యామినీ భాస్కర్
‘‘జీవితం ప్రతి రోజూ ఓ పాఠం నేర్పుతుంది. ఇప్పటివరకు నా సినీ జర్నీలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవడంలో పరిణితిగా ఆలోచిస్తున్నాను. సక్సెస్ నా చేతిలో లేదు. నేను ఒప్పుకున్న సినిమాలో నా క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు యామినీ భాస్కర్. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్ ముఖ్య తారలుగా మురళీ కృష్ణ ముడిదాని దర్శకత్వంలో సతీష్ కుమార్ నిర్మించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను కె.కె. రాధామోహన్ వచ్చే నెల 5న రిలీజ్ చేస్తున్నారు. అలాగే గురువారం యామిని బర్త్‌డేని పురస్కరించుకుని యూనిట్ సభ్యులు బుధవారం ఆమెతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా యామిని చెప్పిన విశేషాలు...
►నన్ను కొంత మంది నార్త్ అమ్మాయి అనుకుంటున్నారట. కానీ నేను పక్కా తెలుగు అమ్మాయిని. మాది విజయవాడ. ‘భలే మంచి చౌక బేరమ్’లో ఎదుటివారి బాధను చూడలేని ఆదర్షి అనే మంచితనం ఉన్న అమ్మాయిగా నటించాను. కానీ నా మంచితనాన్ని వాడుకుని ఈ సినిమాలో నన్ను హీరో మోసం చేస్తాడు. తర్వాత ఏంటీ? అనేది సినిమాలో తెలుస్తుంది. దర్శకుడు మురళీగారు సినిమాను బాగా తీశారు. షూటింగ్ టైమ్‌లో బాగా ఎంజాయ్ చేశాం. కాన్సెప్ట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీగారికి, సినిమాను తొందరగా రిలీజ్ చేస్తున్న రాధామోహన్‌గారికి ధన్యవాదాలు.
►‘నర్తనశాల’ కథ నచ్చే చేశాను. ఒక సినిమా సక్సెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది. నెక్ట్స్ ఏ సినిమా కమిట్ కాలేదు. కథలు వింటున్నాను. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ పెద్ద బ్యానర్‌లో యాక్ట్ చేయాలని, మంచి కథ కుదరాలని వెయిట్ చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment