Saami Saami Song Viral: Man Dressed In Kurta And Skirt Dances To Pushpa Song - Sakshi
Sakshi News home page

Pushpa Song: స్కర్ట్‌ వేసుకొని యువకుడి డ్యాన్స్‌.. మామూలుగా లేదుగా..

Published Wed, Apr 13 2022 12:00 PM | Last Updated on Wed, Apr 13 2022 1:19 PM

Man Dressed In Kurta And Skirt Dances To Pushpa Song - Sakshi

వాషింగ్టన్‌: పుష్ప మూవీలో ‘సామి సామి’ సాంగ్‌ ఎంత ఫేమస్‌ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్‌పై ఎంతో మంది వేసిన డ్యాన్స్‌ స్టెప్పులు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ట్రెండింగ్‌లో నిలిచాయి. తాజాగా ఈ పాటకు ఓ యువకుడు.. అమ్మాయిలు ధరించే స్కర్ట్ వేసుకొని వేసిన స్టెప్పులు మాములుగా లేవు. చాలా హుషారుగా, ఫుల్ ఎనర్జీతో డాన్స్ వేశాడని నెటిజన్లు ప్రశంసిస్తునారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

భారతీయుడైన కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా తరచూ అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకొని ఆమెరికాలో డ్యాన్స్‌లు చేస్తున్నాడు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ నృత్యాలను బాగా నేర్చుకున్నాడు. ఇప్పుడు వాటిని అమెరికాలో ప్రదర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నాడు. డాన్స్ చేస్తూనే ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. తాజాగా అతను స్కర్ట్ ధరించి... అమెరికా వీధుల్లో పుష్ప సినిమాలోని సామి సామి పాటకు డాన్స్ చేశాడు. ఆ వీడియో సూపర్ వైరల్ అయ్యింది. 

అంతకు ముందు.. గంగూభాయ్ కతియావాడి సినిమాలోని ఝూమ్ రే గోరీ సాంగ్‌కి అదిరిపోయే గార్భా స్టెప్స్ వేశాడు. సినిమాలో ఈ సాంగ్‌ని అలియాభ్‌తో పిక్చరైజ్ చేయగా.. జైనిల్ అంతకుమించి అంటూ లైవ్‌లోనే స్పెషల్‌ పెర్ఫార్మెన్స్ చూపించి వావ్‌ అనిపించుకున్నాడు. కాగా, ఇతడి డ్యాన్స్‌లను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుడగా.. మరికొందరు మాత్రం.. అమ్మాయిల డ్రెస్సులే ఎందుకు వేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement