అపరిచితుడు తర్వాత సామి | Saamy Square director Hari on star Vikram | Sakshi
Sakshi News home page

అపరిచితుడు తర్వాత సామి

Published Fri, Sep 21 2018 2:41 AM | Last Updated on Fri, Sep 21 2018 2:41 AM

Saamy Square director Hari on star Vikram - Sakshi

బెల్లం రామకృష్ణారెడ్డి, విక్రమ్‌

విక్రమ్‌ హీరోగా హరి దర్శకత్వంలో 15 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పుడు  ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి’ పేరుతోనే తెరకెక్కిన చిత్రం నేడు విడుదల కానుంది. ఇందులో కీర్తీ సురేష్, ఐశ్వర్యా రాజేష్‌ కథానాయికలు. బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్‌ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి  మాట్లాడుతూ– ‘‘సామి’ సినిమా సెన్సార్‌ కాదు.. రిలీజ్‌ కాదు అని కొందరు రూమర్లు క్రియేట్‌ చేశారు. వాటిని అధిగమించి సెన్సార్‌ పూర్తి చేసుకుని సుమారు 600 నుంచి 700 థియేటర్లలో ఈ రోజు సినిమాను విడుదల చేస్తున్నాం.

ఈ మూవీకి ఇంత క్రేజ్‌ రావడానికి కారణం దర్శకుడు హరి. ఈ సినిమా రషెస్‌ని ఫ్యామిలీతో కలిసి చూసిన విక్రమ్‌ ఎమోషన్‌ అయి, హరిని హగ్‌ చేసుకున్నారట. ‘నా కెరీర్‌లో ‘అపరిచితుడు’ చిత్రం తర్వాత ‘సామి’ బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రం అవుతుంది. నాకు మైలురాయి చిత్రం ఇచ్చారు’ అని ఎమోషనల్‌ అయ్యారట. ఈ విషయం తెలిసి మేం హ్యాపీగా ఫీలయ్యాం. ఈ చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ కాబోతోందనే టాక్‌ ఇప్పటికే వచ్చేసింది. మదర్‌ సెంటిమెంట్‌యాక్షన్, దేవిశ్రీ ప్రసాద్‌గారి పాటలు.. అన్నీ హైలైట్‌గా ఉంటాయి’’ అన్నారు. విక్రమ్, హరి పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement