Allu Arjuns 'Pushpa' To premiere On OTT From 07 Jan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా క్లోజింగ్ కలెక్షన్స్‌లోనూ అదిరిపోయే వసూళ్లను సాధించింది. డిసెంబర్17న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 300కోట్ల ట్రేడ్ మార్క్‌ను దాటేసిన పుష్ప సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ ఓటీటీ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వేదికగా నేడు(జనవరి 7)న ఈ చిత్రం రిలీజ్ కానుంది. రాత్రి 8 గంటల నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లుఎ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది.సూపర్ హిట్ టాక్ తెచుకున్న పుష్ప చిత్రాన్ని 90 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ముందుగా భావించినా సంక్రాంతి సీజన్‌న్ క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment