సినిమా బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవలే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సివరపల్లి అనే వెబ్ సిరీస్‌లో హీరోగా నటించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి పాత్రలో మెరిశారు. ‘పంచాయత్’ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలి అనుకునే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారితే ఎలా ఉంటుందనే కోణంలో తెరెకెక్కించారు. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే అదే రోజు గాంధీ తాత చెట్టు అనే సినిమా రిలీజైంది. సుకుమాక్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్‌గా సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ మరోసారి మెరిశాడు. నిజానికి అతనికి సినిమాలో ఉన్న స్క్రీన్ టైం తక్కువే అయినా తనదైన శైలిలో ఉన్న కాసేపు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో రాగ్ మయూర్ ఉండడంతో అది మరింత బాగా కలిసొచ్చింది. ఒకేరోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాతో పాటు సివరపల్లి వెబ్ సిరీస్ రెండిటికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఇలా భిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగులో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని భావిస్తున్న రాగ్ మయూర్.. ఇప్పటికే గీత ఆర్ట్స్2 లో ఒక పేరు పెట్టని సినిమాతో పాటు పరదా, అలాగే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నటిస్తున్నాడు.
‘సివరపల్లి’ వెబ్ సిరీస్, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్‌గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో దూసుకెళ్తున్నాడు. చదువులో స్టేట్ టాపర్ అయిన రాగ్ మయూర్ ప్రశాంతంగా చదువు పూర్తి చేసి తర్వాత నటన మీద శ్రద్ధ పెట్టాడు.. సినిమాల గురించి రివ్యూస్ రాసే స్థాయి నుంచి ఈరోజు అదే రివ్యూలలో తన గురించి రాయించుకునే స్థాయికి నటనతో ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
రాగ్ మయూర్ మొదటి సినిమా సినిమా బండిలో మరిడేష్ బాబు అనే పాత్రతో మెరిశాడు. ఆ పాత్రలో రాగ్ మయూర్ నటనతో సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఆ తర్వాత భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. భిన్నమైన జానర్ సినిమాలు చేస్తూ అందులో భాగంగానే కీడా కోలా అనే సినిమాలో లాయర్‌గా, బ్రహ్మానందం మనవడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రలో కూడా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని పరితపించే సగటు కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అతని పాత్రల ఎంపిక చూస్తే ఏ ఒక్క దానికి మరో పాత్రకి సంబంధం ఉండదు. అలా భిన్నమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment