ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం 'పుష్ప'. డిసెంబర్17న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన ఈ సినిమా హ్యాట్రిక్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందే ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి.
తాజాగా పుష్ప నుంచి సామీ సామీ ఫుల్ వీడియా సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తెలుగులో సామీ సామీ సాంగ్‌ను జానపద గాయని మౌనిక యాదవ్ పాడింది. చదవండి: ఓటీటీలోకి పుష్ప.. స్ట్రీమింగ్ ఎన్ని గంటల నుంచంటే..
Comments
Please login to add a commentAdd a comment