Saami
-
రష్మిక మందనాతో పోటీపడ్డ యువకుడు.. వీడియో మామూలుగా లేదుగా..
వాషింగ్టన్: పుష్ప మూవీలో ‘సామి సామి’ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్‌పై ఎంతో మంది వేసిన డ్యాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా ఈ పాటకు ఓ యువకుడు.. అమ్మాయిలు ధరించే స్కర్ట్ వేసుకొని వేసిన స్టెప్పులు మాములుగా లేవు. చాలా హుషారుగా, ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేశాడని నెటిజన్లు ప్రశంసిస్తునారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. భారతీయుడైన కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా తరచూ అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకొని ఆమెరికాలో డ్యాన్స్‌లు చేస్తున్నాడు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ నృత్యాలను బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు వాటిని అమెరికాలో ప్రదర్శిస్తూ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నాడు. డాన్స్ చేస్తూనే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. తాజాగా అతను స్కర్ట్ ధరించి... అమెరికా వీధుల్లో పుష్ప సినిమాలోని సామి సామి పాటకు డాన్స్ చేశాడు. ఆ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. View this post on Instagram A post shared by Jainil Mehta (@jainil_dreamtodance) అంతకు ముందు.. గంగూభాయ్ కతియావాడి సినిమాలోని ఝూమ్ రే గోరీ సాంగ్‌కి అదిరిపోయే గార్భా స్టెప్స్ వేశాడు. సినిమాలో ఈ సాంగ్‌ని అలియాభ్తో పిక్చరైజ్ చేయగా.. జైనిల్ అంతకుమించి అంటూ లైవ్‌లోనే స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూపించి వావ్ అనిపించుకున్నాడు. కాగా, ఇతడి డ్యాన్స్‌లను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుడగా.. మరికొందరు మాత్రం.. అమ్మాయిల డ్రెస్సులే ఎందుకు వేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Jainil Mehta (@jainil_dreamtodance) -
పుష్ప: సామీ సామీ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం 'పుష్ప'. డిసెంబర్17న విడుదలైన ఈ చిత్రం ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన ఈ సినిమా హ్యాట్రిక్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమా రిలీజ్‌కు ముందే ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా పుష్ప నుంచి సామీ సామీ ఫుల్ వీడియా సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తెలుగులో సామీ సామీ సాంగ్‌ను జానపద గాయని మౌనిక యాదవ్ పాడింది. చదవండి: ఓటీటీలోకి పుష్ప.. స్ట్రీమింగ్ ఎన్ని గంటల నుంచంటే.. -
త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది..!
సినిమా: సామిస్క్వేర్ చిత్రం వేరే లెవల్లో ఉంటుంది అంటున్నారు చియాన్ విక్రమ్. తాజాగా ఈయన తండ్రీకొడుకులుగా నటించినఫుల్ మాసాలాతో కూడిన యాక్షన్ ఓరి యెంటెడ్ కథా చిత్రం సామి స్క్వేర్. కమర్శియల్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ చిత్రం ఇంతకు ముందు ఇదే కాంబినేషన్లో రూపొంది సంచలన విజయాన్ని సా ధించిన సామి చిత్రానికి సీక్వె ల్. కీర్తీసురేశ్, ఐశ్వర్యరాజేశ్ హీరోయిన్లుగా నటించిన ఇందులో నటుడు బాబీసింహా ప్రతినాయకుడిగా నటించడం విశేషం. ప్రభు ముఖ్యపాత్రను పోషించిన ఈ భారీ చిత్రాన్ని తమీన్స్ ఫిలింస్ పతాకంపై శింబు తమీన్ నిర్మించారు. సామిస్క్వేర్ భారీ అంచనాల మధ్య శుక్రవారం తెరపైకి రానుంది. సామి పేరుతో తెలుగులోనూ ఏక కాలంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు గురువారం పత్రికల వారితో ముచ్చటించారు. అవేంటో చూద్దాం. ప్ర: సామి వంటి సంచలన విజయం సాధించిన చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సామిస్క్వేర్ చిత్రం ఎలా ఉంటుంది? జ: సామిస్క్వేర్ చిత్రం అంతకంటే వేరే లెవల్లో ఉంటుంది. లవ్, హై ఓల్టేజ్ యాక్షన్ అంటూ చిత్రం జెట్ వేగంలో సాగుతూ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. ఇందులో నేను తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేశాను. ప్ర: త్రిష నటించాల్సిన పాత్రలో ఐశ్వర్యరాజేశ్ నటన గురించి? జ: త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది. అయితే ఐశ్వర్యరాజేశ్ నటన ప్రశంసలు అందుకుంటుంది. ప్ర: సామి చిత్ర దర్శకుడు హరికి ఇప్పటి హరికి తేడా చూశారా? జ: హరి గురించి చెప్పాలం టే ఆయన ట్రెండ్‌కు తగ్గట్టుగా అప్డేట్ అవుతుంటారు. సామిస్క్వేర్ చిత్రాన్ని ఆయన మరింత ట్రెండీగా తెరకెక్కించారు. ఆయనలో వేగం మరింత పెరిగింది. ప్ర: ఏ తరహా పాత్రను చేయాలని కోరుకుంటున్నారు? జ: సేతు, పితామగన్, దైవతిరుమగళ్, ఐ, ఇరుముగన్ ఇలా నా చిత్రాలు గమనిస్తే ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలనే పోషించాను. నటనకు అవకాశం ఉన్న మంచి యాక్షన్ కలిసిన పాత్రలో నటించాలని ఉంది. ప్ర: ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అలాం టి చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారా. జ: అలాంటివి అమరాలి. ఇంతకు ముందు ఒకటి రెండు బయోపిక్ చిత్రాల్లో నటించమని అడిగారు కానీ, అవి మెటీరలైజ్ కాలేదు. అయితే సావిత్రి లాంటి బయోపిక్ కథా చిత్రం అమిరితే నటించడానికి రెడీ. ప్ర: మీ అబ్బాయి దృవ్ నటిస్తున్న వర్మ చిత్రం గురించి? జ: వర్మ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ చిత్రం గురించి దర్శకుడు బాలా చూసుకుంటారు. ప్ర: మీరు మీ కొడుకు దృవ్తో కలిసి నటిస్తారా? జ:మంచి కథ లభిస్తే కచ్చితంగా నటిస్తాను. ప్ర: తదుపరి చిత్రాలు? జ: ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధ్రువనక్షత్రం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాను. తదుపరి హిస్టారికల్ చిత్రం కర్ణన్ చేయనున్నారు. అదే విధంగా కమలహాసన్ నిర్మించనున్న చిత్రంలోనూ నటించనున్నాను. ఇవి పూర్తి అయిన తరువాతే కొత్త చిత్రాలను అంగీకరిస్తాను. -
అపరిచితుడు తర్వాత సామి
విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 15 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి’ పేరుతోనే తెరకెక్కిన చిత్రం నేడు విడుదల కానుంది. ఇందులో కీర్తీ సురేష్, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘సామి’ సినిమా సెన్సార్ కాదు.. రిలీజ్ కాదు అని కొందరు రూమర్లు క్రియేట్ చేశారు. వాటిని అధిగమించి సెన్సార్ పూర్తి చేసుకుని సుమారు 600 నుంచి 700 థియేటర్లలో ఈ రోజు సినిమాను విడుదల చేస్తున్నాం. ఈ మూవీకి ఇంత క్రేజ్ రావడానికి కారణం దర్శకుడు హరి. ఈ సినిమా రషెస్‌ని ఫ్యామిలీతో కలిసి చూసిన విక్రమ్ ఎమోషన్ అయి, హరిని హగ్ చేసుకున్నారట. ‘నా కెరీర్లో ‘అపరిచితుడు’ చిత్రం తర్వాత ‘సామి’ బిగ్గెస్ట్ హిట్ చిత్రం అవుతుంది. నాకు మైలురాయి చిత్రం ఇచ్చారు’ అని ఎమోషనల్ అయ్యారట. ఈ విషయం తెలిసి మేం హ్యాపీగా ఫీలయ్యాం. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ కాబోతోందనే టాక్ ఇప్పటికే వచ్చేసింది. మదర్ సెంటిమెంట్‌యాక్షన్, దేవిశ్రీ ప్రసాద్‌గారి పాటలు.. అన్నీ హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. విక్రమ్, హరి పాల్గొన్నారు. -
పోకిరి పోలీస్
విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన సినిమా ‘సామీ స్క్వేర్’. కీర్తీ సురేశ్, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటించారు. బాబీ సింహా, ప్రభు గణేశన్ కీలక పాత్రలు చేశారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం హరి–విక్రమ్ కాంబినేషన్లోనే రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘సామీ’కి ఇది సీక్వెల్. ఇప్పుడీ సినిమాను నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ తెలుగులో ‘సామి’ పేరుతో ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. విక్రమ్‌గారి నటవిశ్వ రూపం ఇందులో కనిపిస్తుంది. హరి సినిమాలే ఎక్కువగా మాట్లాడతాయి. ఆయన తక్కువ మాట్లాడతారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ట్రైలర్లో ‘నేను పోలీస్ కాదు పోకిరి’ అని విక్రమ్ చెప్పే డైలాగ్‌ను బట్టి ఈ సినిమా ఎక్కువగా మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందని టాక్. -
సీక్వెల్‌కి 15 ఏళ్లు పట్టింది
‘‘తెలుగులో నేను చేస్తున్న కొత్త ప్రయత్నం ‘సామి’ చిత్రం. కమర్షియల్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ‘సామి’తో నాకు పెద్ద హిట్ ఇచ్చి, నన్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టాడు హరి. ఎప్పటి నుంచో ‘సామి’ చిత్రానికి సీక్వెల్ చేయాలనుకున్నా... 15 ఏళ్లు పట్టింది. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే కనిపించాల్సి వచ్చింది. అందుకు కెమెరామెన్ వెంకటేశ్ కష్టపడ్డారు’’ అని హీరో విక్రమ్ అన్నారు. విక్రమ్ హీరోగా, Mీ ర్తీ సురేష్, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సామి’. బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. విక్రమ్ మాట్లాడుతూ– ‘‘కీర్తీ సురేష్‌కి ‘మహానటి’ సినిమా ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. మా చిత్రంలో ఆమె కామెడీ ట్రాక్‌లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్. అందరం కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా. తెలుగు, తమిళంలో అతి త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు. ‘‘నేను చేసిన ప్రతి సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరి. ‘‘విక్రమ్‌గారి సినిమాలను మేం వదల్లేకపోతున్నాం. 4 రోజుల్లో ఆడియో వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు బెల్లం రామకృష్ణా రెడ్డి. నిర్మాత శిబు, ఆర్ఆర్ సినిమాస్ మహేష్, నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, శోభారాణి, బాబీ సింçహా (విలన్), దుర్గం గిరీష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
సరదాగా ఓ సాంగ్
‘గారెలు, బూరెలు, చక్రాలు, చక్కలు.... ఇవన్నీ డూపే పిజ్జాయే టాపు..’ అంటూ ‘మల్లన్న’ సినిమాలో తెలుగు ఆడియన్స్‌కు తనలోని గాయకుడిని కూడా పరిచయం చేశారు విక్రమ్. ‘సామీ స్క్వేర్’ సినిమా కోసం మరోసారి ఓ పాటను సరదాగా పాడారు విక్రమ్. హీరోయిన్ కీర్తీ సురేశ్‌తో కలిసి ‘పెణ్ణే’ అని సాగే సరదా పాట పాడారు. కీర్తీ సురేశ్ స్క్రీన్‌పై పాడటం ఇది ఫస్ట్ టైమ్. విక్రమ్, కీర్తీ సురేశ్, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు హరి రూపొందించిన యాక్షన్ చిత్రం ‘సామీ స్క్వేర్’. 2003లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం∙‘సామీ’కి ఇది సీక్వెల్. ఇందులో ‘పెణ్ణే...’ అంటూ సాగే ఓ పాటను హీరోహీరోయిన్లు కలిసి పాడారు. ఈ సినిమా తమిళ ఆడియో వేడుక సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇవే కాకుండా ఇది వరకు తను యాక్ట్ చేసిన ‘జెమినీ’ టైటిల్ సాంగ్‌తో పాటు రీసెంట్గా ‘స్కెచ్’ సినిమాలో పాటలను పాడారు విక్రమ్. అలాగు తమిళంలో సూర్య యాక్ట్ చేసిన ‘శ్రీ’కి కూడా విక్రమ్ ఓ పాట పాడారు. ∙కీర్తీ సురేష్, విక్రమ్ -
సామికి జోడీ కుదిరింది
2003లో వచ్చిన ‘సామి’లో విక్రమ్, త్రిష భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. ‘సామి’ సీక్వెల్ ‘సామి స్క్వేర్’లో కూడా త్రిష యాక్ట్ చేస్తారని భావించారందరూ. త్రిష కూడా ముందు ఈ సినిమా కమిట్ అయ్యారు. ఆ తర్వాత క్రియేటీవ్ డిఫరెన్సెస్‌తో ‘సామి స్క్వేర్’ సినిమా నుంచి త్రిష తప్పుకున్నారు. తాజాగా త్రిష ప్లేస్‌లోకి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా వచ్చారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ మూవీలో జాయిన్ అవ్వడం గురించి ఐశ్వర్య మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో ఫుల్ కమర్షియల్ సినిమా ఇప్పటివరకు చేయలేదు. ఈ సినిమా ఆ లోటుని తీర్చేస్తుందని భావిస్తున్నాను. విక్రమ్సార్ పక్కన, హరి సార్ డైరెక్షన్లో యాక్ట్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు. సినిమా ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. -
విక్రమ్ ’సామి’ మోషన్ పోస్టర్ విడుదల
-
ఆ రూమర్స్‌పై కీర్తి సురేష్ ఆగ్రహం!
టాలీవుడ్, కోలివుడ్‌లలో చేతి నిండా అవకాశాలతో బీజీగా ఉంది నటి కీర్తి సురేష్. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కీర్తీ.. ఇటీవల కాలంలో భారీ, ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి లో నటిస్తుండగా.. మరోవైపు తమిళంలో విక్రమ్ సరసన సామీ 2, విజయ్‌తో మరో చిత్రంతో బిజీగా ఉంది. అయితే విక్రమ్ సామీ 2 లో ముందుగా హీరోయిన్గా త్రిషను సెలక్ట్ చేశారు. కానీ.. కొన్ని కారణాల వల్ల సామీ 2 నుంచి త్రిష తప్పుకున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో కీర్తి సురేష్‌ను ఫైనల్ చేశారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు. అయితే త్రిష ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వెనుక కీర్తీ సురేష్ కారణమని ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై కీర్తి మండిపడుతోంది. సంబంధం లేని వ్యవహారంలో తను కారణం అని ప్రచారం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిష తప్పుకోవడానికి నేను ఎలా కారణం అవుతాను? అని ప్రశ్నిస్తోంది. 2003 లో వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్‌గా సామి 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. -
త్రిష ఉన్నారు సామీ
... అంటున్నారు డైరెక్టర్ హరి. ఇంతకీ త్రిష ఎక్కడ ఉన్నారు? ఉన్న సంగతిని హరి ఎందుకు కన్ఫార్మ్ చేస్తున్నారనే విషయానికి వస్తే.. విక్రమ్, త్రిష జంటగా 2003లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘సామీ’కి సీక్వెల్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇందులోనూ కథానాయికగా త్రిషను తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇది జరిగి చాలా రోజులైంది. ఆ తర్వాత మరో కథానాయికగా కీర్తీ సురేష్‌ని తీసుకోవడం, తన పాత్ర నిడివి తక్కువగా ఉందని త్రిష ఫీలై సినిమా నుంచి తప్పుకోవడం జరిగిందనే వార్తలు వచ్చాయి. ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నా’’ అని సోషల్ మీడియా ద్వారా త్రిష స్వయంగా చెప్పారు కూడా. అయితే.. ‘‘ఈ సినిమాలో త్రిష ఉన్నారు’’ అని తాజాగా ఓ ప్రెస్మీట్లో హరి స్పష్టం చేశారు. మరి.. కీర్తీ సురేష్ లేరా? అంటే ఆమె కూడా ఉన్నారు. ముందు కాదన్న త్రిష తర్వాత ఒప్పుకున్నారంటే.. హరి ఆమెను కన్విన్స్ చేసి ఉంటారనేగా అర్థం. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
నాకా హక్కు ఉంది
తమిళసినిమా: నాకా హక్కు ఉంది అంటోంది చెన్నై చిన్నది నటి త్రిష. సంచలనాలకు కేంద్రబిందువుగా పేరొందిన నటీమణుల్లో ముందుండే ఈ బ్యూటీ సమీపకాలంలో కాస్త సైలెంట్ అయ్యిందనుకుంటున్న సమయంలో అలా ఉండడం నా వల్లకాదు అన్నట్లుగా మళ్లీ వివాదాల్లోకి వచ్చేసింది. విక్రమ్, త్రిష నటించిన సామి చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. హరి దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి తాజాగా సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌కు జంటగా నటి త్రిష, కీర్తీసురేశ్లను నాయికలుగా ఎంపిక చేశారు. ఇంతకు ముందు విక్రమ్‌తో ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్ ఈ సామి–2ను రూపొందిస్తున్నారు. చిత్రం షూటింగ్‌కు రెడీ అవుతున్న సమయంలో అనూహ్యంగా త్రిష మీతో నాకు సెట్ కాలేదంటూ వైదొలిగింది. దీంతో షాక్‌కు గురైన చిత్ర నిర్మాత, నిర్మాతల మండలిలో త్రిషపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వివరణ కోరుతూ నిర్మాతల మండలి త్రిషకు నోటీసులు జారీ చేసింది. చిత్రంలో నటి కీర్తీసురేశ్ ప్రాముఖ్యత ఉన్నట్టు, ఆమె కంటే తనకు సన్నివేశాలు తక్కువగా ఉన్నాయని, అందుకే చిత్రం నుంచి తప్పుకున్నట్లు త్రిష పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అసలు కారణం అదికాదట. సోమవారం నిర్మాతల మండలి నోటీస్‌కు బదులిచ్చిన త్రిష అందులో పేర్కొంటూ తాను సామి– 2 చిత్రంలో ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదని, అందువల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగే హక్కు తనకు ఉందని అంది. అంతే కాదు తాను తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేస్తానని, వ్యక్తిగత కారణాల వల్లే తాను సామి–2 చిత్రం నుంచి తప్పుకున్నట్లు వివరణ ఇచ్చిందట. అయితే త్రిష వివరణకు నిర్మాతల మండలి సంతృప్తి చెందిందో లేదో తెలియదుగానీ, సామి–2 చిత్రంలో ఆమెను నటింపజేయడానికి సామరస్య చర్చలు మాత్రం జరుగుతున్నాయని సమాచారం. -
మీతో సెట్ కాదులే సామి!
ఏంటి సామి... పబ్లిగ్గా త్రిష అంత మాట అనేశారు? మీతో సెట్ కాదంటూ వాళ్లకు ఎంత స్ట్రయిట్‌గా చెప్పేశారో? చెన్నై కోడంబాక్కమ్‌లో ఎక్కడ చూసినా ఇప్పుడిదే గుసగుస! అసలేం జరిగింది? అంటే... త్రిషకు నచ్చలేదు. ‘సామి–2’ టీమ్ క్రియేటివిటీ త్రిషకు అస్సలు నచ్చలేదు. దాంతో ‘కష్టమండీ! మీతో నాకు సెట్ కాదులెండి. నేను ఈ సినిమాలో నటించలేను’ అని ‘సామి–2’ టీమ్‌తో చెప్పారట. అంతేనా... ‘‘క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ‘సామి–2’ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా. వాళ్లకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అని ట్వీటారు. అదీ సంగతి! తెర వెనుక వినిపిస్తోన్న గుసగుస ఏంటంటే... విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’లో త్రిషే హీరోయిన్. ఇప్పుడా సిన్మాకి సీక్వెల్‌గా ‘సామి–2’ రూపొందుతోంది. ఈ సీక్వెల్లో త్రిషతో పాటు కీర్తీ సురేశ్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘సామి–2’లో త్రిష కంటే కీర్తీ సురేశ్ రోల్ లెంగ్త్ ఎక్కువట! దాంతో త్రిషకు కోపం వచ్చి, సినిమా నుంచి తప్పుకున్నారట! ఆ సంగతి బయటకు చెప్పకుండా, ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ అని త్రిష అంటున్నారని చెన్నై ఫిల్మ్‌నగర్‌లో చెప్పుకుంటున్నారు. ‘ఆడువారి మాటలకు అర్థాలు వేరులే’ అంటే ఇదేనేమో!! అన్నట్టు... ఈ సామెత పేరుతో వచ్చిన వెంకటేశ్ సినిమాలో హీరోయిన్ త్రిషాయే. -
సమ్మర్లోనే రెండో సామి?
విక్రమ్, త్రిష జంటగా హరి దర్శకత్వంలో 14 ఏళ్ల క్రితం విడుదలైన ‘సామి’ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ పరంగా కేక పుట్టించింది. ఆ తర్వాత ఈ సినిమాను తెలుగు, బెంగాలీ, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. హిట్ ఫార్ములాతో తీసిన ‘సామి’కి స్పెషల్ క్రేజ్ ఉంది. ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి హరి–విక్రమ్ రెడీ అయ్యారట. మొదటి భాగంలో లీడ్ రోల్ చేసిన త్రిష ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేయనుండగా, కీర్తీ సురేశ్‌ను మెయిన్ హీరోయిన్గా తీసుకున్నారట. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 15న స్టార్ట్ కానుందని∙టాక్. ‘సామి’ని సమ్మర్లో విడుదల చేశారు. సీక్వెల్‌ని కూడా వచ్చే సమ్మర్లో రిలీజ్‌కి టార్గెట్ చేశారట.