లావణ్యా త్రిపాఠి, అభిజీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘న్యూ ఇయర్‌ను పర్ఫెక్ట్‌గా మొదలు పెట్టబోతున్నాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు లావణ్యా త్రిపాఠి.
‘‘ప్రతి పనిని పర్ఫెక్ట్‌గా చేసే మిస్టర్ పర్ఫెక్ట్‌ల గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ మిస్ పర్ఫెక్ట్‌గా ఓ అమ్మాయి ఎంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుంది? ఎలా పని చేయిస్తుంది? అనే అంశాలను హిలేరియస్‌గా ఈ వెబ్ సిరీస్‌లో చూపించబోతున్నాం’’ అన్నారు విశ్వక్ ఖండేరావ్. ‘‘అనుకోకుండా ఏర్పరచుకునే కొన్ని అనుబంధాలు మన జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అనే ప్రేమకథతో ‘మిస్ పర్ఫెక్ట్’ని రూపొందించాం’’ అన్నారు సుప్రియ యార్లగడ్డ. ఈ సిరీస్‌కు సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: ఆదిత్య జవ్వాదా.
Comments
Please login to add a commentAdd a comment