మెగా కోడలు కొత్త వెబ్‌సిరీస్.. హీరోగా 'బిగ్‌బాస్' విన్నర్ | Lavanya Tripathi Miss Perfect Series First Look And Release Details | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య ఫస్ట్ వెబ్ సిరీస్.. త్వరలో స్ట్రీమింగ్

Jan 3 2024 12:57 PM | Updated on Jan 3 2024 1:43 PM

Lavanya Tripathi Miss Perfect Series First Look And Release Details - Sakshi

మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. మళ్లీ రంగంలోకి దూకేసింది. నవంబరులో మెగాహీరో వరుణ్ తేజ్‌ని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ..  హనీమూన్, భర్తతో టైమ్ స్పెండ్ చేయడం కోసం కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైపోయింది. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, ఇతర డీటైల్స్ త్వరలో వెల్లడించబోతున్నట్లు ప్రకటించారు.

ఇంతకీ ఏ సిరీస్?
'అందాల రాక్షసి' మూవీతో హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన లావణ‍్య త్రిపాఠి.. మిడ్ రేంజ్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. అయితే 2016లో 'మిస్టర్' షూటింగ్ టైంలో మెగాహీరో వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడింది. అప్పటినుంచి 2023 జూన్ వరకు తమ బంధాన్ని రహస్యంగా ఉంచారు. ఎంగేజ్‌మెంట్‌తో తమ రిలేషన్‌ని అఫీషియల్ చేశారు. నవంబరు 1న ఇటలీలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?)

ఇదే చివరి సిరీస్?
2022లో 'హ్యాపీ బర్త్ డే' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసిన లావణ్య త్రిపాఠి.. గతేడాది ఒక్క మూవీలో నటించలేదు. కాకపోతే 'పులిమేక' అనే వెబ్ సిరీస్‌లో నటించింది. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు 'మిస్ ఫెర్ఫెక్ట్' సిరీస్‌లో ఈమెదే మెయిన్ లీడ్ అని తెలిసింది. తాజాగా ఫస్ట్ లుక్ బట్టి చూస్తే బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్.. లావణ్యకు జోడీగా నటించనున్నాడు. 

అయితే లావణ్య త్రిపాఠి చేతిలో ప్రస్తుతం 'మిస్ ఫెర్ఫెక్ట్' సిరీస్‌తో పాటు 'తనల్' అనే తమిళ మూవీ మాత్రమే ఉంది. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోవట్లేదు. అంటే ఈ రెండు చేసిన తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేస్తుందా అని డౌట్ వస్తుంది. లావణ్య కొత్త సినిమాలు చేసిన దానిబట్టి దీనిపై  క్లారిటీ వచ్చేస్తుంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement