ఆ రూమర్స్‌పై కీర్తి సురేష్‌ ఆగ్రహం! | I'm a no nonsense actress: Keerthy Suresh | Sakshi
Sakshi News home page

ఆ రూమర్స్‌పై కీర్తి సురేష్‌ ఆగ్రహం!

Published Tue, Feb 6 2018 4:35 PM | Last Updated on Tue, Feb 6 2018 4:59 PM

 I'm a no nonsense actress: Keerthy Suresh - Sakshi

టాలీవుడ్‌, కోలివుడ్‌లలో చేతి నిండా అవకాశాలతో బీజీగా ఉంది నటి కీర్తి సురేష్‌

టాలీవుడ్‌, కోలివుడ్‌లలో చేతి నిండా అవకాశాలతో బీజీగా ఉంది నటి కీర్తి సురేష్‌. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కీర్తీ.. ఇటీవల కాలంలో భారీ, ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి లో నటిస్తుండగా.. మరోవైపు తమిళంలో విక్రమ్‌ సరసన సామీ 2, విజయ్‌తో మరో చిత్రంతో బిజీగా ఉంది.

అయితే విక్రమ్‌ సామీ 2 లో ముందుగా హీరోయిన్‌గా త్రిషను సెలక్ట్‌ చేశారు. కానీ.. కొన్ని కారణాల వల్ల సామీ 2 నుంచి త్రిష తప్పుకున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో కీర్తి సురేష్‌ను ఫైనల్‌ చేశారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు. అయితే త్రిష ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వెనుక కీర్తీ సురేష్‌ కారణమని ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారంపై కీర్తి మండిపడుతోంది. సంబంధం లేని వ్యవహారంలో తను కారణం అని ప్రచారం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిష తప్పుకోవడానికి నేను ఎలా కారణం అవుతాను? అని ప్రశ్నిస్తోంది. 2003 లో వచ్చిన సామి చిత్రానికి సీక్వెల్‌గా సామి 2 తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement