
'పుష్ప' సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్(Director Sukumar)కి ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు అబ్బాయి కాగా, సుకృతి (Sukrithi) అనే కుమార్తె కూడా ఉంది. ఈమె ప్రధాన పాత్రలో ఓ సినిమాలో నటించగా.. అది థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఆ మూవీ సడన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.
సుకుమార్ కూతురు సుకృతి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గాంధీతాత చెట్టు' (Gandhi Tatha Chettu Movie ). ఇందులో ఈమె స్టూడెంట్ గా నటించింది. సుకుమార్ భార్య బబితనే మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మించింది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 24న థియేటర్లలో రిలీజైంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)
ఈ సినిమాలో కంటెంట్ పర్లేదనే టాక్ వచ్చింది కానీ సంక్రాంతికి రిలీజైన మూవీస్ వల్ల 'గాంధీతాత చెట్టు' అనే చిత్రం ఒకటి రిలీజైందని తెలియనంత వేగంగా థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది. అలాంటిది దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు సడన్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.
'గాంధీతాత చెట్టు' విషయానికొస్తే.. నిజామాబాద్ జిల్లా అడ్లూర్. గాంధీ మహాత్ముడి గుర్తుగా రామచంద్రయ్య (ఆనంద చక్రపాణి) ఓ చెట్టు నాటుతాడు. ఎప్పుడూ ఆ చెట్టు చెంతనే గడుపుతూ, అందులోనే తన ప్రాణం ఉందని చెబుతుంటాడు. గాంధీ సిద్ధాంతాల్ని నమ్మి అనుసరించే ఆయన... తన మనవరాలికి గాంధీ (సుకృతి) అని పేరు పెడతాడు. పేరే కాదు, గాంధీ సిద్ధాంతాల్ని బోధిస్తూ పెంచుతాడు. ఊరిలోనూ, కుటుంబంలోనూ చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రామచంద్రయ్య తన భూమికి, చెట్టుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతాయి. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్..?)
Comments
Please login to add a commentAdd a comment