పవర్‌ఫుల్‌ రోల్‌ | Lavanya tripathi entry In to web series | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ రోల్‌

Published Tue, Oct 6 2020 12:47 AM | Last Updated on Tue, Oct 6 2020 12:47 AM

Lavanya tripathi entry In to web series - Sakshi

లావణ్యా త్రిపాఠి

‘అందాలరాక్షసి’ (2012) సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇచ్చారు ఉత్తరాది భామ  లావణ్యా త్రిపాఠి. ఈ ఏడాది లావణ్య ఓటీటీలోకి ఆరంగేట్రం చేస్తున్నారని సమాచారం. కరోనా వల్ల థియేటర్లు మూతపడిన కారణంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఆదరణ పెరిగింది. అందుకే రమ్యకృష్ణ, ప్రియమణి, సమంత, నిత్యామీనన్‌ వంటి స్టార్స్‌ సైతం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌వైపు మొగ్గుచూపారు. ఇప్పుడు లావణ్యా త్రిపాఠి ఈ జాబితాలో చేరబోతున్నారు. లావణ్య కెరీర్‌లో ఘనవిజయం సాధించిన చిత్రాల్లో ఒక చిత్రం ‘భలే భలే మగాడిబోయ్‌’. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు మారుతి  దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందన్ను వెబ్‌ సిరీస్‌లోనే లావణ్యా త్రిపాఠి నటించనున్నారని తెలిసింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రస్తావిస్తారని టాక్‌. ఇందులో లావణ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తికేయ హీరోగా రూపొందుతున్న ఓ చిత్రంతో పాటు మరో చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు లావణ్యా త్రిపాఠి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement