
దర్శకుడు మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. పదో శతాబ్దంలోని చోళరాజుల ఇతివృత్తంతో ఈ మూవీని తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మళయాళ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ వసూళ్లను అధిగమించింది.
(చదవండి: పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు.. ఐదురోజుల్లో ఎన్ని కోట‍్లో తెలుసా?)
కేవలం విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.355 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరల్డ్‌వైడ్ ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సాధించిన రూ.340 కోట్ల మార్కును దాటేసింది. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ప్రకాశ్ రాజ్, ఐశ్వర్యరాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment