'ఐ యామ్ నాట్ సింగిల్'.. దసరా భామ ఆసక్తికర కామెంట్స్! | Keerthy Suresh Latest Comments About Her Marriage rumours | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: గతంలో పెళ్లిపై రూమర్స్.. క్లారిటీ ఇచ్చేసిన కీర్తి సురేశ్!

Published Fri, Aug 9 2024 3:51 PM | Last Updated on Fri, Aug 9 2024 5:00 PM

Keerthy Suresh Latest Comments About Her Marriage rumours

దసరా హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుమన్‌కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తొలిసారి కోలీవుడ్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.

ఇదిలా ఉండగా కీర్తి సురేశ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరు సింగిల్‌గా ఉంటున్నారు కదా? అని ఆమెను ప్రశ్నించారు. దీంతో తన రిలేషన్‌షిప్‌ గురించి దసరా భామ నోరువిప్పారు. దీనికి బదులిస్తూ.. 'నేనేప్పుడు సింగిల్ అని చెప్పలేదుగా' అమటూ సమాధానమిచ్చింది.

కాగా.. గతంలో ఆమె పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్‌ చేసిన కామెంట్స్ నెట్టంటి తెగ వైరలవుతున్నాయి. అయితే తాను సింగిల్‌ కాదని చెప్పడంపై.. ఇప్పటికే రిలేషన్‌లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పరోక్షంగా హింట్‌ ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు కీర్తి సురేశ్ బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. బేబీ జాన్‌ సినిమాతో వరుణ్‌ ధావన్‌ సరసన నటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement