Naveed
-
‘సెహ్వాగ్ నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’
India Vs Pakistan ODI Series 2005: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపించి ఎన్నో అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడీ విధ్వంసక ఆటగాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో ద్విశతకం సాధించిన బ్యాటర్‌గా సచిన్ టెండుల్కర్‌కు కూడా సాధ్యం కాని ఘనత సాధించాడు. వీరూ భాయ్ క్రీజులో ఉన్నాడంటే బౌలర్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే! సెహ్వాగ్‌ను అవుట్ చేయడమే ఈజీ అలాంటి సెహ్వాగ్‌ను అవుట్ చేయడమే తనకు అత్యంత సులువుగా ఉండేదంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ రానా నవీద్ ఉల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను పాక్ జట్టుకు ఆడే రోజుల్లో టీమిండియా మిగతా బ్యాటర్లందరికంటే ఈ ముల్తాన్ కింగ్‌నే ఈజీగా పెవిలియన్‌కు పంపవచ్చని భావించేవాడినని తెలిపాడు. వీరూతో పోలిస్తే రాహుల్ ద్రవిడ్‌ను ఎదుర్కోవడం కష్టంగా ఉండేదని పేర్కొన్నాడు. 2005 నాటి వన్డే సిరీస్ సంగతుల గురించి తాజాగా ప్రస్తావించిన నవీద్ ఉల్ హసన్.. ‘తొలి రెండు మ్యాచ్‌లలో సెహ్వాగ్ అద్భుతంగా ఆడాడు. అప్పటికి మేము ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకబడి ఉన్నాం. ఒక మ్యాచ్‌లో అయితే సెహ్వాగ్ ఏకంగా సెంచరీ కొట్టాడు. రెండో మ్యాచ్‌లో 70కి పైగా స్కోర్ చేశాడు. నీకసలు ఆడటమే సరిగ్గా రాదు.. పాక్‌లో ఉండి ఉంటేనా! అప్పుడు నేను ఇంజీ భాయ్ దగ్గరకు వెళ్లి బంతిని నాకివ్వమని అడిగాను. స్లో బౌన్సర్‌తో సెహ్వాగ్‌ను బోల్తా కొట్టించాను. అంతకంటే ముందు అతడిని నేను స్లెడ్జ్ చేశాను. సెహ్వాగ్ దగ్గరికి వెళ్లి.. ‘‘నీకు అసలు ఎలా ఆడాలో తెలియదు. నువ్వు ఒకవేళ పాకిస్తాన్లో గనుక ఉండి ఉంటే.. ఇంత ఈజీగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేవాడివి కాదు’’ అని అన్నాను. అందుకు బదులుగా తను కూడా నన్ను ఏవో మాటలు అన్నాడు. ఆ వెంటనే నేను ఇంజీ భాయ్ దగ్గరికి వెళ్లి.. ‘‘తదుపరి బంతికి అతడు అవుట్ అవుతాడు చూడు అని చెప్పాను. నిజానికి తను అప్పుడు ఆశ్చర్యపోయాడు. అయితే, నా వ్యూహాన్ని అమలు చేస్తూ.. స్లో బాల్‌ను వేశాను. వెంటనే అవుటయ్యాడు అప్పటికే కోపంగా ఉన్న సెహ్వాగ్ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఇలా అత్యంత ముఖ్యమైన వికెట్‌ను పడగొట్టడం ద్వారా మ్యాచ్ గెలవడంలో నేను కీలక పాత్ర పోషించాను. ఫాస్ట్‌బౌలర్ల దగ్గర ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. నిజానికి నా దృష్టిలో సెహ్వాగ్‌ను అవుట్ చేయడం సులువే. కానీ రాహుల్ ద్రవిడ్‌కు బౌలింగ్ చేయడం మాత్రం అత్యంత కష్టమైనది’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నాదిర్ అలీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. నవీద్ ఉల్ హసన్.. సెహ్వాగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. సెహ్వాగ్ వికెట్ అతడి ఖాతాలో కాగా 2005లో పాకిస్తాన్ ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందగా.. ఆఖరి నాలుగు వన్డేలు గెలిచి పాక్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో నవీద్ ఉల్ హసన్ ఏకంగా నాలుగుసార్లు సెహ్వాగ్‌ను అవుట్ చేయడం గమనార్హం. ఇక నవీద్ పాక్ తరఫున 74 వన్డేలు ఆడి 110 వికెట్లు పడగొట్టాడు. తొమ్మిది టెస్టులు, నాలుగు టీ20లు ఆడి వరుసగా 18, 5 వికెట్లు తీశాడు. కాగా సెహ్వాగ్‌పై నవీద్ వ్యాఖ్యల నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీరూ గురించి మాట్లాడే సీన్ నీకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: IND VS WI 2nd Test: రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతి -
సినిమా తీయడం ఈజీ..రిలీజ్ కష్టం
‘‘మా బ్యానర్లో విడుదల చేసిన ‘భలేమంచి చౌకబేరమ్’ చిన్న సినిమా అయినా ప్రేక్షకాదరణ బాగుంది. కథ బాగుండటం వల్లే సినిమాను బాగా ఆదరిస్తున్నారు. రోజు రోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. వసూళ్లు ఇంకా పెరిగి, మా సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా’’ అని చిత్ర సమర్పకులు కె.కె. రాధామోహన్ అన్నారు. నవీద్, నూకరాజు, యామినీ భాస్కర్ కీలక పాత్రల్లో మురళీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’. ఆరోళ్ల సతీష్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా తీయడం తేలిక.. కానీ, విడుదల కష్టం. మౌత్ టాక్‌తో రీచ్ అయ్యేలా చేయడం చాలా కష్టం. శనివారం సాయంత్రానికి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మా టార్గెట్‌ని రీచ్ అయ్యాం’’ అన్నారు. ‘‘చిన్న సినిమా పెద్ద విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మురళీకృష్ణ. ‘‘టిక్కెట్టుకి 100 రూపాయలు పెడితే 1000 రూపాయల వినోదం ఇచ్చే చిత్రం ‘భలేమంచి చౌకబేరమ్’’ అన్నారు నవీద్. ‘‘సినిమా విడుదల రోజు(శుక్రవారం) ఉదయం ఆటకు మా సినిమా ఓపెనింగ్స్ చూసి నిరుత్సాహపడ్డాం. అదేరోజు సాయంత్రానికి థియేటర్లు ఫుల్ అయ్యాయి’’ అన్నారు నూకరాజు. ‘‘టఫ్ సిచ్యువేషన్లో కాన్ఫిడెన్స్‌తో మా సినిమా విడుదల చేశాం. టాక్ బావుంది’’ అన్నారు సతీష్. యామినీ భాస్కర్, నటులు రాజా రవీంద్ర, ముస్తఫా, ఉద్ధవ్, పూర్ణాచారి పాల్గొన్నారు. -
పక్కా కమర్షియల్ చిత్రమిది
‘‘భలే మంచి చౌక బేరమ్’ చిన్న సినిమా. చిన్న సినిమాల కాన్సెప్ట్‌లు చాలా బాగుంటాయి. కానీ, ప్రేక్షకులు థియేటర్‌కి రారు. సినిమాలు చూడాలంటే అందులో ఏదో సమ్‌థింగ్ డిఫరెంట్‌గా ఉండాలి. ఈ చిత్రంలో అలాంటి వైవిధ్యమైన పాయింట్ ఉంటుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. నవీద్, ‘కేరింత’ నూకరాజు హీరోలుగా, యామినీ భాస్కర్ హీరోయిన్గా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. కె.కె.రాధామోహన్ సమర్పణలో అరోళ్ళ సతీష్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. ఈ చిత్రానికి కాన్సెప్ట్ అందించిన మారుతి చెప్పిన విశేషాలు. ► కృష్ణానగర్‌లో తిరిగే ఇద్దరు బ్యాచిలర్స్కి దేశ రహస్యాలకు సంబంధించిన ఒక కవర్ దొరుకుతుంది. వాళ్లు దాన్ని ఎలా బేరం ఆడారు? అనేది ‘భలే మంచి చౌక బేరమ్’ మెయిన్ కాన్సెప్ట్. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ► ఇదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. నేను చెప్పిన ఐడియాకి రవి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి డైలాగ్స్ రాశారు. ‘రోజులు మారాయి’ టీమ్ సెట్ అయ్యింది. కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ట్విస్ట్ ఉంటుంది. సెకండాఫ్ సీరియస్‌గా, కన్ఫ్యూజన్ కామెడీతో ఉండే పక్కా కమర్షియల్ చిత్రమిది. ► కె.కె. రాధామోహన్‌గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. మా సినిమా ఫస్ట్‌కాపీ చూసి, బాగా ఇంప్రెస్ అయిన ఆయన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ► ఇకపై పెద్ద చిత్రాలపైనే శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం చిన్న చిత్రాలు చేయదల్చుకోలేదు. నా సైకిల్ ప్రయాణం స్మూత్‌గా సాగుతోంది. నా తర్వాతి చిత్రం ‘భలే భలే మగాడివోయ్’లా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. -
నేను మీ అమ్మాయినే అండీ
‘‘జీవితం ప్రతి రోజూ ఓ పాఠం నేర్పుతుంది. ఇప్పటివరకు నా సినీ జర్నీలో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్ట్స్‌ను ఎంచుకోవడంలో పరిణితిగా ఆలోచిస్తున్నాను. సక్సెస్ నా చేతిలో లేదు. నేను ఒప్పుకున్న సినిమాలో నా క్యారెక్టర్ కోసం ఎంతైనా కష్టపడతాను’’ అన్నారు యామినీ భాస్కర్. నవీద్, ‘కేరింత’ నూకరాజు, యామినీ భాస్కర్ ముఖ్య తారలుగా మురళీ కృష్ణ ముడిదాని దర్శకత్వంలో సతీష్ కుమార్ నిర్మించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను కె.కె. రాధామోహన్ వచ్చే నెల 5న రిలీజ్ చేస్తున్నారు. అలాగే గురువారం యామిని బర్త్‌డేని పురస్కరించుకుని యూనిట్ సభ్యులు బుధవారం ఆమెతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా యామిని చెప్పిన విశేషాలు... ►నన్ను కొంత మంది నార్త్ అమ్మాయి అనుకుంటున్నారట. కానీ నేను పక్కా తెలుగు అమ్మాయిని. మాది విజయవాడ. ‘భలే మంచి చౌక బేరమ్’లో ఎదుటివారి బాధను చూడలేని ఆదర్షి అనే మంచితనం ఉన్న అమ్మాయిగా నటించాను. కానీ నా మంచితనాన్ని వాడుకుని ఈ సినిమాలో నన్ను హీరో మోసం చేస్తాడు. తర్వాత ఏంటీ? అనేది సినిమాలో తెలుస్తుంది. దర్శకుడు మురళీగారు సినిమాను బాగా తీశారు. షూటింగ్ టైమ్‌లో బాగా ఎంజాయ్ చేశాం. కాన్సెప్ట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతీగారికి, సినిమాను తొందరగా రిలీజ్ చేస్తున్న రాధామోహన్‌గారికి ధన్యవాదాలు. ►‘నర్తనశాల’ కథ నచ్చే చేశాను. ఒక సినిమా సక్సెస్ ఆడియన్స్ చేతిలో ఉంటుంది. నెక్ట్స్ ఏ సినిమా కమిట్ కాలేదు. కథలు వింటున్నాను. తమిళంలోనూ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ పెద్ద బ్యానర్లో యాక్ట్ చేయాలని, మంచి కథ కుదరాలని వెయిట్ చేస్తున్నాను. -
దేశ రహస్యం ఎవరి చేతిలో?
దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో ‘రోజులు మారాయి’ ఫేమ్ దర్శకుడు ముడిదాని మురళీ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరం’. నవీద్, నూకరాజు హీరోలుగా యామిని హీరోయిన్గా నటిస్తున్నారు. రాజా రవీంద్ర ముఖ్య పాత్ర చేస్తున్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న మిలటరీ ఆఫీసర్ దేశ రహస్యాల మీద ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ మిస్ ఐతే? అది ఎవరి చేతికైనా చిక్కితే? అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఎరోల్ల గ్రూప్ అదినేత డా. ఎరోల్ల సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ – ‘‘నాకు ఇష్టమైన సతీష్ గారు, శ్రీనివాస్‌తో కలిసి ఈ సినిమా నిర్మించాం. కాన్సెప్ట్ ఎలా చెప్పానో అలానే సినిమాగా మలిచారు మురళి. కథ, మాటలు అందించిన రవి నంబూరికి థ్యాంక్స్. నవీద్, నూకరాజులు బాగా చేశారు’’ అన్నారు. ‘‘మారుతిగారి సినిమా అంటే నా సొంత సినిమాలా భావిస్తాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘మారుతిగారు మంచి కాన్సెప్ట్‌తో నిర్మాతకు నాలుగు రూపాయిలు మిగిలేలా చూస్తారు. తెలుగు టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ముందుంటారు. ఈ సినిమా మంచి హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు యస్.కె.ఎన్. ‘‘రెండో అవకాశం ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్స్. టీమ్ అంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేశాం. నిర్మాత సతీష్‌గారి సహకారంతో సినిమాను చాలా బాగా చేశాం. రవి నంబూరి మాటలు ఎసెట్ అవుతాయి. మా డార్క్ కామెడీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు మురళీ కృష్ణ. ‘‘మారుతి అందించిన కాన్సెప్ట్‌తో మురళి చాలా బాగా తెరకెక్కించాడు. ట్రైలర్ అందరికీ నచ్చింది. సమ్మర్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సతీష్. ‘‘మారుతిగారు కాన్సెప్ట్ ఇవ్వటమే సక్సెస్ కొట్టేశాం. డైరెక్టర్‌గారు ఫుల్ క్లారిటీ తో తెరకెక్కించారు. టైక్నికల్గా హై స్టాండర్డ్‌లో ఉంటుంది’’ అన్నారు నవీద్. ‘‘మంచి పాత్ర ఇచ్చిన మారుతిగారికి, మురళీగారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు నూకరాజు. ఈ సినిమాకు సంగీతం: హరి గౌరా, సహ నిర్మాతలు : పిడమర్తి రవి, రెహమాన్. లైన్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్. -
విజేతలు నవీద్, రయీస్
జూనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన బాక్సర్లు మొహమ్మద్ నవీద్, మొహమ్మద్ రయీస్ సత్తా చాటారు. ఎథిక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. 46 కేజీల వెయిట్ కేటగిరీ ఫైనల్లో మొహమ్మద్ నవీద్, జి. అనీశ్‌పై గెలుపొందగా... 48 కేజీల విభాగంలో మొహమ్మద్ రయీస్, చైతన్యను ఓడించాడు. ఇతర ఫైనల్ మ్యాచ్‌ల్లో 50 కేజీల విభాగంలో మొహమ్మద్ బిన్ ఉస్మాన్ (హైదరాబాద్), అజయ్‌పై, 52 కేజీల విభాగంలో పవన్ కల్యాణ్ (రంగారెడ్డి) బి. శ్రీనివాస్‌పై, 54 కేజీల విభాగంలో త్రిజోత్ సింగ్ (హైదరాబాద్) భరత్‌పై, 57 కేజీల విభాగంలో ఎన్. హరీశ్ (హైదరాబాద్) ఏవీ పవన్‌పై, 60 కేజీల విభాగంలో బి. హర్షిత్ (ఖమ్మం) సాయిపై, 63 కేజీల విభాగంలో ఎం. వేణు (హైదరాబాద్) ఆర్. రాహుల్‌పై, 70 కేజీల విభాగంలో రాకేశ్ యాదవ్ (రంగారెడ్డి) జి. హనుమాన్‌పై, 75 కేజీల విభాగంలో ఆర్యవ్ మిశ్రా (హైదరాబాద్) రంగా రోహిత్‌పై, 80+ కేజీల కేటగిరీలో పి. సాయిరామ్ డి. విశాల్‌పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. 80 కేజీల విభాగంలో ఎస్. హర్షవర్ధన్, 66 కేజీల విభాగంలో ఎన్. సౌరభ్లకు ఫైనల్లో బై లభించింది. -
ప్రత్యేక విమానంలో నవీద్ తరలింపు!
ఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ యాకూబ్ ను గురువారం ఢిల్లీకి తరలించనున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అతడ్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపి ప్రాణాలతో పట్టుబడిన నవేద్ యాకూబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎన్ ఐఏ కోర్టు అతడికి14 రోజులు కస్టడీకి అనుమతినిచ్చింది. ఉధంపూర్ లో ఉగ్రవాది నవీద్ ను స్థానికులు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి . భారత సైన్యానికి పట్టిచ్చారు. మరో ఉగ్రవాది ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఇప్పటివరకు 11మందిని అరెస్టు చేసిన పోలీసులు వారినుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే ముఖ్యంగా భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై ఆరాతీశారు. నవేద్ యకూబ్ పై అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధ చట్టం, పలు సెక్షన్ల కింద నవీద్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడిన నవెద్ కు 12 మంది ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. తమ విచారణలో నవీద్ చెప్పే మాటల్లో, చేసే ప్రకటనల్లో స్పష్టత లేదని, కొత్త కథనాలను తెరపైకి తెస్తున్నాడని అధికారులు చెబుతున్నారు.