
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. మహానటిగా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న కీర్తి సురేశ్.. ఇటీవలే దసరా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిత్రం భోళాశంకర్‌లో చిరు చెల్లెలిగా కనిపించనుంది. అంతేకాకుండా కోలీవుడ్‌లో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం మామన్నన్‌లో హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేశ్‌కు మరోసారి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని ప్రశ్నించగా.. దీనిపై కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చింది.
(ఇది చదవండి: కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!)
పెళ్లి వార్తలపై కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'నా పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చా. మీరంతా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు? నా పెళ్లిపై మీరెందుకు అంత ఆసక్తి చూపుతున్నారు? నా వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నాక నేనే స్వయంగా ప్రకటిస్తా. దీని గురించి ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ప్రెస్ మీట్‌లో ప్రశ్నించాల్సిన పని లేదు.' అంటూ సమాధానమిచ్చింది. ఈ మాటలతో కీర్తి సురేశ్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టమవుతోది. దీంతో ఆమె పెళ్లిపై కొనసాగుతున్న ఊహాగానాలన్నింటికీ తెరపడినట్లైంది. కాగా.. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే.
కాగా.. కీర్తి దసరా సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రం తమిళంలో అజిత్ కుమార్ నటించిన వీరమ్ చిత్రానికి తెలుగు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి నటించిన మామన్నన్ ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతోంది.
(ఇది చదవండి: Simbu: సైడ్ అయిన బాలీవుడ్ బ్యూటీ, శింబు మూవీలో కీర్తి సురేశ్!)
Comments
Please login to add a commentAdd a comment