థియేటర్ వద్ద పొన్నియన్ సెల్వన్ తారల సందడి.. అభిమానుల కోలాహాలం | Ponniyin Selvan Stars Rushed At Theatre In Chennai Today | Sakshi
Sakshi News home page

Ponniyin Selvan Part One: చెన్నైలో సందడి చేసిన పొన్నియన్ సెల్వన్ టీం

Published Fri, Sep 30 2022 6:13 PM | Last Updated on Fri, Sep 30 2022 6:49 PM

Ponniyin Selvan Stars Rushed At Theatre In Chennai Today - Sakshi

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ 'పొన్నియిన్ సెల్వన్-1'. కల్కి కృష్ణ మూర్తి రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నారు. అందులో ఇవాళ మొదటి భాగం విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రాన్ని చూసేందుకు వచ్చిన నటీనటులు చైన్నైలోని ఓ థియేటర్‌ వద్ద సందడి చేశారు. చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష‍్మి మొదటి రోజు మొదటి షోను ఎంజాయ్ చేశారు. అభిమాన నటీనటులు థియేటర్లకు రావడంతో ఫ్యాన్స్ టపాసులు కాలుస్తూ హోరెత్తించారు. 

(చదవండి: పొన్నియన్‌ సెల్వన్‌: ఐశ్వర్యరాయ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?)

పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘చియాన్‌’ విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, ‘జయం’ రవి, త్రిష, కార్తి లాంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement