nukaraju
-
జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు
పటాస్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నూకరాజు. తర్వాత జబర్దస్త్ షోలో భాగమయ్యాడు. టీమ్‌లో ఒకరి కింద పని చేసే స్థాయినుంచి టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అతడి ప్రేయసి ఆసియాతో కలిసి కామెడీ షోలో పంచులు పేలుస్తూ ఉంటాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న నూకరాజు, ఆసియా కొంతకాలంగా కలిసి కనిపించడం లేదు. దీంతో ఈ లవ్ బర్డ్స్‌కు ఏమైంది? వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారా? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆసియాకు, నాకు గొడవలు తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు నూకరాజు. అతడు మాట్లాడుతూ.. 'ప్రేమలో గొడవలు, అలకలు, బుజ్జగింపులు సహజమే! అలా ఆసియాకు, నాకు మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయి. తను నాపై అలిగింది. వంద శాతం తప్పు నాదే! మేమిద్దరం మాట్లాడుకోలేదు. అయితే తప్పు ఎవరిదైనా ఆసియానే స్వయంగా వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటుంది. నాపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఇగో వల్ల.. మొన్న నేను దుబాయ్ వెళ్లాను. ఐదురోజుల తర్వాత తిరిగొచ్చాను. అలా మా మధ్య మాట్లాడుకునే తీరిక కూడా లేకుండా పోయింది. తను ఫస్ట్ మాట్లాడాలని ఎదురుచూశాను. నాకు కాల్ చేసి ఉండొచ్చేమో కానీ దుబాయ్‌లో ఉండటం వల్ల నా లైన్ కలిసి ఉండకపోవచ్చు. ఇగోతో ఆమెకు బర్త్‌డే విషెస్ కూడా చెప్పలేదు. అయినా తనే తర్వాత మెసేజ్ చేసింది. తనే ఫస్ట మెసేజ్ విషెస్ చెప్పనందుకు నా మీద కోపం లేదా? అంటే బాధ మాత్రమే ఉందని చెప్పింది. చిన్న చిన్న ఇగోతో ప్రేమను దూరం చేసుకోకండి. తప్పు ఎవరు చేసినా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్తుంది. తనను ఎంత బాధపెట్టానో అంతే హ్యాపీగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. తనకు ఆలస్యంగానైనా సరే బర్త్‌డే సర్ప్రైజ్ ఇస్తాను' అని నూకరాజు చెప్పుకొచ్చాడు. తమ బంధం ముక్కలు కాలేదని క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఓటింగ్ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన విజయ్ సేతుపతి -
సలహా బోర్డు అనుమతిస్తే.. 3 నెలలకుపైగా నిర్బంధించొచ్చు
న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధానికి సరైన కారణం ఉందని అడ్వైజరీ బోర్డు అభిప్రాయపడిన సందర్భాల్లో.. ‘ 3 నెలలకు మించి ముందస్తు నిర్బంధంలో ఉంచరాదు’ అనే నిబంధన వర్తించబోదని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. గత ఏడాది ఆగస్టులో తనను అరెస్ట్‌చేశారని, కాకినాడ జిల్లా మేజి్రస్టేట్ ఇచ్చిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వు చెల్లదంటూ పెసల నూకరాజు అనే వ్యక్తి ఆంధ్రపదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయగా దానిని హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆయనకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. ‘ ముందుస్తు నిర్బంధం సహేతుకమని అడ్వైజరీ బోర్డు భావిస్తే మూడునెలలకు మించి కూడా సంబంధిత వ్యక్తులను నిర్బంధంలో కొనసాగించవచ్చు. నిర్బంధం మూడు నెలలకు మించకూడదనే నిబంధన ఇలాంటి సందర్భాల్లో వర్తించదు’ అని కోర్టు తీర్పు చెప్పింది. ‘కింది కోర్టు ఉత్తర్వుల్లో ఇంతకాలం నిర్బంధించండి అని పేర్కొంటే అంత కాలానికే నిర్బంధంలో ఉంచుతారు. ఒకవేళ కాలావధిని కోర్టు పేర్కొనకపోతే ఆ వ్యక్తిని గరిష్టకాలం(12 నెలలు) నిర్బంధంలో ఉంచుతారు. నిర్బంధ ఉత్తర్వులొచ్చాక ప్రతీ మూడు నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వును సమీక్షించాల్సిన అవసరంలేదు’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
సినిమా తీయడం ఈజీ..రిలీజ్ కష్టం
‘‘మా బ్యానర్లో విడుదల చేసిన ‘భలేమంచి చౌకబేరమ్’ చిన్న సినిమా అయినా ప్రేక్షకాదరణ బాగుంది. కథ బాగుండటం వల్లే సినిమాను బాగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వసూళ్లు ఇంకా పెరిగి, మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అని చిత్ర సమర్పకులు కె.కె. రాధామోహన్ అన్నారు. నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ కీలక పాత్రల్లో మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’. ఆరోళ్ల సతీష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం తేలిక.. కానీ, విడుదల కష్టం. మౌత్ టాక్‌తో రీచ్ అయ్యేలా చేయడం చాలా కష్టం. శనివారం సాయంత్రానికి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా టార్గెట్‌ని రీచ్ అయ్యాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మురళీకృష్ణ. ‘‘టిక్కెట్టుకి 100 రూపాయలు పెడితే 1000 రూపాయల వినోదం ఇచ్చే చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’’ అన్నారు నవీద్. ‘‘సినిమా విడుదల రోజు(శుక్రవారం) ఉదయం ఆటకు మా సినిమా ఓపెనింగ్స్ చూసి నిరుత్సాహపడ్డాం. అదేరోజు సాయంత్రానికి థియేటర్లు ఫుల్ అయ్యాయి’’ అన్నారు నూకరాజు. ‘‘టఫ్ సిచ్యువేషన్లో కాన్ఫిడెన్స్‌తో మా సినిమా విడుదల చేశాం. టాక్ బావుంది’’ అన్నారు సతీష్. యామినీ భాస్కర్, నటులు రాజా రవీంద్ర, ముస్తఫా, ఉద్ధవ్, పూర్ణాచారి పాల్గొన్నారు. -
పక్కా కమర్షియల్ చిత్రమిది
‘‘భలే మంచి చౌక బేరమ్’ చిన్న సినిమా. చిన్న సినిమాల కాన్సెప్ట్‌లు చాలా బాగుంటాయి. కానీ, ప్రేక్షకులు థియేటర్‌కి రారు. సినిమాలు చూడాలంటే అందులో ఏదో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. ఈ చిత్రంలో అలాంటి వైవిధ్యమైన పాయింట్ ఉంటుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు హీరోలుగా, యామినీ భాస్కర్ హీరోయిన్గా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన మారుతి చెప్పిన విశేషాలు. ► కృష్ణానగర్‌లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్స్కి దేశ రహస్యాలకు సంబంధించిన ఒక కవర్ దొరుకుతుంది. వాళ్లు దాన్ని ఎలా బేరం ఆడారు? అనేది ‘భలే మంచి చౌక బేరమ్’ మెయిన్ కాన్సెప్ట్. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ► ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. నేను చెప్పిన ఐడియాకి రవి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి డైలాగ్స్ రాశారు. ‘రోజులు మారాయి’ టీమ్ సెట్ అయ్యింది. కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఉంటుంది. సెకండాఫ్ సీరియస్‌గా, కన్ఫ్యూజన్ కామెడీతో ఉండే పక్కా కమర్షియల్ చిత్రమిది. ► కె.కె. రాధామోహన్‌గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. మా సినిమా ఫస్ట్‌కాపీ చూసి, బాగా ఇంప్రెస్ అయిన ఆయన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ► ఇకపై పెద్ద చిత్రాలపైనే శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం చిన్న చిత్రాలు చేయదల్చుకోలేదు. నా సైకిల్ ప్రయాణం స్మూత్‌గా సాగుతోంది. నా తర్వాతి చిత్రం ‘భలే భలే మగాడివోయ్’లా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. -
చిన్న సినిమాల వల్లే ఈ స్థాయిలో ఉన్నా
‘‘చిన్న సినిమా అంటే పూర్తి రిస్క్ ఉంటుంది. ఆ చిన్న సినిమాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అందుకే దాన్ని వదులుకోవడం లేదు. చిన్న ఆలోచన నుంచి వచ్చిన కథ ‘భలే మంచి చౌక బేరమ్’. ఇది ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. అందరికీ నచ్చుతుంది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్తబా అలీఖాన్ ముఖ్య తారలుగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్లను నటులు పృథ్వీ, సప్తగిరి విడుదల చేయగా, బిగ్ సీడీని డైరెక్టర్ వీవీ వినాయక్ రిలీజ్ చేస్తూ, ‘‘ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. టీమ్‌కి మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘మా అరోళ్ళ గ్రూప్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఈ కాన్సెప్ట్ ఇచ్చిన మారుతిగారికి ధన్యవాదాలు. ఈ సినిమా రిలీజ్‌కి రాధామోహన్‌గారు ఆక్సిజన్‌లాగా పని చేశారు’’ అన్నారు సతీష్‌కుమార్. ‘‘భలే మంచి చౌక బేరమ్’ సినిమాను రెండు సార్లు చూశా. కాన్సెప్ట్ నచ్చింది. ఈ సినిమా మొత్తం తయారు చేసి, సిల్వర్ ప్లేట్లో పెట్టి నా చేతికిచ్చి రిలీజ్ చేయమన్నారు. అంతకన్నా చౌకబేరమ్ దొరకదు. ఇదే నాకు ‘భలే మంచి చౌక బేరమ్’’ అన్నారు కేకే రాధామోహన్. ‘‘రవి, లక్కీ ఇద్దరూ నాకు చెరో చేయిలాంటివారు. నేను దర్శకత్వం వహించిన ‘రోజులు మారాయి’ చూసిన మారుతిగారు నమ్మి, ఈ సినిమా కథ ఇచ్చారు’’ అన్నారు మురళీకృష్ణ. సంగీత దర్శకుడు జేబీ, పాటల రచయిత పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు. -
నేను మీ అమ్మాయినే అండీ
‘‘జీవితం ప్రతి రోజూ ఓ పాఠం నేర్పుతుంది. ఇప్పటివరకు నా సినీ జర్నీలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవడంలో పరిణితిగా ఆలోచిస్తున్నాను. సక్సెస్ నా చేతిలో లేదు. నేను ఒప్పుకున్న సినిమాలో నా క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు యామినీ భాస్కర్. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్ ముఖ్య తారలుగా మురళీ కృష్ణ ముడిదాని దర్శకత్వంలో సతీష్ కుమార్ నిర్మించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను కె.కె. రాధామోహన్ వచ్చే నెల 5న రిలీజ్ చేస్తున్నారు. అలాగే గురువారం యామిని బర్త్‌డేని పురస్కరించుకుని యూనిట్ సభ్యులు బుధవారం ఆమెతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా యామిని చెప్పిన విశేషాలు... ►నన్ను కొంత మంది నార్త్ అమ్మాయి అనుకుంటున్నారట. కానీ నేను పక్కా తెలుగు అమ్మాయిని. మాది విజయవాడ. ‘భలే మంచి చౌక బేరమ్’లో ఎదుటివారి బాధను చూడలేని ఆదర్షి అనే మంచితనం ఉన్న అమ్మాయిగా నటించాను. కానీ నా మంచితనాన్ని వాడుకుని ఈ సినిమాలో నన్ను హీరో మోసం చేస్తాడు. తర్వాత ఏంటీ? అనేది సినిమాలో తెలుస్తుంది. దర్శకుడు మురళీగారు సినిమాను బాగా తీశారు. షూటింగ్ టైమ్‌లో బాగా ఎంజాయ్ చేశాం. కాన్సెప్ట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీగారికి, సినిమాను తొందరగా రిలీజ్ చేస్తున్న రాధామోహన్‌గారికి ధన్యవాదాలు. ►‘నర్తనశాల’ కథ నచ్చే చేశాను. ఒక సినిమా సక్సెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది. నెక్ట్స్ ఏ సినిమా కమిట్ కాలేదు. కథలు వింటున్నాను. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ పెద్ద బ్యానర్లో యాక్ట్ చేయాలని, మంచి కథ కుదరాలని వెయిట్ చేస్తున్నాను. -
భలే మంచి చౌక బేరమ్
‘ఈరోజుల్లో, బస్టాప్, ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు’ వంటి హిట్ చిత్రాలతో దర్శకుడు మారుతి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరచుకున్నారు. ఆయన కథ అందించిన చిత్రాలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఆయన ఇచ్చిన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్, రాజారవీంద్ర, భద్రం, ముజ్తబా అలీఖాన్ ముఖ్య తారలు. మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో అరోళ్ల సతీష్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ‘అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్, పంతం’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ‘భలే మంచి చౌక బేరమ్’ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూశా. చాలా ఎంటర్టైనింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే మా బేనర్లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, నేపథ్య సంగీతం: జె.బి, కెమెరా: బాల్‌రెడ్డి పి, సహ నిర్మాత: గుడ్ సినిమా గ్రూప్. -
దేశ రహస్యం ఎవరి చేతిలో?
దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో ‘రోజులు మారాయి’ ఫేమ్ దర్శకుడు ముడిదాని మురళీ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరం’. నవీద్, నూకరాజు హీరోలుగా యామిని హీరోయిన్గా నటిస్తున్నారు. రాజా రవీంద్ర ముఖ్య పాత్ర చేస్తున్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న మిలటరీ ఆఫీసర్ దేశ రహస్యాల మీద ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ మిస్ ఐతే? అది ఎవరి చేతికైనా చిక్కితే? అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఎరోల్ల గ్రూప్ అదినేత డా. ఎరోల్ల సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ – ‘‘నాకు ఇష్టమైన సతీష్ గారు, శ్రీనివాస్‌తో కలిసి ఈ సినిమా నిర్మించాం. కాన్సెప్ట్ ఎలా చెప్పానో అలానే సినిమాగా మలిచారు మురళి. కథ, మాటలు అందించిన రవి నంబూరికి థ్యాంక్స్. నవీద్, నూకరాజులు బాగా చేశారు’’ అన్నారు. ‘‘మారుతిగారి సినిమా అంటే నా సొంత సినిమాలా భావిస్తాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘మారుతిగారు మంచి కాన్సెప్ట్‌తో నిర్మాతకు నాలుగు రూపాయిలు మిగిలేలా చూస్తారు. తెలుగు టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ముందుంటారు. ఈ సినిమా మంచి హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు యస్.కె.ఎన్. ‘‘రెండో అవకాశం ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్స్. టీమ్ అంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేశాం. నిర్మాత సతీష్‌గారి సహకారంతో సినిమాను చాలా బాగా చేశాం. రవి నంబూరి మాటలు ఎసెట్ అవుతాయి. మా డార్క్ కామెడీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు మురళీ కృష్ణ. ‘‘మారుతి అందించిన కాన్సెప్ట్‌తో మురళి చాలా బాగా తెరకెక్కించాడు. ట్రైలర్ అందరికీ నచ్చింది. సమ్మర్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సతీష్. ‘‘మారుతిగారు కాన్సెప్ట్ ఇవ్వటమే సక్సెస్ కొట్టేశాం. డైరెక్టర్‌గారు ఫుల్ క్లారిటీ తో తెరకెక్కించారు. టైక్నికల్గా హై స్టాండర్డ్‌లో ఉంటుంది’’ అన్నారు నవీద్. ‘‘మంచి పాత్ర ఇచ్చిన మారుతిగారికి, మురళీగారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు నూకరాజు. ఈ సినిమాకు సంగీతం: హరి గౌరా, సహ నిర్మాతలు : పిడమర్తి రవి, రెహమాన్. లైన్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్. -
విశాఖలో వ్యాపారిపై హత్యాయత్నం
విశాఖపట్నం గాజువాకలో వ్యాపారి నూకరాజుపై హత్యాయత్నం జరిగింది. బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న ఆరుగురు దుండగులు జీపులో వచ్చి నడిరోడ్డుపై నూకరాజుపై దాడి చేశారు. ఆయనను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
ఆయనపై ఎందుకంత ప్రేమ?
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ఒకరు కాదు... ఇద్దరు కాదు ఏకంగా బ్లడ్‌బ్యాంక్‌లో పని చేస్తున్న సిబ్బందితో పాటు బ్లడ్ బ్యాంక్ లో సభ్యు లుగా ఉన్న వారంతా ఓ ఉద్యోగిపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ని విధులు నుంచి తప్పించకపోతే తాము వైదొలుగుతామని సభ్యులు హెచ్చరించినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. పట్టణం లోని రెడ్‌క్రాస్ సొసైటీలో ల్యాబ్ టెక్నిషియన్‌గా పని చేస్తున్న నూకరాజు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అందులో పని చేస్తున్న మహిళా సిబ్బంది రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్, కలెక్టర్ కాంతిలాల్ దండేకు ఫిర్యాదు చేశారు. అలాగే రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని లంచం అడిగారని కొంతమంది తెలిపారు. బ్లడ్ బ్యాంక్ సభ్యులమైన తమపై దురుసుగా, కులదూషణతో మాట్లాడుతున్నారని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధు లు రవూఫ్, రామకృష్ణారావు కూడా అధికారులకు ఫిర్యా దు చేశారు. వీటిపై స్పందించి కలెక్టర్ విజయనగరం తహశీల్దార్ వెంకటశివతో నెల రోజుల క్రితం విచారణ జరిపించారు. ఫిర్యాదుదారులు విచారణకు హాజరై ఫిర్యాదులో పేర్కొ న్న అంశాలు వాస్తవమేనని చెప్పారు. పది రోజులు క్రితం జిల్లా కు వచ్చిన రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం దృష్టికి కూడా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ విషయూన్ని తీసుకువెళ్లారు. అయి నప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నూకరాజు బ్లడ్ బ్యాంక్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో ల్యాబ్ టెక్నిషి యన్‌గా పని చేస్తున్నారు. ఆరోపణలు నిజమని తేలినప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనుకంజవేస్తున్నారో తెలియడం లేదు. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై రెడ్‌క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి అట్టాడ హేమసుందర్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా నూకరాజుపై విచారణ పూర్తయిందన్నారు. ఫైల్ కలెక్టర్ వద్ద ఉందని, ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నారని చెప్పారు. -
జాబు ఓ డాబు
బాబు హయాంలో మెడికల్ ఇన్వాలిడేషన్ అర్జీల రద్దు జీవో అన్యాయమైపోయిన వందలాదిమంది ఉత్తర్వు రద్దు చేసిన మహానేత విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ‘జాబు కావాలి... బాబు రావాలి...’ ఇదీ టీడీపీ నేతల ప్రచారం. యువతలోనూ ఇదే నినాదం తీసుకెళ్లి ఊదరగొడుతున్నారు. నిజంగా బాబు వస్తే ఉద్యోగాలొస్తాయో లేదో గానీ ఉన్న ఉద్యోగాలను ఊడగొడతారని ఆయన పాలన గురించి బాగా తెలిసిన ఉద్యోగులెవరైనా ఇట్టే చెబుతున్నారు. బాబు రాకూడదు బాబోయ్ అంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. కాం ట్రాక్టు, ఔట్సోర్సింగ్లలో పని చేస్తు న్న వారితో బాటు కారు ణ్య నియామక ఉద్యోగాల్లోనూ కోత వేస్తాడని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పినకోటకు చెందిన నూకరాజు వైద్య శాఖలో నాలుగో తరగతి ఉద్యోగం చేసేవాడు. అతడికి ఓ సారి రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయింది. అప్పటి నుంచీ ఆరోగ్యం సహకరించేది కాదు. 54 ఏళ్ల వయస్సులోనూ అన్ని కార్యాలయాలకు తిరిగి ఫైల్స్ మోసుకురావడం కష్టమయ్యేది. వైద్యులు చూసి ఆరోగ్యం సహకరించడం లేదని నిర్ధారించారు. దీంతో తన కుమారునికి ఆ ఉద్యోగం ఇవ్వాలని 2002లో అర్జీ చేసుకున్నాడు. ఇలాంటి వారు జిల్లాలో దాదాపు అయిదారొందల మంది దరఖాస్తులు అప్పటికే ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో వుంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దరఖాస్తులు వేలల్లోనే ఉన్నాయని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ ఇన్వాలిడేషన్‌లో వచ్చే అర్జీలకు ఇచ్చే ఉద్యోగాలను రద్దు చేస్తూ 2002 లో జీవో (ఎం ఎస్ నెంబర్ 202, 203) జారీ చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా వున్న వందలాది మంది తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని మెడికల్ ఇన్వాలిడేషన్ చేయించుకున్న వారంతా అన్యాయమైపోయారు. ఒక పక్క జీతం రాక, పిల్లలకు ఉద్యోగం లేక, కేవలం పెన్షన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. వైఎస్సార్ ఉద్యోగమిచ్చారు...! మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగాలను కల్పించే జీవోలను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆరోగ్యం సహకరించక ఉద్యోగం చేయలేకపోతున్న వారికి తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించి తద్వారా కుటుంబ భారాన్ని మోసేందుకు ఉన్న ఏకైక అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు ఎన్జీవోలంతా ఏకమాయ్యరు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఎన్జీవోలంతా 202, 203 జీవోలను రద్దు చేయాలని కోరడంతో 2008లో అక్టోబర్ 23న జీవో ఎంఎస్ నెంబర్ 661 ద్వారా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2008 నుంచీ ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా వున్న దాదాపు 40 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 500 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. బాబు వస్తే జాబు ఎలా..! బాబు వస్తే జాబు ఎలా వస్తుంది. ఇంటింటికీ ఓ ఉద్యోగం అంటూ ప్రచారమే తప్పా ఆచరణ ఎలా సాధ్యం. ఓ ఊళ్లో 100 ఇళ్లుంటాయి. అక్కడ 100 మందికి ఉద్యోగాలిచ్చి ఏం చేయిస్తారో ఆయనే చెప్పాలి. ఇదంతా నిరుద్యోగులను మోసగించడమే. - అశోక్, నిరుద్యోగి, పిఠాపురం కాలనీ పర్మినెంట్ ఉద్యోగులుండరు..! బాబు వస్తే రెగ్యులర్ ఉద్యోగులుండరు. అంతా ఔట్సోర్సింగ్ సిబ్బందే. వారికి జీతాలు ఇవ్వరు..ప్రజలకు పని చేయరు. అంతా జన్మభూమి..మన ఖర్మ భూమి మాత్రమే మిగులుద్ది. - నాగమణి, జీవీఎంసీ ఔట్‌సోర్సిగ్ ఉద్యోగి