నూకరాజు, మురళీకృష్ణ, యామిని, వంశీ, వినాయక్, సతీష్‌కుమార్, రాజా రవీంద్ర. మారుతి, రాధామోహన్
‘‘చిన్న సినిమా అంటే పూర్తి రిస్క్ ఉంటుంది. ఆ చిన్న సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే దాన్ని వదులుకోవడం లేదు. చిన్న ఆలోచన నుంచి వచ్చిన కథ ‘భలే మంచి చౌక బేరమ్’. ఇది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్‌తబా అలీఖాన్ ముఖ్య తారలుగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’.
కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్లను నటులు పృథ్వీ, సప్తగిరి విడుదల చేయగా, బిగ్ సీడీని డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేస్తూ, ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. టీమ్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘మా అరోళ్ళ గ్రూప్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ ఇచ్చిన మారుతిగారికి ధన్యవాదాలు. ఈ సినిమా రిలీజ్‌కి రాధామోహన్‌గారు ఆక్సిజన్‌లాగా పని చేశారు’’ అన్నారు సతీష్‌కుమార్.
‘‘భలే మంచి చౌక బేరమ్’ సినిమాను రెండు సార్లు చూశా. కాన్సెప్ట్ నచ్చింది. ఈ సినిమా మొత్తం తయారు చేసి, సిల్వర్ ప్లేట్‌లో పెట్టి నా చేతికిచ్చి రిలీజ్ చేయమన్నారు. అంతకన్నా చౌకబేరమ్ దొరకదు. ఇదే నాకు ‘భలే మంచి చౌక బేరమ్’’ అన్నారు కేకే రాధామోహన్. ‘‘రవి, లక్కీ ఇద్దరూ నాకు చెరో చేయిలాంటివారు. నేను దర్శకత్వం వహించిన ‘రోజులు మారాయి’ చూసిన మారుతిగారు నమ్మి, ఈ సినిమా కథ ఇచ్చారు’’ అన్నారు మురళీకృష్ణ. సంగీత దర్శకుడు జేబీ, పాటల రచయిత పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment