‘లక్ష్మీ నరసింహా’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ పవర్ పుల్ పోలీసాఫీర్‌గా నటించిన ఆ సినిమా తమిళ సినిమాకు రీమేక్. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘సామి’ సినిమాను తెలుగులో బాలకృష్ణ రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సామి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. ఇటీవలే తమిళ్ మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్‌చేశారు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్వామి స్క్వేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.