దేశ రహస్యం ఎవరి చేతిలో? | Bhale Manchi Chowka Beram trailer unveiled | Sakshi
Sakshi News home page

దేశ రహస్యం ఎవరి చేతిలో?

Published Sun, Apr 1 2018 12:14 AM | Last Updated on Sun, Apr 1 2018 12:14 AM

Bhale Manchi Chowka Beram trailer unveiled - Sakshi

నవీద్, యామిని, నూకరాజు

దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో ‘రోజులు మారాయి’ ఫేమ్‌ దర్శకుడు ముడిదాని మురళీ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరం’. నవీద్, నూకరాజు హీరోలుగా యామిని హీరోయిన్‌గా నటిస్తున్నారు. రాజా రవీంద్ర ముఖ్య పాత్ర చేస్తున్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న మిలటరీ ఆఫీసర్‌ దేశ రహస్యాల మీద ఒక బుక్‌ రాస్తారు. ఆ బుక్‌ మిస్‌ ఐతే? అది ఎవరి చేతికైనా చిక్కితే? అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఎరోల్ల గ్రూప్‌ అదినేత డా. ఎరోల్ల సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు.

శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ – ‘‘నాకు ఇష్టమైన సతీష్‌ గారు, శ్రీనివాస్‌తో కలిసి ఈ సినిమా నిర్మించాం. కాన్సెప్ట్‌ ఎలా చెప్పానో అలానే సినిమాగా మలిచారు మురళి. కథ, మాటలు అందించిన రవి నంబూరికి థ్యాంక్స్‌. నవీద్, నూకరాజులు బాగా చేశారు’’ అన్నారు. ‘‘మారుతిగారి సినిమా అంటే నా సొంత సినిమాలా భావిస్తాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్‌ తరుణ్‌.  ‘‘మారుతిగారు మంచి కాన్సెప్ట్‌తో నిర్మాతకు నాలుగు రూపాయిలు మిగిలేలా చూస్తారు.

తెలుగు టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయటంలో ముందుంటారు. ఈ సినిమా మంచి హిట్‌ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు యస్‌.కె.ఎన్‌. ‘‘రెండో అవకాశం ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్స్‌. టీమ్‌ అంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేశాం. నిర్మాత సతీష్‌గారి సహకారంతో సినిమాను చాలా బాగా చేశాం. రవి నంబూరి మాటలు ఎసెట్‌ అవుతాయి. మా డార్క్‌ కామెడీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు మురళీ కృష్ణ.  ‘‘మారుతి అందించిన కాన్సెప్ట్‌తో మురళి చాలా బాగా తెరకెక్కించాడు. ట్రైలర్‌ అందరికీ నచ్చింది.

సమ్మర్‌కి రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సతీష్‌. ‘‘మారుతిగారు కాన్సెప్ట్‌ ఇవ్వటమే సక్సెస్‌ కొట్టేశాం. డైరెక్టర్‌గారు ఫుల్‌ క్లారిటీ తో తెరకెక్కించారు. టైక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఉంటుంది’’ అన్నారు నవీద్‌.  ‘‘మంచి పాత్ర ఇచ్చిన మారుతిగారికి, మురళీగారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు నూకరాజు. ఈ సినిమాకు సంగీతం: హరి గౌరా, సహ నిర్మాతలు : పిడమర్తి రవి, రెహమాన్‌. లైన్‌ ప్రొడ్యూసర్‌: దాసరి వెంకట సతీష్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement