Gandhi Tatha Chettu Movie
-
ఓటీటీ బెస్ట్ యాక్టర్‌గా రాగ్‌మయూర్ నామినేట్ : రాగ్ ఫ్యావరెట్ హీరోయిన్ ఎవరంటే..!
సివరపల్లి వెబ్ సిరీస్‌తో దూసుకుపోతున్న హీరో రాగ్ మయూర్ మరో ఘనతను సాధించారు. సెన్సేషనల్ హీరో అయిపోదామని కాకుండా... పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతూ, నటనలో రాటుదేలుతూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న రాగ్ తాజాగా మరో అడుగు ముందుకేసారు. సివరపల్లి సిరీస్‌లో నటనకు గాను ఇంటర్నేషనల్ ఐకానిక్ బెస్ట్ యాక్టర్ ఓటీటీ తెలుగు అవార్డ్ కోసం నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్లో వెల్లడించారు. దీంతో ఆయనకు ఫ్యాన్స్ అభినందనలు తెలియజేశారు.ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్ నటనపై ఆసక్తితో ఉన్నత చదువును పక్కన బెట్టి మరీ హీరో రాణిస్తున్నారు. అద్భుతమైన నటనతో సినీ లవర్స్‌కు దగ్గరవుతున్నారు. సినిమానే తన ప్రాణం, ప్రేక్షకులే నా దేవుళ్లు.. ప్రేక్షకులు లిచ్చిన ప్రేమ, వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అంటున్న వాలెంటైన్స్ డే సందర్బంగా హీరో రాగ్మయూర్తో స్పెషల్ చిట్ చాట్ రెండో భాగం. (చివరిది) మీకోసం! -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్
‘ప్రేమంటే ఏమిటంటే ...’’ యుగయుగాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెదుకులాట నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఎవరి అర్థాలు వారివి. ఎవరి అనుభూతులు, అనుభవాలు వారివి. ఎవరి భావోద్వేగాలు వారివి. అందుకే రెండు హృదయాల మధ్య ప్రేమ సరికొత్తగా కొంగొత్తగా చిగురుస్తూనే ఉంది. చిక్కావే ప్రేమ.. అంటూ కూని రాగాలు కాదు...కాదు..కోటి రాగాలు పలికిస్తుంది. అదే ప్రేమ అనే రెండక్షరాల్లోని గమ్మత్తు... మత్తు. ఈ మత్తులోకి ఎవరికి వారు ఎపుడో ఒకపుడు జారిపోవాల్సిందే. ప్రేమికుల దినోత్సవం సందర్బంగా సివరపల్లి (పంచాయత్ సిరీస్ తెలుగు రీమేక్) హీరో రాగ్ మయూర్‌తో సాక్షి.కామ్ స్పెషల్‌గా ముచ్చటించింది.సినిమాబండి సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న విలక్షణ నటుడు రాగ్ మయూర్. ముఖ్యంగా వాలెంటైన్స్ డే వీక్ మొదలైందంటే చాలు ‘స్వర మంజరీ’ అంటూ చెప్పే ఆయన డైలాగ్ గత మూడు నాలుగేళ్లుగా ట్రెండింగ్‌లో నిలుస్తోంది అంటే రాగ్ యాక్టింగ్ స్కిల్స్‌ను అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్ సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ నటించడమే కాదు, అటు విలన్ కూడా తన ప్రతిభను చాటుకున్నాడు.ఇదీ చదవండి: MahaKumbh : బ్రహ్మాండమైన వ్యాపారం నెలకు లక్షన్నర!ఇపుడు తన కరియర్లో మైలురాయిలాంటి సివరపల్లిలో పంచాయతీ సెక్రటరీగా తన నటనతో ప్రేక్షక నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఓటీటీలో జనాలను ఒప్పించి, మెప్పించిన హిందీ ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తెలుగులోకి రీమేక్ కూడా అదే స్థాయిలో దూసుకుపోవడం విశేషమే మరి. తెలుగు ఫ్లేవర్ మిస్ కాకుండా తెలంగాణలోని పల్లె వాతావరణంలో సాగే ఈ సిరీస్ పిల్లా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటోంది.సినిమాపై ఆయనకు ప్రేమ ఎలాపుట్టింది లాంటి వివరాలతో పాటు, నిజజీవితంలో ప్రేమ, ప్రేక్షకులతో ఆయన ప్రేమ, రాగ్ కిష్టమైన నటీ నటులు ఇలాంటి మరిన్ని విశేషాలు ఆయన సాక్షితో పంచుకున్నారు. ఈ మొత్తం చిట్‌చాట్‌ను రెండు భాగాలుగా వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. రాగ్ అందించిన ప్రేమ కబుర్లలో ఏ ఒక్కటీ మిస్ కాకుండా దీన్ని సంపూర్ణంగా వీక్షించి, మీ అభిప్రాయాలను పంచుకోండి. సాక్షి.కామ్ ప్రేమికులకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. -
Rag Mayur: కంటెంట్ బేస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
సినిమా బండి మూవీతో హీరోగా మారిన రాగ్ మయూర్ ఇటీవలే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సివరపల్లి అనే వెబ్ సిరీస్‌లో హీరోగా నటించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి పాత్రలో మెరిశారు. ‘పంచాయత్’ అనే హిందీ వెబ్ సిరీస్ ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమెరికా వెళ్లి పెద్ద చదువులు చదవాలి అనుకునే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారితే ఎలా ఉంటుందనే కోణంలో తెరెకెక్కించారు. తెలంగాణలోని ఓ పల్లెలో జరిగిన కథగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.అయితే అదే రోజు గాంధీ తాత చెట్టు అనే సినిమా రిలీజైంది. సుకుమాక్ కుమార్తె సుకృతి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు సినిమాలో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏజెంట్‌గా సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ మరోసారి మెరిశాడు. నిజానికి అతనికి సినిమాలో ఉన్న స్క్రీన్ టైం తక్కువే అయినా తనదైన శైలిలో ఉన్న కాసేపు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో రాగ్ మయూర్ ఉండడంతో అది మరింత బాగా కలిసొచ్చింది. ఒకేరోజు రిలీజ్ అయిన గాంధీ తాత చెట్టు సినిమాతో పాటు సివరపల్లి వెబ్ సిరీస్ రెండిటికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఇలా భిన్నమైన పాత్రలు చేస్తూ తెలుగులో ఒక మంచి నటుడిగా స్థిరపడాలని భావిస్తున్న రాగ్ మయూర్.. ఇప్పటికే గీత ఆర్ట్స్2 లో ఒక పేరు పెట్టని సినిమాతో పాటు పరదా, అలాగే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నటిస్తున్నాడు.‘సివరపల్లి’ వెబ్ సిరీస్, గాంధీ తాత చెట్టు సినిమాలో విలన్‌గా రెండు భిన్న పాత్రలతో ఒకేరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాగ్ మయూర్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ బాటలో దూసుకెళ్తున్నాడు. చదువులో స్టేట్ టాపర్ అయిన రాగ్ మయూర్ ప్రశాంతంగా చదువు పూర్తి చేసి తర్వాత నటన మీద శ్రద్ధ పెట్టాడు.. సినిమాల గురించి రివ్యూస్ రాసే స్థాయి నుంచి ఈరోజు అదే రివ్యూలలో తన గురించి రాయించుకునే స్థాయికి నటనతో ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.రాగ్ మయూర్ మొదటి సినిమా సినిమా బండిలో మరిడేష్ బాబు అనే పాత్రతో మెరిశాడు. ఆ పాత్రలో రాగ్ మయూర్ నటనతో సినిమా సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించాయి. ఇక ఆ తర్వాత భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ వెళుతున్నాడు. భిన్నమైన జానర్ సినిమాలు చేస్తూ అందులో భాగంగానే కీడా కోలా అనే సినిమాలో లాయర్‌గా, బ్రహ్మానందం మనవడి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వీరాంజనేయులు విహారయాత్రలో కూడా ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని పరితపించే సగటు కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అతని పాత్రల ఎంపిక చూస్తే ఏ ఒక్క దానికి మరో పాత్రకి సంబంధం ఉండదు. అలా భిన్నమైన పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. -
‘గాంధీ తాత చెట్టు'పై రామ్ చరణ్, ఉపాసన ప్రశంసలు
ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu). పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ చిత్రం విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. సినిమా అందరి హృదయాలకు హత్తకుంటుంది. మంచి సామాజిక సందేశంతో కూడిన ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన సుకృతి వేణి నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. 13 ఏళ్ల అమ్మాయిగా గాంధీ పాత్రలో ఆమె సహజ నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీమ్‌ను గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసనలు ఈ చిత్రం టీమ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. సుకృతికి ఆమె నటనకు వస్తున్న రెస్పాన్స్ పట్ల రామ్‌చరణ్(Ram Charan), ఉపాసనలు అభినందనలు తెలియజేశారు. గాంధీ తాత చెట్టు టీమ్‌తో కాసేపు ముచ్చటించారు. రామ్‌చరణ్, ఉపాసనలను కలిసిన వారిలో చిత్ర సమర్పకురాలు శ్రీమతి తబితా సుకుమార్, దర్శకురాలు పద్మ, నిర్మాత సింధు, రాగ్‌మయూర్, భాను ప్రకాష్, నేహాల్ తదితరులు ఉన్నారు.గాంధీ తాత చెట్టు కథేంటి?ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం.అతని మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని..ఆయన మార్గంలోనే నడుస్తుంది. స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులపాలవుతారు.అదే సమయంలో ఆ ఊర్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాది కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్(రాగ్ మయూర్) రైతులను మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే ఉద్దేశంలో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడతాడు. చెట్టుని నరికేస్తారేమోననే దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ. దాని కోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే మిగతా కథ. -
‘గాంధీ తాత చెట్టు’ మూవీ రివ్యూ
టైటిల్: గాంధీ తాత చెట్టునటీనటులు: సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ నిర్మాతలు: వీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు రచన-దర్శకత్వం: పద్మావతి మల్లాదిసంగీతం: రీసినిమాటోగ్రఫీ: శ్రీజిత్ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తులవిడుదల తేది: జనవరి 24, 2025ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi THatha Chettu Review). ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్‌లో సుకుమార్ కూడా పాల్గొనడంతో ‘గాంధీ తాత చెట్టు’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య రేపు (జనవరి 24) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మీడియా కోసం ఈ సినిమా స్పెషల్ షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సుకుమార్ తనయ డెబ్యూతోనే హిట్ కొట్టిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం.అతని మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని..ఆయన మార్గంలోనే నడుస్తుంది. స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులపాలవుతారు. అదే సమయంలో ఆ ఊర్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాది కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్(రాగ్ మయూర్) రైతులను మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే ఉద్దేశంలో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడతాడు. చెట్టుని నరికేస్తారేమోననే దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ. దాని కోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే మిగతా కథ.(Gandhi THatha Chettu Review))ఎలా ఉందంటే.. గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని, ఓ చెట్టుని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేదే ఈ సినిమా కథ. టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా గాంధీ, తాత, చెట్టు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ బాగుంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని చాలా జన్యూన్‌గానే ఇచ్చింది. అయితే సందేశం బాగున్నప్పటికీ సాగదీసి చెప్పినట్లుగా అనిపిస్తుంది. మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ.. అహింసవాదం గొప్పదనాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పారు. చెట్టును రక్షించేందుకు గాంధీ చేసే ప్రయత్నాలు అందరిని ఆకట్టుకుంటాయి. కానీ వాస్తవికానికి కాస్త దూరంగా ఉంటుంది.ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభంలోనే తాత,గాంధీ పాత్రలను పరిచయం చేసి.. అసలు కథను ప్రారంభించారు దర్శకురాలు. ఒకపక్క గాంధీ జర్నీని చూపిస్తూనే..మరోపక్క తాత, చెట్టుకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించారు. మహాత్మా గాంధీని ఈ కథలో ముడిపెట్టిన విధానం బాగుంది. తాత చనిపోయినప్పుడు చెట్టు ఏడుస్తూ చెప్పే మాటలు విని తెలియకుండానే మన కళ్లు చెమ్మగిల్లుతాయి. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ సాగినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అలాగే కథనం మొత్తం ఎలాంటి టర్న్‌లు, ట్విస్టులు లేకుండా ఊహకు అందినట్లే సాగుతుంది. ‘నువ్వు ఒక్క మొక్క అయినా నాటావా? చెట్టును నరికే హక్కు ఎవరిచ్చారు? నువ్వు పీల్చుకున్న గాలి ఎవరో పెంచిన మొక్కల నుంచి వచ్చిందే కానీ..నువ్వు సంపాదించుకున్నది ఏమి లేదంటూ బిజినెస్ మ్యాన్‌తో తాత చెబుతుంతుంటే.. ‘నిజమే కదా.. మనం కూడా చెట్లను పెంచలేదు. ఒక్కటైనా పెంచుదాం’ అనే ఆలోచన కొంతమందికి అయినా వస్తుంది. ‘ఏదైనా ప్రేమతో గెలవాలంటే కాస్త టైం పడుతుంది’, ‘చెడుని దులిపేయాలి...మంచిని పట్టుకోవాలి’, ‘పంట పండే స్థలాన్ని అమ్మడం అంటే కన్న తల్లిని వ్యభిచారానికి పంపించినట్లే’ అంటూ తాత చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏమేరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ఓ మంచి సందేశాన్ని మాత్రం అందించింది. ఎవరెలా చేశారంటే..సుకుమార్ ముద్దుల కూతురు సుకృతి వేణి నటించిన డెబ్యూ మూవీ ఇది. తొలి చిత్రంతోనే తనదైన నటనతో అందరికి ఆకట్టుకుంది. గాంధీ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం నిజంగామే ఆమె గుండు గీసుకుంది అంటే.. ఎంత ఇష్టపడి నటించిందో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించింది. ఇక తాత రామచంద్రయ్య పాత్రకి ఆనంద్ చక్రపాణి పూర్తి న్యాయం చేశాడు. బిజినెస్ మ్యాన్ సతీష్‌గా రాగ్ మయూర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గాంధీ తండ్రితో పాటు మిగిలిన నటీనటులంతా కొత్తవారే అయినప్పటికీ వారి వారి పాత్రల పరిధిమేర చక్కగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన పాటలలో పాటు నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నీవేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.