
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్- పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొడుతోంది. కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.325 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం ఒక్క తమిళనాడులోనే రూ.130 కోట్లకుపైగా కలెక్షన్లతో దూసుకెళ్తోేంది. తమిళంలో గతంలో విడుదలైన రోబో 2.0, విక్రమ్ తర్వాత పొన్నియిన్ సెల్వన్ మూడోస్థానంలో కొనసాగుతోందని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు.
సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడలో రిలీజైంది. పదో శతాబ్దంలోని చోళ రాజుల ఇతివృత్తం ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో చిత్రీకరించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment