సాక్షి, హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం, ఉద్భవ్ రఘునందన్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన వెబ్ సిరీస్ ‘కమిట్ మెంటల్’ అఫీషియల్ ట్రైలర్ శనివారం రిలీజైంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఈ సిరీస్ ని అనౌన్స్ చేసి పునర్నవి సందడి చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 13 నుండి ‘ఆహా’లో విడుదల కానున్న ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేశారు
టీజర్‌లోనే అనూ, ఫణి లవ్ ట్రాక్‌ను పరిచయం చేసిన చిత్రయూనిట్ మరోసారి ఈ రెండు పాత్రల స్వభావాలను ఎలివేట్ చేసేలా టీజర్ రూపొందించడం విశేషం. పవన్ సాధినేని దర్శకత్వంలోవస్తున్న ఈ సిరీస్ ఫస్ట్ లుక్, టీజర్ ద్వారా మరింత ఆసక్తి రేపారు. ముఖ్యంగా నేను లైట్ వేసుకుని పడుకుంటానా, నాకు ఏ ఫుడ్ అంటే ఎలర్జీ, నాకు కుక్క అంటే భయమా, పిల్లి అంటే భయమా అంటూ పునర్నవి (అనూ) తన ఫ్రస్ట్రేషన్ లెవల్స్‌ని అద్భుతంగా ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంటోంది. రిలీజైన్ తరువాత సిరీస్ అంతా ఇలా ఇంటస్ట్రింగ్‌గానే కొనసాగుతుందా వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment