర్కొన్నారు. మరణం గురించి ముందే తెలిసినట్లు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ సిరివెన్నెలను గుర్తు చేసుకున్నారు మారుతి. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యంతోపాటు ఈ సాంగ్‌లో మరెన్నో అద్భుతాలు ఉన్నాయని మారుతి తెలిపారు. -
'ఓ బేబీ'లో సమంత లాంటి రోల్ చేయాలనుంది: మెహ్రీన్
‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా.. అనే తేడాలు చూడను.. నాకు అవకాశం వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలనే భావించి నటిస్తాను’’ అని హీరోయిన్ మెహరీన్ అన్నారు. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యూవీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మంచి రోజులు వచ్చాయి’లో సాఫ్ట్వేర్ పద్దు పాత్రలో కనిపిస్తాను. ఇది ఓ కాలనీలో జరిగే కథ. ఇందులోని సన్నివేశాలు, పరిస్థితులను చాలామంది కోవిడ్ టైమ్‌లో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. సాధారణంగానే నేను ఫన్నీగా ఉంటాను. అందుకే అల్లరి సీన్స్, కామెడీ సీన్స్‌లో నటించడం ఈజీగా అనిపిస్తుంది. మా ఇంట్లో మా అమ్మ, నేను కరోనా బారిన పడి, కోలుకున్నాం. ‘మహానటి’లో కీర్తీ సురేశ్, ‘ఓ బేబీ’లో సమంత లాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్ 3’, కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాను. మరికొన్ని తెలుగు కథలు విన్నాను.. త్వరలో వివరాలు వెల్లడిస్తాను’’ అన్నారు. -
స్టిక్కరింగ్ నుంచి డైరెక్టర్‌గా..
విజయాల గమనంలో విరామాలే ఉంటాయి... ముగింపు కాదు.. అన్న సూక్తిని అక్షరాలా ఒంట పట్టించుకున్న ఉత్సాహవంతుడతడు. వైవిధ్యమే ఊపిరిగా, సృజనే ప్రాణంగా పరుగులు తీస్తున్న నిత్య చైతన్యవంతుడతడు. అందుకే అచిరకాలంలోనే అన్ని సంచలనాలు సాధించాడు. ఎప్పటికప్పుడు కొత్తదనంతో సినీ వినీలాకాశంలో ఇలా వెలుగుతున్నాడు. ఏ మాత్రం సంబంధం లేని రంగం నుంచి చలనచిత్ర రంగానికి వచ్చి.. కొత్త ‘ధన’మే పెట్టుబడిగా వరుస హిట్లు కొట్టి.. విలక్షణ చిత్రాలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సమ్మోహితులను చేస్తున్న ఆ దర్శక మాంత్రికుడు మారుతి కాక ఇంకెవరవుతారు? సూర్యనారాయణ స్వామి దర్శనానికి అరసవల్లి వచ్చిన ఈ నవ్యుత్సాహ సృజనాత్మక కళాకారుడు.. తన అంతరంగంలో ఆలోచనలను వివరించాడు. సాక్షి, అరసవల్లి: ‘ప్రతి మనిషి ఏదో లక్ష్యం పెట్టుకుని పనిచేస్తాడు.. నేనైతే ప్రత్యేకంగా టార్గెట్ అంటూ ఏమీ పెట్టుకోను.. ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే అది సాధించాక అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది.. అలాంటి టైప్ కాదు నేను..’అంటూ వైవిధ్యమైన ముచ్చట్లను పంచుకున్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆదివారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదిత్యున్ని దర్శించుకుని అరుణహోమాన్ని చేసిన అనంతరం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... సాక్షి: సినిమా రంగంలో తొలి అడుగులు ఎలా..? మారుతి: నిజంగానే ఊహించలేదు. మా ఊరు మచిలీపట్నంలో స్టిక్కరింగ్ ఆర్ట్స్ పనులు చేస్తూ ఉండేవాడిని. యానిమేషన్ వరŠుక్స నేర్చుకున్నాను. అదే అనుభవంతో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సందర్భంలో నేను చేసిన లోగో, పార్టీ జెండా తయారీ పనుల సమయంలో చిరంజీవితో పరిచయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన స్ఫూర్తితోనే అడుగులు వేశాను. దర్శకుడు మారుతికి ఆదిత్యుని చిత్రపటాన్ని అందజేస్తున్న ప్రధాన అర్చకులు శంకరశర్మ చిన్న సినిమాలతోనే పెద్ద దర్శకుడిగా ఎదగడంపై...? మొదట్లో చిన్న సినిమాలనే చేశాను. ఫస్ట్ సినిమాగా బస్‌స్టాప్ తీశాను. తర్వాత ఈ రోజుల్లో.. కొత్తజంట, ప్రేమకథా చిత్రమ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, బాబు బంగారం, భలేభలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే...తదితర చిత్రాలు చేశాను. దాదాపుగా అన్ని చిత్రాలు సక్సెస్ అయ్యాయి. భలేభలే మగాడివోయ్, ప్రేమకథా చిత్రమ్ సినిమాలు కమర్షియల్‌గా భారీ కలెక్షన్లు తెచ్చాయి. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపించడంపై... నేను తీయబోయే సినిమా కథ.. ఫస్ట్ నాలో ఉన్న ఆడియన్ను సంతృప్తి పరిస్తేనే సినిమా తీస్తాను. నేను తీసిన ఒక్కో సినిమా ద్వారా నేను కూడా ఎదుగుతున్నాననే భావన నాలో కలగాలనేలా సినిమా చేస్తాను. మంచి కిక్ ఇచ్చే సబ్జెక్టుల కోసం ట్రై చేస్తుంటాను. అందుకే సినిమా సినిమాకు వైవిధ్యం కనిపించేలా జాగ్రత్త తీసుకుంటాను. ప్రేమ కథా చిత్రమ్‌తో హర్రర్ కామెడీ.. తాతామనమడు అనుబంధంతో ప్రతి రోజూ పండుగే.. మతిమరుపు లవ్‌స్టోరీగా భలేభలేమగాడివోయ్.. కామెడీ యూత్ లవ్ స్టోరీలుగా ఈరోజుల్లో, బస్‌స్టాప్.. కామెడీ పోలీస్‌గా బాబు బంగారం తదితర సినిమాలు తీశాను. ప్రేక్షక దేవుళ్లకు ‘మారుతి’ సినిమా అంటే గుర్తుపట్టే స్థాయికి చేరడం నిజంగా సంతృప్తిగా ఉంది. బాలీవుడ్లో కూడా అడుగుపెడుతున్నారని తెలిసింది.. కరోనా కారణంగా ఈ విషయంలో కాస్త జాప్యం జరిగింది. వాస్తవానికి నా సినిమాలు భలేభలేమగాడివోయ్, ప్రతిరోజూ పండుగే...చిత్రాలను హిందీలో రీమేక్ చేయడానికి అడుగుతున్నారు. నటీనటులను ఎంపిక చేసి త్వరలోనే డైరక్ట్ చేస్తాను.. ఇటీవల బ్లాక్‌బ్లస్టర్ అయిన మన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అయి పెద్ద సక్సెస్ అయి టాలీవుడ్ పవరేంటో చూపించాయి. మహానుభావుడు సినిమాలో చేతుల ‘నీట్నెస్’ కాన్సెప్ట్.. కరోనా టైంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది కదా.. అనుకోకుండా అలా మ్యాచ్ అయ్యింది. 2017లో రిలీజ్ అయిన మహానుభావుడు సినిమాలో హీరో శర్వానంద్ క్యారక్టర్ అంతా నీట్నెస్, శానిటైజర్లు వినియోగం, పరిసరాలన్నీ హైజనిక్‌గా ఉండే కాన్సెప్ట్‌ను చూపించాను. అనుకోకుండా కరోనా వైరస్ నివారణలో భాగంగా మనమంతా శానిటైజర్లను వినియోగించాం. ఇదంతా..యాదృచ్ఛికమే. ఆదిత్యుని దర్శనంపై..? ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు ఇక్కడే కొలువవ్వడం ఇక్కడివాళ్ల అదృష్టం. ఏ రంగంలోనైనా ఆటుపోటులు ఎదురైతే..అరసవల్లి రావడం పరిపాటిగా మారింది. ఎప్పటినుంచో అనుకున్నాను..అందుకే ఇక్కడ కుటుంబసమేతంగా అరుణహోమాన్ని జరిపించుకుని స్వామికి మొక్కు చెల్లించుకున్నాను. సినిమా దర్శకుడు కాకముందు ఒకసారి ఇక్కడికి వచ్చాను. ఆరోగ్య అద్భుత క్షేత్రంగా అరసవల్లి అభివృద్ధి చెందుతోంది. -
పక్కా కమర్షియల్
పక్కా కమర్షియల్ అనే మాటను సినిమాల్లో తరచూ వింటూనే ఉంటాం. అంటే.. సినిమా పక్కా కమర్షియల్ అని అర్థం. తాజాగా ఇదే టైటిల్‌ను ఫిక్స్ చేసుకున్నారట మారుతి. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకు ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్‌ను నిర్ణయించారట. గీతా ఆర్ట్స్ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మించనుందని సమాచారం. మారుతి సినిమాల్లో హీరోలకు ఓ ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ విధంగా తాజా సినిమాలో హీరో పక్కా కమర్షియల్ మైండ్ సెట్ ఉన్నవాడని కూడా ఊహించవచ్చు. -
పవర్ఫుల్ రోల్
‘అందాలరాక్షసి’ (2012) సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చారు ఉత్తరాది భామ లావణ్యా త్రిపాఠి. ఈ ఏడాది లావణ్య ఓటీటీలోకి ఆరంగేట్రం చేస్తున్నారని సమాచారం. కరోనా వల్ల థియేటర్లు మూతపడిన కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఆదరణ పెరిగింది. అందుకే రమ్యకృష్ణ, ప్రియమణి, సమంత, నిత్యామీనన్ వంటి స్టార్స్ సైతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు లావణ్యా త్రిపాఠి ఈ జాబితాలో చేరబోతున్నారు. లావణ్య కెరీర్లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ఒక చిత్రం ‘భలే భలే మగాడిబోయ్’. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందన్ను వెబ్ సిరీస్‌లోనే లావణ్యా త్రిపాఠి నటించనున్నారని తెలిసింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ వెబ్ సిరీస్‌లో ప్రస్తావిస్తారని టాక్. ఇందులో లావణ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తికేయ హీరోగా రూపొందుతున్న ఓ చిత్రంతో పాటు మరో చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు లావణ్యా త్రిపాఠి. -
ప్రతిరోజూ పండగే అందరి విజయం
‘‘మారుతి ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కథని నాకు చెప్పినప్పుడు యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ లేవు కదా? అన్నాను. కానీ మారుతి నమ్మకంగా ఉన్నాడు. షూటింగ్ పూర్తయ్యాక సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూ ఉన్నాం. థియేటర్స్‌లో ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను పెద్ద హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ఏడాది చివర్లో సాయితేజ్ సక్సెస్ కొట్టాడు. ఈ విజయం అందరిదీ’’ అని అల్లు అరవింద్ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రతిరోజూ పండగ సంబరాలు’ కార్యక్రమంలో పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడే విజ యాన్ని ఉహించాను. విదేశాలకు వెళ్లిన తర్వాత మనుషుల మధ్య ప్రేమ, అభిమానాలు తగ్గాయి. ఈ పాయింట్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు’’ అన్నారు. ‘‘ఒక తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని చూపించాలనుకున్నా. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు’’ అన్నారు మారుతి. ‘‘ప్రతిరోజూ పండగే’ సినిమాని సపోర్ట్ చేసున్న వారికి ధన్యవాదాలు. ఈ సక్సెస్‌ను మెగా అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు అంకితమిస్తున్నా’’ అన్నారు సాయితేజ్. ‘‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన అరవింద్, వాసుగార్లకు థ్యాంక్స్’’ అన్నారు తమన్. -
ఆ ముద్ర పడకుండా చూసుకుంటున్నా
‘‘సీరియస్ విషయాన్ని కూడా ఎక్కువ సీరియస్‌గా తీసుకోను నేను. అది నా మనస్తత్వం. ఏదైనా విషయం చెప్పాలన్నా ఎంటర్టైనింగ్గానే చెబుతాను. నా సినిమాలో కథలను కూడా అలానే చెప్పాలనుకుంటాను’’ అన్నారు దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వంలో సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాస్ నిర్మించారు. గత శుక్రవారం ఈ చిత్రం విడుదలయింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి పంచుకున్న విశేషాలు. ► ‘ప్రతిరోజూ పండగే’ కథను ఎవరికి చెప్పినా బావుంది అన్నారు. 65 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం. సినిమా రిలీజ్ ముందు కూడా పెద్ద టెన్షన్ పడలేదు. ఎందుకంటే.. ఎమోషన్స్‌తో ఓ కథను సరిగ్గా చెప్పగలిగితే ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాతో అది మళ్లీ నిరూపితం అయింది. ► థియేటర్స్‌లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎమోషన్ కంటే కామెడీ టైమింగ్ ఏమైనా డామినేట్ అయిందా? అనే డౌట్ వచ్చింది. ‘భలే భలే మగాడివోయి’ సినిమా తర్వాత ఇన్ని ఫోన్ కాల్స్ రావడం ఇదే. ‘చాలా హెల్దీగా చేశావు’ అని చిరంజీవిగారు అభినందించారు. ‘చాలా బాగా డీల్ చేశావు’ అని రాఘవేంద్రరావుగారు అన్నారు. ఇండస్ట్రీ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ► రావు రమేశ్‌గారు పాత్ర బాగా వచ్చింది అని అందరూ అంటున్నారు. ఆయన యాక్ట్ చేస్తుంటే మేమందరం ఎగ్జయిట్ అయ్యాం. ► మారుతి ఒక జానర్ సినిమాలే తీయగలడు అని ముద్ర వేయించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే సినిమా సినిమాకు జానర్ మారుస్తుంటాను. ఒకేలాంటి సినిమాలు తీస్తే నాకు నేనే బోర్ కొట్టేస్తాను. ► ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. బెస్ట్ కథలే ఇవ్వాలి. వెబ్ సిరీస్‌లు కూడా వస్తున్నాయి. అవే ఫ్యూచర్. నేనూ వెబ్ సిరీస్ చేస్తాను. నెట్‌ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’కి అడిగారు. కానీ కుదర్లేదు. -
పరమానందయ్య శిష్యులు
పింక్ రోజ్ సినిమాస్ పతాకంపై కాటంరెడ్డి సంతన్‌రెడ్డి, సిహెచ్ కిరణ్‌శర్మ నిర్మాతలుగా వెంకట రాజేశ్ పులి దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్రీ పరమానందయ్య శిష్యుల కథ’. ఈ త్రీడీ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు మారుతి విడుదల చేశారు. అనంతరం మారుతి మాట్లాడుతూ– ‘‘చిన్నారుల కోసం ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని తీసిన చిత్రం ‘పరమానందయ్య శిష్యుల కథ’. ఈ చిత్రాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసిన చిత్రబృందానికి కృతజ్ఞతలు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరు కుంటున్నాను’’ అన్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పరమానందయ్య కథలోని నీతిని చిన్నారులకు మరింతగా చేరవేయటం కోసం ఈ చిత్రాన్ని త్రీడీ చేశాం. అన్ని వర్గాల వారినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: యాజమాన్య. -
అమెరికాలో పండగ
‘సుప్రీమ్’ వంటి హిట్ చిత్రం తర్వాత సాయితేజ్–రాశీఖన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘ప్రతిరోజు పండగే’. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్ని’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ తర్వాతి షెడ్యూల్‌ని అమెరికాలో చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సాయితేజ్‌ను కొత్తగా చూపించబోతున్నారు మారుతి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కుటుంబ బంధాల్ని, విలువల్ని భావోద్వేగంగా చిత్రీకరిస్తున్నారు. మారుతి చిత్రాల్లో సహజంగా కనిపించే ఎంటర్టైన్మెంట్ ఇందులో రెండు రెట్లు ఎక్కువగానే ఉంటుంది. సాయితేజ్, నటుడు సత్యరాజ్ ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన స్పందన లభించింది. సత్యరాజ్ క్యారెక్టర్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు మారుతి. రావు రమేశ్ పాత్ర కూడా సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మా హీరో సాయి తేజ్‌కి జన్మదిన శుభాకాంక్షలు’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్.కె.ఎన్, సంగీతం: తమన్, కెమెరా: జయకుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు. -
కొబ్బరి మట్టకు ఐదేళ్లు పట్టలేదు
‘‘ఒక వ్యక్తికి సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉంటుందో సాయి రాజేష్‌ని చూసి తెలుసుకోవచ్చు. మట్టి నుండి తెచ్చిన వినాయకుడి విగ్రహాన్ని మనం పూజిస్తామో.. అలా మట్టిలో నుంచి సంపూని తెచ్చి ఒక స్టార్‌ని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. సంపూ ఎంత పెద్ద నటుడు అనేది ఆల్రెడీ ప్రూవ్ అయింది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సంపూర్ణేష్ బాబు హీరోగా రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొబ్బరిమట్ట’. సాయి రాజేష్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నిర్మాత ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ– ‘‘సంపూర్ణేష్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూశాక మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథ అనిపించింది. అందుకే ఉదయం 8:45 గంటల ఆటకి టికెట్ బుక్ చేసుకున్నాను’’ అన్నారు. ‘‘జంధ్యాల, ఈవీవీగార్ల వినోదం తర్వాత సాయిరాజేశ్ కామెడీ నాకు నచ్చుతుంది. రాజేష్, సంపూగారివల్లే ఈ సినిమా చేశాను’’ అన్నారు రూపక్ రొనాల్డ్ సన్. ‘‘ఈ సినిమా కోసం నేను, సంపు, రూపక్.. మా కెరీర్లను వదులుకుని మరీ చేశాం. ‘కొబ్బరిమట్ట’ ఐదేళ్లు చేశామని అంటున్నారు, కానీ మేం షూటింగ్ చేసింది 39 రోజులు మాత్రమే’’ అన్నారు సాయి రాజేశ్. ‘‘నిజాయతీతో సినిమా చేసిన టీమ్ ఇది. తప్పకుండా సినిమా చూడండి’’ అన్నారు హీరో సందీప్ కిషన్. ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు నటి షకీలా. సంపూర్ణేశ్ బాబు, నటులు శివ బాలాజీ, సమీర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి రోజూ పండగే!
‘చిత్రలహరి’ సినిమాతో ఓ డీసెంట్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నారు సాయిధరమ్ తేజ్. ఇప్పుడు ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కథనంపై దృష్టిపెట్టారాయన. మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రాశీఖన్నా కథానాయికగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘ప్రతి రోజూ పండగే’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరుగుతుందని తెలిసింది. రెగ్యులర్ షూటింగ్‌ని 27న మొదలుపెట్టనున్నారట. ఇంకో విశేషం ఏంటంటే.. తమిళ నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించనున్నారని తెలిసింది. -
టీజర్ చూస్తే క్వాలిటీ తెలుస్తోంది
‘‘మంచు కురిసే వేళలో’ సినిమా టీజర్ చాలా బాగుంది. మనసుని హత్తుకునే చక్కటి సంగీతం కూడా ఉంది. ఫొటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మంచి ఔట్‌డోర్ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. టీజర్ చూస్తే సినిమా క్వాలిటీ తెలుస్తోంది. రామ్ కార్తీక్ చాలా అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాలి’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. రామ్ కార్తీక్, ప్రనాలి జంటగా ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘మంచు కురిసే వేళలో’. ఈ సినిమా టీజర్‌ను మారుతి విడుదల చేశారు. దర్శక–నిర్మాత బాల మాట్లాడుతూ– ‘‘అందమైన కథ, కథనాలతో తీసిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్లో ఇదొక ఉత్తమ చిత్రమవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెలలో ఆడియో, డిసెంబర్లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, కెమెరా: తిరుజ్ఞాన, ప్రవీణ్ కుమార్ పంగులూరి. -
సినిమా తీయడం ఈజీ..రిలీజ్ కష్టం
‘‘మా బ్యానర్లో విడుదల చేసిన ‘భలేమంచి చౌకబేరమ్’ చిన్న సినిమా అయినా ప్రేక్షకాదరణ బాగుంది. కథ బాగుండటం వల్లే సినిమాను బాగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వసూళ్లు ఇంకా పెరిగి, మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అని చిత్ర సమర్పకులు కె.కె. రాధామోహన్ అన్నారు. నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ కీలక పాత్రల్లో మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’. ఆరోళ్ల సతీష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం తేలిక.. కానీ, విడుదల కష్టం. మౌత్ టాక్‌తో రీచ్ అయ్యేలా చేయడం చాలా కష్టం. శనివారం సాయంత్రానికి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా టార్గెట్‌ని రీచ్ అయ్యాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మురళీకృష్ణ. ‘‘టిక్కెట్టుకి 100 రూపాయలు పెడితే 1000 రూపాయల వినోదం ఇచ్చే చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’’ అన్నారు నవీద్. ‘‘సినిమా విడుదల రోజు(శుక్రవారం) ఉదయం ఆటకు మా సినిమా ఓపెనింగ్స్ చూసి నిరుత్సాహపడ్డాం. అదేరోజు సాయంత్రానికి థియేటర్లు ఫుల్ అయ్యాయి’’ అన్నారు నూకరాజు. ‘‘టఫ్ సిచ్యువేషన్లో కాన్ఫిడెన్స్‌తో మా సినిమా విడుదల చేశాం. టాక్ బావుంది’’ అన్నారు సతీష్. యామినీ భాస్కర్, నటులు రాజా రవీంద్ర, ముస్తఫా, ఉద్ధవ్, పూర్ణాచారి పాల్గొన్నారు. -
పక్కా కమర్షియల్ చిత్రమిది
‘‘భలే మంచి చౌక బేరమ్’ చిన్న సినిమా. చిన్న సినిమాల కాన్సెప్ట్‌లు చాలా బాగుంటాయి. కానీ, ప్రేక్షకులు థియేటర్‌కి రారు. సినిమాలు చూడాలంటే అందులో ఏదో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. ఈ చిత్రంలో అలాంటి వైవిధ్యమైన పాయింట్ ఉంటుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు హీరోలుగా, యామినీ భాస్కర్ హీరోయిన్గా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన మారుతి చెప్పిన విశేషాలు. ► కృష్ణానగర్‌లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్స్కి దేశ రహస్యాలకు సంబంధించిన ఒక కవర్ దొరుకుతుంది. వాళ్లు దాన్ని ఎలా బేరం ఆడారు? అనేది ‘భలే మంచి చౌక బేరమ్’ మెయిన్ కాన్సెప్ట్. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ► ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. నేను చెప్పిన ఐడియాకి రవి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి డైలాగ్స్ రాశారు. ‘రోజులు మారాయి’ టీమ్ సెట్ అయ్యింది. కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఉంటుంది. సెకండాఫ్ సీరియస్‌గా, కన్ఫ్యూజన్ కామెడీతో ఉండే పక్కా కమర్షియల్ చిత్రమిది. ► కె.కె. రాధామోహన్‌గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. మా సినిమా ఫస్ట్‌కాపీ చూసి, బాగా ఇంప్రెస్ అయిన ఆయన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ► ఇకపై పెద్ద చిత్రాలపైనే శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం చిన్న చిత్రాలు చేయదల్చుకోలేదు. నా సైకిల్ ప్రయాణం స్మూత్‌గా సాగుతోంది. నా తర్వాతి చిత్రం ‘భలే భలే మగాడివోయ్’లా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. -
చిన్న సినిమాల వల్లే ఈ స్థాయిలో ఉన్నా
‘‘చిన్న సినిమా అంటే పూర్తి రిస్క్ ఉంటుంది. ఆ చిన్న సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే దాన్ని వదులుకోవడం లేదు. చిన్న ఆలోచన నుంచి వచ్చిన కథ ‘భలే మంచి చౌక బేరమ్’. ఇది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్తబా అలీఖాన్ ముఖ్య తారలుగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్లను నటులు పృథ్వీ, సప్తగిరి విడుదల చేయగా, బిగ్ సీడీని డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేస్తూ, ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. టీమ్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘మా అరోళ్ళ గ్రూప్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ ఇచ్చిన మారుతిగారికి ధన్యవాదాలు. ఈ సినిమా రిలీజ్‌కి రాధామోహన్‌గారు ఆక్సిజన్‌లాగా పని చేశారు’’ అన్నారు సతీష్‌కుమార్. ‘‘భలే మంచి చౌక బేరమ్’ సినిమాను రెండు సార్లు చూశా. కాన్సెప్ట్ నచ్చింది. ఈ సినిమా మొత్తం తయారు చేసి, సిల్వర్ ప్లేట్లో పెట్టి నా చేతికిచ్చి రిలీజ్ చేయమన్నారు. అంతకన్నా చౌకబేరమ్ దొరకదు. ఇదే నాకు ‘భలే మంచి చౌక బేరమ్’’ అన్నారు కేకే రాధామోహన్. ‘‘రవి, లక్కీ ఇద్దరూ నాకు చెరో చేయిలాంటివారు. నేను దర్శకత్వం వహించిన ‘రోజులు మారాయి’ చూసిన మారుతిగారు నమ్మి, ఈ సినిమా కథ ఇచ్చారు’’ అన్నారు మురళీకృష్ణ. సంగీత దర్శకుడు జేబీ, పాటల రచయిత పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. -
మారుతి దర్శకత్వంలో రాధాగా...
వెంకటేష్ హోంమినిస్టరట. నయనతారేమో మధ్యతరగతి అమ్మాయట. మరి వీరిద్దరికీ ప్రేమెలా కుదిరిందట? అది మారుతినే అడగాలి. ఎందుకంటే... వెంకటేష్, నయనతారతో మారుతి తీయబోతున్న ‘రాధా’ సినిమా కథ చూచాయగా ఇదే. యువతరం నాడిని బాగా పట్టేసిన దర్శకుడు మారుతి. ఈ దఫా పెద్దాళ్లని కూడా బుట్టలో వేసుకునే పనిలో ఉన్నాడని ‘రాధా’ లైన్ వింటే అవగతమవుతోంది. జనవరి 16న పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఫిబ్రవరి నెలాఖరున షూటింగ్ మొదలుపెడతామని నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ -‘‘గత ఏడాది వచ్చిన ‘నాయక్’ తర్వాత మేం నిర్మించనున్న సినిమా ఇది. మారుతి చెప్పిన కథ నచ్చి, వెంకటేష్‌గారికి చెప్పించాం. ఆయన సింగిల్ సిట్టింగ్‌లో ఈ కథను ఓకే చేశారు. ఇక నయనతార అయితే... ఆరగంట కథ విని, ఈ సినిమా నేను చేస్తున్నానని నవ్వుతూ మాకు డేట్స్ ఇచ్చారు. ఇద్దరు టాప్స్టార్లను సింగిల్ సిట్టింగ్‌లో ఒప్పించిన కథ ఇది. వెంకటేష్, నయనతార స్థాయికి తగ్గట్టుగా ఈ ప్రేమకథ ఉంటుంది. మారుతి సంభాషణలు కొత్త పుంతలు తొక్కుతాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ప్రసాద్, సంగీతం: జె.బి., కూర్పు: ఉద్ధవ్, సమర్పణ: డి.పార్వతి.