త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది..! | hero Vikram Special Chit Chat With Sakshi | Sakshi
Sakshi News home page

నేడు తెరపైకి సామిస్క్వేర్‌

Published Fri, Sep 21 2018 8:56 AM | Last Updated on Fri, Sep 21 2018 8:56 AM

hero Vikram Special Chit Chat With Sakshi

సినిమా: సామిస్క్వేర్‌ చిత్రం వేరే లెవల్‌లో ఉంటుంది అంటున్నారు చియాన్ విక్రమ్‌. తాజాగా ఈయన తండ్రీకొడుకులుగా నటించినఫుల్‌ మాసాలాతో కూడిన యాక్షన్‌ ఓరి యెంటెడ్‌ కథా చిత్రం సామి స్క్వేర్‌. కమర్శియల్‌ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ చిత్రం ఇంతకు ముందు ఇదే కాంబినేషన్‌లో రూపొంది సంచలన విజయాన్ని సా ధించిన సామి చిత్రానికి సీక్వె ల్‌. కీర్తీసురేశ్, ఐశ్వర్యరాజేశ్‌ హీరోయిన్లుగా నటించిన ఇందులో నటుడు బాబీసింహా ప్రతినాయకుడిగా నటించడం విశేషం. ప్రభు ముఖ్యపాత్రను పోషించిన ఈ భారీ చిత్రాన్ని తమీన్స్‌ ఫిలింస్‌ పతాకంపై శింబు తమీన్‌ నిర్మించారు. సామిస్క్వేర్‌ భారీ అంచనాల మధ్య శుక్రవారం తెరపైకి రానుంది. సామి పేరుతో తెలుగులోనూ ఏక కాలంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు గురువారం పత్రికల వారితో ముచ్చటించారు. అవేంటో చూద్దాం.

ప్ర: సామి వంటి సంచలన విజయం సాధించిన చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సామిస్క్వేర్‌ చిత్రం ఎలా ఉంటుంది?
జ: సామిస్క్వేర్‌ చిత్రం అంతకంటే వేరే లెవల్‌లో ఉంటుంది. లవ్, హై ఓల్టేజ్‌ యాక్షన్‌ అంటూ చిత్రం జెట్‌ వేగంలో సాగుతూ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తుంది. ఇందులో నేను తండ్రి కొడుకుగా ద్విపాత్రాభినయం చేశాను.

ప్ర: త్రిష నటించాల్సిన పాత్రలో ఐశ్వర్యరాజేశ్‌ నటన గురించి?
జ: త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది. అయితే ఐశ్వర్యరాజేశ్‌ నటన ప్రశంసలు అందుకుంటుంది.

ప్ర: సామి చిత్ర దర్శకుడు హరికి ఇప్పటి హరికి తేడా చూశారా?
జ: హరి గురించి చెప్పాలం టే ఆయన ట్రెండ్‌కు తగ్గట్టుగా అప్‌డేట్‌ అవుతుంటారు. సామిస్క్వేర్‌ చిత్రాన్ని ఆయన మరింత ట్రెండీగా తెరకెక్కించారు. ఆయనలో వేగం మరింత పెరిగింది.

ప్ర: ఏ తరహా పాత్రను చేయాలని కోరుకుంటున్నారు?
జ: సేతు, పితామగన్, దైవతిరుమగళ్, ఐ, ఇరుముగన్‌ ఇలా నా చిత్రాలు గమనిస్తే ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలనే పోషించాను.  నటనకు అవకాశం ఉన్న మంచి యాక్షన్‌ కలిసిన పాత్రలో నటించాలని ఉంది.

ప్ర: ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. అలాం టి చిత్రంలో నటించాలని కోరుకుంటున్నారా.
జ: అలాంటివి అమరాలి. ఇంతకు ముందు ఒకటి రెండు బయోపిక్‌ చిత్రాల్లో నటించమని అడిగారు కానీ, అవి మెటీరలైజ్‌ కాలేదు. అయితే సావిత్రి లాంటి బయోపిక్‌ కథా చిత్రం అమిరితే నటించడానికి రెడీ.

ప్ర: మీ అబ్బాయి దృవ్‌ నటిస్తున్న వర్మ చిత్రం గురించి?
జ:
వర్మ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఆ చిత్రం గురించి దర్శకుడు బాలా చూసుకుంటారు.

ప్ర: మీరు మీ కొడుకు దృవ్‌తో కలిసి నటిస్తారా?
జ:మంచి కథ లభిస్తే కచ్చితంగా నటిస్తాను.

ప్ర: తదుపరి చిత్రాలు?
జ: ప్రస్తుతం గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో ధ్రువనక్షత్రం చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాను. తదుపరి హిస్టారికల్‌ చిత్రం కర్ణన్‌ చేయనున్నారు. అదే విధంగా కమలహాసన్‌ నిర్మించనున్న చిత్రంలోనూ నటించనున్నాను. ఇవి పూర్తి అయిన తరువాతే కొత్త చిత్రాలను అంగీకరిస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement