trailor release
-
ఇంట్రస్టింగ్‌గా ‘కమిట్ మెంటల్’ ట్రైలర్
సాక్షి, హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం, ఉద్భవ్ రఘునందన్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్ సిరీస్ ‘కమిట్ మెంటల్’ అఫీషియల్ ట్రైలర్ శనివారం రిలీజైంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఈ సిరీస్ ని అనౌన్స్ చేసి పునర్నవి సందడి చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 13 నుండి ‘ఆహా’లో విడుదల కానున్న ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు టీజర్లోనే అనూ, ఫణి లవ్ ట్రాక్‌ను పరిచయం చేసిన చిత్రయూనిట్ మరోసారి ఈ రెండు పాత్రల స్వభావాలను ఎలివేట్ చేసేలా టీజర్ రూపొందించడం విశేషం. పవన్ సాధినేని దర్శకత్వంలోవస్తున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్, టీజర్ ద్వారా మరింత ఆసక్తి రేపారు. ముఖ్యంగా నేను లైట్ వేసుకుని పడుకుంటానా, నాకు ఏ ఫుడ్ అంటే ఎలర్జీ, నాకు కుక్క అంటే భయమా, పిల్లి అంటే భయమా అంటూ పునర్నవి (అనూ) తన ఫ్రస్ట్రేషన్ లెవల్స్‌ని అద్భుతంగా ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంటోంది. రిలీజైన్ తరువాత సిరీస్ అంతా ఇలా ఇంటస్ట్రింగ్గానే కొనసాగుతుందా వేచి చూడాలి. -
వేరే సంబంధాలు ఉన్నాయా.. ఒక్క చెంపదెబ్బే కదా!
టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్లో దూసుకుపోతున్నారు. తొలుత గ్లామర్ డాల్ పాత్రలకే పరిమితమైన తాప్సీ.. ఇటీవల కాలంలో నటనకు ఆస్కారం ఉన్న, సందేశాత్మక పాత్రల్లో మెప్పిస్తూ విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటున్నారు. ఆమె నటించిన పింక్, బేబీ, నామ్ షబానా, ముల్క్, బద్లా, సాంధ్ కీ ఆంఖ్ చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఇక సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే తాప్సీ తాజాగా నటిస్తున్న చిత్రం థప్పడ్(చెంపదెబ్బ అని అర్థం). ముల్క్, ఆర్టికల్ 15 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది.(థాంక్యూ తాప్సీ: మిథాలీ రాజ్) ఇక గృహిణిగా సంతోషకరమైన జీవితం గడుపుతున్న ఓ మహిళ జీవితం.. భర్త అందరి ముందూ తనను కొట్టిన ఒకే ఒక్క చెంపదెబ్బతో ఎలాంటి మలుపు తీసుకుంది... తన ఆత్మగౌరవం, భర్త చేత క్షమాపణ చెప్పించడం కోసం చట్టప్రకారం ఆమె పోరాడిన తీరు ఇతివృత్తంగా సినిమా రూపొందినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. భర్తను ప్రేమగా చూసుకుంటూ.. అతడికి అన్ని సౌకర్యాలు అమర్చిపెట్టే భార్య నుంచి.. ప్రతీ బంధంలోనూ సర్దుబాట్లే తప్ప నిజమైన ప్రేమ ఉండదని గ్రహించానంటూ తాప్సీ చెప్పే డైలాగులు... విడాకుల కోసం లాయర్ దగ్గరికి వెళ్తే.. నీ భర్తకు లేదా నీకు వివాహేతర సంబంధం ఉందా.. ఒక్క చెంపదెబ్బకే విడాకుల దాకా వెళ్తావా అంటూ లాయర్ ప్రశ్నించే తీరు.. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దంటూ తల్లి తాప్సీకి చెప్పే మాటలు ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఇక థప్పడ్ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాతో తాప్సీ నటిగా మరో మెట్టు ఎక్కడం ఖాయం అంటూ ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. (ఓకే సార్... నాకు థెరపీ సెషన్స్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు?) -
‘భరత్ అనే నేను’ ట్రైలర్ వచ్చేసింది
-
ఎట్టకేలకు ఒకడొచ్చాడబ్బా..
ఎల్బీ స్టేడియంలో ‘భరత్’ బహిరంగ సభ శనివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. అభిమానుల ఎంతగానో ఎదురుచూస్తున్నా ‘భరత్ అనే నేను’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్లో హీరో మహేశ్ బాబు చాలా స్టైలిస్‌గా కనిపించారు. ‘తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి కరెక్టు చేయడానికి ట్రై చేస్తే మీకు రాచరికం, రాజులు గుర్తు వచ్చారు.. కానీ నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించే మా అమ్మా, నాన్న గుర్తు వచ్చారని’ మహేశ్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమౌతుంది. భరత్ అనే నేను అనే థీమ్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్లో ఎంతగానో ఆకట్టుకుంది. ఎట్టకేలకు ఒక్కడొచ్చాడబ్బా అని రావు రమేశ్ చెప్పే డైలాగ్ చాలా పవర్ ఫుల్‌గా ఉంది. రాజకీయ నాయకుడు అనుకున్నా.. నాయకుడు అనే డైలాగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాక దేవరాజ్ చెప్పిన.. మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని.. మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్నీ అదుకోవడం అగ్రిమెంట్ అని చెప్పడం చాలా పవర్ ఫుల్‌గా అనిపించింది. త్వరలోనే మీ అందర్ని మాట మీద నిలబడే మొగాల్ని చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే డైలాగ్ మహేశ్ అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 20వ తేదీన విడుదల అవుతోంది. -
దేశ రహస్యం ఎవరి చేతిలో?
దర్శకుడు మారుతి అందించిన కాన్సెప్ట్‌తో ‘రోజులు మారాయి’ ఫేమ్ దర్శకుడు ముడిదాని మురళీ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరం’. నవీద్, నూకరాజు హీరోలుగా యామిని హీరోయిన్గా నటిస్తున్నారు. రాజా రవీంద్ర ముఖ్య పాత్ర చేస్తున్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న మిలటరీ ఆఫీసర్ దేశ రహస్యాల మీద ఒక బుక్ రాస్తారు. ఆ బుక్ మిస్ ఐతే? అది ఎవరి చేతికైనా చిక్కితే? అనే కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఈ చిత్రాన్ని ఎరోల్ల గ్రూప్ అదినేత డా. ఎరోల్ల సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ – ‘‘నాకు ఇష్టమైన సతీష్ గారు, శ్రీనివాస్‌తో కలిసి ఈ సినిమా నిర్మించాం. కాన్సెప్ట్ ఎలా చెప్పానో అలానే సినిమాగా మలిచారు మురళి. కథ, మాటలు అందించిన రవి నంబూరికి థ్యాంక్స్. నవీద్, నూకరాజులు బాగా చేశారు’’ అన్నారు. ‘‘మారుతిగారి సినిమా అంటే నా సొంత సినిమాలా భావిస్తాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘మారుతిగారు మంచి కాన్సెప్ట్‌తో నిర్మాతకు నాలుగు రూపాయిలు మిగిలేలా చూస్తారు. తెలుగు టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ముందుంటారు. ఈ సినిమా మంచి హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు యస్.కె.ఎన్. ‘‘రెండో అవకాశం ఇచ్చిన మారుతి గారికి థ్యాంక్స్. టీమ్ అంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేశాం. నిర్మాత సతీష్‌గారి సహకారంతో సినిమాను చాలా బాగా చేశాం. రవి నంబూరి మాటలు ఎసెట్ అవుతాయి. మా డార్క్ కామెడీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు దర్శకుడు మురళీ కృష్ణ. ‘‘మారుతి అందించిన కాన్సెప్ట్‌తో మురళి చాలా బాగా తెరకెక్కించాడు. ట్రైలర్ అందరికీ నచ్చింది. సమ్మర్‌కి రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సతీష్. ‘‘మారుతిగారు కాన్సెప్ట్ ఇవ్వటమే సక్సెస్ కొట్టేశాం. డైరెక్టర్‌గారు ఫుల్ క్లారిటీ తో తెరకెక్కించారు. టైక్నికల్గా హై స్టాండర్డ్‌లో ఉంటుంది’’ అన్నారు నవీద్. ‘‘మంచి పాత్ర ఇచ్చిన మారుతిగారికి, మురళీగారికి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు నూకరాజు. ఈ సినిమాకు సంగీతం: హరి గౌరా, సహ నిర్మాతలు : పిడమర్తి రవి, రెహమాన్. లైన్ ప్రొడ్యూసర్: దాసరి వెంకట సతీష్. -
బాహుబలి ట్రైలర్–2 విడుదల
కాకినాడలో ప్రభాస్ అభిమానుల సందడి బాహుబలి–2 సినిమా ట్రైలర్ విడుదలతో సినీ హీరో ప్రభాస్ అభిమానులు కాకినాడలో సందడి చేశారు. మల్టిప్లెక్స్, ఆనంద్, పద్మప్రియ థియేటర్లలో గురువారం ఉదయం ఈ ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ అభిమానులు ఆయా థియేటర్లవద్దకు పెద్ద ఎత్తున చేరుకొన్నారు. ప్రభాస్ టీషర్టులు ధరించి, పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ప్రభాస్ చిత్రంతో ఉన్న భారీ జెండాను ప్రదర్శించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ట్రైలర్ విడుదల చేసినట్టు దేవీ మల్టిప్లెక్స్ థియేటర్ మేనేజర్ కె.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రభాస్ అభిమానుల సంఘం అధ్యక్షుడు శ్రీను ప్రభాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. – కాకినాడ కల్చరల్