'పొన్నియన్​ సెల్వన్'​ రిలీజ్​ డేట్​ ప్రకటన.. సూపర్బ్​గా ఐశ్వర్య రాయ్​, త్రిష పోస్టర్స్​ | Mani Ratnam Ponniyin Selvan Movie Release Date Out With Posters | Sakshi
Sakshi News home page

Ponniyin Selvan Movie: మణిరత్నం డ్రీమ్​ ప్రాజెక్ట్​ మూవీ​ రిలీజ్ డేట్​ ప్రకటన.. ఆకట్టుకుంటున్న తారల పోస్టర్స్​

Published Wed, Mar 2 2022 8:15 PM | Last Updated on Wed, Mar 2 2022 8:26 PM

Mani Ratnam Ponniyin Selvan Movie Release Date Out With Posters - Sakshi

Mani Ratnam Ponniyin Selvan Movie Release Date Out With Posters: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్​ ప్రాజెక్ట్​ చిత్రం 'పొన్నియన్​ సెల్వన్' చిత్రం. మద్రాస్​ టాకీస్​తో కలిసి లైకా ప్రొడక్షన్స్​ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్​, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్​. ఈ ఏడాది సెప్టెంబర్​ 30న 'పొన్నియన్​ సెల్వన్'​ పార్ట్​ 1ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 
 

దీంతోపాటు ఐశ్వర్య రాయ్​, త్రిష, విక్రమ్​, జయం రవి, కార్తీ ఫస్ట్​ లుక్​లను కూడా రిలీజ్​ చేశారు. ఈ పోస్టర్​లలో ఐశ్వర్య రాయ్​, త్రిష యువరాణుల్లాగా కనిపించగా విక్రమ్​, జయం రవి యుద్ధ వీరుల్లాగా దర్శనమిచ్చారు. ఇక కార్తీ విభిన్నమైన లుక్​లో అలరించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్​లు సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతున్నాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు ఆస్కార్​ గ్రహిత ఏఆర్​ రెహమాన్​ సంగీతం అందిస్తున్నారు. మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్​ ఏమేరకు సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement